స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్‌ 'సిస్టమ్‌'


స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే ప్రపంచమే మనచేతిలో ఉన్నట్టు. చిటికెలో సమస్త సమాచారం మన సొంతం. ఆన్‌లైన్‌లో అన్ని విషయాలూ తెలుసుకోవచ్చు. అయితే... మొబైల్‌ ద్వారా ఎన్ని సౌలభ్యాలున్నా దీనిని కొన్ని విషయాల్లో కంప్యూటర్‌తో కంపేర్‌ చేయలేం. పలు ముఖ్యమైన పనులు కంప్యూటర్‌లో మాత్రమే చేయగలం. మరి.. స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్‌లా వాడటం సాధ్యం కాదా..? అనంటే కచ్చితంగా అవుతుందనే చెప్పాలి.
అన్ని పనులు కాకపోయినా కొన్నయినా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం... Google Docs కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటున్నారా..? ఇందుకు 'గూగుల్‌ డాక్‌' యాప్‌ ఉపయోగపడుతుంది. గూగుల్‌ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్‌ ద్వారా ఉచితంగా డాక్యుమెంట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ ఓపెన్‌ చేసుకోవచ్చు. Microsoft Office గూగుల్‌ డాక్‌ లాంటిదే ఈ యాప్‌ కూడా. తన విండోస్‌ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ దీనిని డెవలప్‌ చేసింది. దీనిని కూడా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ యాప్‌ ద్వారా డాక్యుమెంట్లు ఓపెన్‌ చేసుకోవచ్చు. Docs To Go 'డాక్స్‌ టు గో' యాప్‌ ద్వారా అద్భుత ఫీచర్లు పొందొచ్చు. డెటా విజ్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు బహు సౌకర్యవంతంగా ఉంది. కంప్యూటర్‌ స్థాయిలో దీనిని ఉపయోగించుకోవచ్చు. మల్టీపుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ అకౌంట్స్‌, డెస్క్‌టాప్‌ ఫైల్‌ సింక్‌, ఓపెనింగ్‌ పాస్‌వర్డ్‌-ప్రొడెక్టెడ్‌ ఫైల్స్‌ తదితర ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. OfficeSuite + PDF Editor
గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అవుతున్న యాప్‌లలో 'ఆఫీస్‌సూట్‌ ం పీడీఎఫ్‌ ఎడిటర్‌' ఒకటి. దీని ద్వారా డాక్యుమెంట్లను సులువుగా వీక్షించొచ్చు. ఎడిట్‌ కూడా చేసుకోవచ్చు. కొత్త వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌ డాక్యుమెంట్లను సులువుగా సృష్టించొచ్చు. వాటిని పీడీఎఫ్‌్‌లుగా మార్చడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ యాప్‌లో ఉన్నాయి. WPS Office + PDF ఈ యాప్‌ ద్వారా అన్ని మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఫైల్స్‌ హ్యాం డిల్‌ చేయొచ్చు. అంతేకాకుండా వాటిని గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌ బాక్స్‌లతో సింక్‌ చేసుకోవచ్చు. Polaris Office ఈ ఆఫీస్‌ సూట్‌ యాప్‌ ద్వారా డాక్యుమెంట్లను సులువుగా వీక్షించొచ్చు. ఎడిట్‌ కూడా చేసు కోవచ్చు. క్లౌడ్‌ సపోర్ట్‌తో వస్తున్న ఈ అప్లికేషన్‌ ద్వారా గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ వంటి సర్వీసుల నుంచి ఫైల్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.Polaris Officeఈ యాప్‌ ముఖ్యమైన నోట్స్‌, ఫొటోలు, రిమైండర్లను మేనేజ్‌ చేస్తుంది.ఉబ్‌శ్రీశీశీసమైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న ఈ-మెయిల్‌ యాప్‌ అవుట్‌లుక్‌. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అన్ని సర్వీసులతోనూ దీనిని అనుసంధానం చేసుకోవచ్చు.Polaris Officeనిఘంటువు కొరతను తీర్చే అద్భుత అప్లికేషన్‌ ఇది. ఈ యాప్‌ ద్వారా డిక్షనరీతోపాటు గ్రామర్‌ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవచ్చు.File Manager (File transfer)ఈ యాప్‌ ద్వారా ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

Followers