Showing posts with label GK Bits. Show all posts
Showing posts with label GK Bits. Show all posts

మిస్ యూనివర్స్‌ 2015 సుందరి పౌలినా వేగా


 

కొలంబియాకి చెందిన సుందరి పౌలినా వేగా 2015 సంవత్సరానికి మిస్ యూనివర్స్‌గా ఎంపికైంది. మియామీలో జరిగిన మిస్ యూనివర్స్ ఎంపిక వేడుకలో పౌలినా వేగా విజేతగా నిలిచింది. అనేక దేశాల నుంచి కళ్ళు చెదిరే సుందరీమణులు ఈ కిరీటం కోసం పోటీపడ్డారు. చివరికి కొలంబియా సుందరి పౌలినా వేగా ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది.
 sundare-mis-yunivars-2015 in telugu

'ప్లానింగ్‌'కు ప్రత్యామ్నాయ అన్వేషణ


నవ భారత నిర్మాణానికి పంచవర్ష ప్రణాళికలు ఎంతో దోహదం చేస్తాయని త్రికరణ శుద్ధిగా విశ్వసించడం వల్లే తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వాటిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని కూడా ఆయన ఆశించారు. ప్రజా సంక్షేమానికి తోడ్పడే పథకాల రూపకల్పనకు జాతీయ స్థాయిలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే ఆయన ప్రారంభించిన సంస్థలూ, కార్యక్రమాలు క్రమంగా గాడి తప్పడం ప్రారంభమైంది, సోవియట్‌ యూనియన్‌ ఆదర్శంగా సమసమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. ఆరోజుల్లో సోషలిజం అనే పదాన్ని ఎంతో పవిత్రమైనదిగా పాలకులు భావించేవారు. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడం, అమెరికా సారథ్యంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడటంతో సోషలిజం క్రమంగా కనుమరుగు కావడం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో నెహ్రూ కాలం నాటి పాలనా విధానాలు, సంప్రదాయాలు ఇంకా కొనసాగడం అవసరమా అన్న చర్చ ఇదివరకే ప్రారంభమైంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు అనివార్యం కావడంతో అన్ని దేశాలూ ఇప్పుడు ఆర్థిక సంస్కరణల వైపు ఎదురుచూస్తున్నాయి.మన దేశంలో వీటిని తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని దివంగత పీవీ
నరసింహారావుదే. ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో శ్రద్ధ తీసుకున్నారు.దాంతో ఆర్థిక వ్యవస్థ గట్టెక్కింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల అమలు పేరిట ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని ప్రారంభించింది. ఏటా పన్నెండు వేల కోట్ల రూపాయిల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం అప్పట్లో జోరుగా సాగింది. ఆర్థిక సంస్కరణలంటే ప్రభుత్వ రంగ సంస్థల విక్రయమన్న వ్యంగ్యోక్తులు తరచుగా వినిపించేవి. నెహ్రూ కాలంలో ప్రభుత్వ సంస్థలను ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సంస్థల్లో కొన్నింటికి ఆ తర్వాత 'నవరత్నాలు'గా నామకరణం చేయడం జరిగింది. నవరత్నాలుగా పేరొందిన సంస్థల్లో వాటాలను సైతం విక్రయించే ధోరణి ఎన్‌డిఎ హయాంలోనే ప్రారంభమైంది.ఎన్‌డిఏ ఆర్థిక సంస్కరణలను ఎద్దేవా చేసిన కాంగ్రెస్‌ పదేళ్ల క్రితం సంకీర్ణ ప్రభుత్వానికి తొలిసారిగా నేతృత్వం వహించినప్పుడు తాను చేసింది కూడా అదే. ప్రైవేటీకరణకు పెద్ద పీట వేయడమే ఆర్థిక సంస్కరణల నిర్వచనంగా స్థిరపడిపోయింది. నెహ్రూ వారసత్వాన్ని ఆయన వారసులమని చెప్పుకునే వారే పాటించనప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన బిజెపి పాటించాల్సిన నైతిక ధర్మం ఏమీ లేదు.అందుకే, నెహ్రూ కాలం నాటి ప్రణాళికా సంఘం స్థానే కొత్త వ్యవస్థ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు ప్రారంభించారు.వాటిని అమలులో పెట్టేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆయన కోరుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆయన సోషల్‌ వెబ్‌సైట్లపై ఎక్కువ ఆధారపడుతున్నారు.తన మ ంత్రివర్గ సహచరులను కూడా ఇదే పద్దతి పాటించమని ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా సలహా ఇస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో కమ్యూనిస్టు చైనా మనకన్నా ఎంతో ముందు ఉంది. ప్రణాళికాబద్దమైన అభివృద్ధి ఆదర్శంగానే మిగిలిపోయింది.అరవై ఏడేళ్ళ స్వతంత్ర భారత దేశంలో అభివృద్ధి అసలు జరగలేదని ఎవరూ అనలేరు.అయితే,అంతకు ఎన్నో రెట్లు పెరిగిన అవినీతి అభివృద్ధిని మింగేసింది. అలాగే,పంచవర్షప్రణాళికల లక్ష్యం మంచిదే అయినా,వాటి అమలులో వేల కోట్ల రూపాయిల ప్రజాధనం స్వాహా కావడం వల్ల ప్రణాళికలు విఫల ప్రయోగం అనే విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి ఆ వైఫల్యం ప్రణాళికలది కాదు.వాటిని అమలు జరిపిన పాలకులది.వివిధ కార్యక్రమాలకూ, ప్రాజెక్టులకూ, పథకాలకూ జరిగిన కేటాయింపులు పొల్లుపోకుండా ఖర్చు జరిగి ఉంటే ప్రణాళికల ఫలితాలు అమోఘంగా చరిత్ర లిఖితమై ఉండేవి. పాలకుల్లో నిర్లిప్తత, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి పోవడం వల్లే ప్రణాళికలన్నీ నీరుగారి పోయాయి. ప్రణాళికా సంఘం పాత్ర కాలక్రమంలో కుంచించుకుని పోతూ వస్తోంది. ఆర్థిక నిపుణులు, ప్రణాళికా రచయితల అభిప్రాయాలను తోసిరాజని అధికారంలో ఉన్న నాయకులు తమకు అనుకూలమైన రీతిలో ప్రణాళికల్లో మార్పులు చేయించుకోవడం వల్లే అవి నిర్వీర్యం అవుతూ వస్తున్నాయి. అలాగే, ప్రణాళికా పెట్టుబడుల కేటాయింపులు సక్రమంగా, సంపూర్ణంగా ఖర్చు కాకపోవడం,ఖర్చు కాని నిధులను మరుసటి సంవత్సరానికి సర్దుబాటు చేయడం వంటి వాటి వల్ల కూడా ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు.దారిద్య్ర రేఖకు దిగువన జీవించే(బీపీఎల్‌) కుటుంబాల నిర్ధారణ విషయంలో ప్రణాళికా సంఘం నియమించిన టెండూల్కర్‌ కమిటీ రూపొందించిన లెక్కలు అపహాస్యం పాలయ్యాయి. జీవన వ్యయం పెరిగినా, ధరలు మండిపోతున్నా పట్టణాల్లో రోజుకు 37 రూపాయిలు, పల్లెల్లో 28 రూపాయిలు ఖర్చు చేయగలిగిన వారిని బిపిఎల్‌ కుటుంబాల పరిధి నుంచి తప్పించవచ్చన్న ఈ కమిటీ సిఫార్సులపై దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. ఈ లెక్కలు శాస్త్రీయంగా లేవని ప్రణాళికా రంగంలో తలపండిన మేధావులు సైతం స్పష్టం చేశారు.దేశంలో దారిద్య్రం తగ్గి పోయిందనే అభిప్రాయాన్ని సృష్టించడం కోసమే ఈ లెక్కలు తయారు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.యూపీఏ ప్రభుత్వం తాను అమలు జేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కారణంగా దారిద్య్రం బాగా తగ్గి పోయిందని గొప్పలు చెప్పుకుంది. దానికి అనుగుణంగానే ఈ లెక్కలను తయారు చేసినట్టుగా మేధావులు నిరూపణ చేయగలిగారు. ఈ నేపధ్యం నుంచి చూసినప్పుడు ప్రణాళికా సంఘం అస్తిత్వం ఏ మేరకు ఉన్నదో, ఏ స్థాయిలో ఉందో ఎవరైనా నిర్ధారణకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి వ్యవస్థను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదని మోడీ భావించి ఉండవచ్చు. అందుకే, ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టారు.అయితే, కాంగ్రెస్‌పైనా, నెహ్రూ వారసత్వంపైనా గుడ్డి వ్యతిరేకతతో ఆయన ప్రణాళికా సంఘంపై వేటు వేయదల్చుకున్నారంటూ పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు,నిజానికి వారిదే మూఢ నమ్మకం, నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పిననాటికీ,ఇప్పటికీ జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి.మార్పులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం వంటి వ్యవస్థల్లో మార్పులు చేసుకోవడంలో తప్పు లేదు. సరికదా అవసరం కూడా. అంతిమంగా ప్రజలకు మేలు చేకూరడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలి.పిడి వాదం ఎప్పుడూ ప్రమాదకరమే.
by Prabha News


ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ?




1. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో కోటిలింగాల వద్ద దొరికిన నాణేలు ఎవరికి చెందినవి ? – శ్రీముఖుడు
2. శాతవాహనుల కాలంలో నగర పాలన ఎవరి ద్వారా జరిగేది ? - నిగమ సభ
3. ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో వారని అశోకుని ఎన్నో శిలాశాసనం తెలుపుతుంది ?- 13వ శిలా శాసనం
4.కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు ? – హాలుడు
5. ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది ? - వాశిష్టిపుత్ర పులోమావి
6. శాతవాహనుల కాలంలో పల్నాడు ప్రాంతం దేనికి ప్రసిద్ధి ? – వజ్రాలు
7. శాతవాహనుల కాలం నాటి కొడాయిరాను ప్రస్తుతం ఎలా పిలుస్తున్నారు ? – ఘంటసాల
8. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటి సారి ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది ? – రుగ్వేదానికి
9. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎక్కడ ఉంది ? - కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం
10.గుణాఢ్యుడు రచించిన బృహత్కథ ఏ భాషలో ఉంది ? – పైశాచి
11.శాతవాహనుల కాలంనాటి తొలి గుహ చైత్యాలు ఎక్కడ ఉన్నాయి ? – గుంటుపల్లి
12.విష్ణు కుండినులు పోషించిన భాష ? – సంస్కృతం
13. మంచికల్లు శాసనం ఏ వంశ రాజుల గురించి తెలుపుతుంది ? – పల్లవులు
14. 108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు ? – రెండో విజయాదిత్యుడు

15. ఐవోల్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలుపుతుంది ? - రెండో పులకేశి
16. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి ? - కృష్ణా
17.బైరవ కొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ? - నెల్లూరు
18. విష్ణు కుండినుల రాజధాని ? - వినుకొండ
19.రేనాటి చోళుల మూల పురుషుడు ?- కరికాళ చోళుడు
20. శూన్య వాదాన్ని ప్రభోదించింది ? - ఆచార్యనాగార్జునుడు
21. ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజుల్లో ఎవరికి సమకాలికుడు ? - యజ్ఞశ్రీ పుత్ర శాతకర్ణి
22.శాతవాహనుల నాణేలను ఎలా పిలిచేవారు ? - కర్షపణలు
23. ప్రఖ్యాత శివలింగం గత చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఏ రాజుల కాలానికి చెందింది ? - శాతవాహనులు
24. చేజర్ల శిలాశాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - ఆనంద గోత్రులు
25. జయవర్మ కొండముది శాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - బృహత్పలాయనులు
26.సమస్త గాంధర్వ విద్యల్లో ప్రావీణ్యులైన చెల్లవ్యను పోషించిన రాజు? - మొదటి చాళుక్య భీముడు
27. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త ? - తిక్కన
28.ఆంధ్రదేశంలో హిందూ గుహాలయాలను మొట్టమొదటి సారిగా నిర్మించిన వారు ? - విష్ణు కుండినులు
29. ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ? - మొదటి చాళుక్య భీముడు
30. తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు దేవాలయాల సముదాయాన్ని నిర్మించిన వారు ఎవరు ? - గుణగ విజయాదిత్యుడు
31. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు ఏ దేశంతో అభివృద్ధి చెందాయి ? - రోమ్‌
32.శాతవాహన సామ్రాజ్యాన్ని అంతంచేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వంశం ? - ఇక్ష్వాకులు
33.యజ్ఞశ్రీ పుత్ర వాతకర్ణి వేయించిన నాణేలపై ముద్ర ? - నౌక
34.గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్‌, కార్లే శాసనాలు ఎవరి విజయాలను వివరంగా తెలుపుతాయి ?-గౌతమీ పుత్ర శాతకర్ణి
35. శాతవాహన రాజుల్లో ఘనుడు ? -గౌతమీ పుత్ర శాతకర్ణి
36. గాథా సప్తశతి గ్రంథ సంకలన కర్త ? - హాలుడు
37. నానాఘాట్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలియజేస్తుంది ? - మొదటి శాతకర్ణి
38. సుహ్రృల్లేఖ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ? - ఆచార్య నాగార్జునుడు
39. గిర్నార్‌ శాసనం వేయించిన రాజు ? - రుద్రదాముడు
40. ఇటీవల తవ్వకాల్లో కాల్చిన ఇటుకలతో నిర్మితమైన అతి పెద్ద బౌద్ధస్థూపాన్ని ఎక్కడ కనుగొన్నారు ? - నేలకొండపల్లి
41. శాతవాహన కాలంలో గ్రీకు, రోమన్ల ప్రభావం దేనిపై అధికంగా ఉండేది ? - వాస్తు శిల్పం
42. కళింగ రాజైన ఖారవేలుని సమకాలికుడైన శాతవాహన రాజు ? - రెండో శాతకర్ణి
43. మహాక్షాత్ర రుద్రదామునితో పోరాడిన శాతవాహన రాజు ? - గౌతమీ పుత్ర శాతకర్ణి
44. ఇటీవల భావికొండ వద్ద (భీముని పట్నం) బయటపడిన స్థూపాలు ఎవరి కాలానికి చెందినవి ? - శాతవాహనులు
45. శాలివాహన శకం ఎప్పుడు ప్రారంబమైంది ? - క్రీ.శ78లో

46.  విదేశీ బౌద్ధమత ఆధారాలతో ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు ? - మంజీరక దేశం
47.  అశోకుడి శాసనాలు ఆంధ్రాలో లభించిన ప్రాంతాలు? – యర్రగుడి
48. ఇటీవల ఏలూరు ప్రాంతంలోని గుంటుపల్లిలో లభించిన శాసనం ఎవరి గురించి తెలుపుతుంది ? – ఖారవేలుడు
49. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు ? – ఆహారాలు
50. శాతవాహన కాలంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడింది ? – శ్రేణులు



51. కంటక శిల దేనికి పూర్వ నామము ? –ఘంటసాల
52.అలహాబాద్‌ స్తంభ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు ఎవరు ? – హస్తివర్మ
53. ఉజ్జయినీ రాకుమార్తెను వివాహమాడిన ఐక్ష్వాకు రాజు ఎవరు ? - వీర పురుషదత్తుడు
54. ఈపూరు, పొలమూరు శాసనాలు ఏ రాజు వంశస్తులను గురించి తెలుపుతాయి ? - విష్ణు కుండినులు
55. త్రికూట పూర్వతాధిపతులు ? – శాలంకాయనులు
56. నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడ కొలువదీరి ఉన్నాయి ? -అలంపూర్‌
57. తెలుగులో కుమార సంభవ గ్రంథకర్త ఎవరు ? – నన్నెచోదుడు
58.మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాలు ఏ రాజవశీయుల కాలానికి చెందినవి ? - పశ్చిమ (బాదామి) చాళుక్యులు
59. చోళ తూర్పు చాళుక్య రాజులను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
60. ఆంధ్రాలో వీరశైవ రాజ్యాలను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
61.ఆంధ్రాలో వీరశైవ మతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసిన వారు ? – పందితారాధ్యుడు
62. ఇక్ష్వాకుల రాజధాని ? – విజయపురి
63. ఏ రాజ వంశ కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధమతం విలసిల్లింది ? –ఇక్ష్వాకులు
64. జయవర్మ ఆంధ్ర రాజవంశాల్లో దేనికి చెందినవారు ? - బృహత్పలాయనులు65. శాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు ? – విజయదేవవర్మ
66. శాలంకాయనుల రాజధాని ? – పెదవేగి
67. పల్లవులను ఓడించి దక్షిణాదికి తరిమివేసి కృష్ణానది దక్షిణ తీరప్రాంతాన్ని పాలించిన ఆంధ్ర దేశ రాజులు ? – ఆనందగోత్రులు
68.ఆనందగోత్రుల రాజధాని ? – కందరపురం
69. ఉండవల్లి గుహలయాలు నిర్మించిన రాజులు ? – విష్ణుకుండినులు
70. పల్లవుల రాజధాని ? – కాంచిపురం
71. పల్లవుల రాజ లాంఛనం ? – వృషభం
72. పల్వవ వంశ మూల పురుషుడు ? – వీరకూర్చవర్మ
73. మహాబలి (మామల్ల) పురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవరాజు ? - మొదటి నరసింహవర్మ
74. కులోత్తుంగ చోళ బిరుదాంకెతుడై గంగైకొండ చోళాపురం (చోళరాజ్యం)ను పాలించిన రాజేంద్రుడు ఎవరి కుమారుడు ? - రాజరాజ నరేంద్రుడు
75. తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధ రాజు ? - గుణగ విజయాధిపత్యుడు
76. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు ? - కుబ్జ విష్ణువర్థనుడు
77. రాజారాజ నరేంద్రుని రాజ్య పరిపాలనా కాలం ? - క్రీశ.1019-1061
78. తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి ఎవరు మార్చారు ? - మొదటి అమ్మరాజు
79.శాలంకాయనుల ఆరాధ్య దైవం ? - చిత్రరథ స్వామి
80. వేంగి (తూర్పు) చాళుక్య రాజ్యస్థాపకుడైన కుబ్జ విష్ణువర్ణనుడు ఎవరి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించాడు ? - రెండో పులకేశి
81. రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చిన రాజు ? - పెద్దకోమటి వేమారెడ్డి
82. నేలమల రాజధాని రాచకొండ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? – నల్గొండ
83. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాభివృద్ధికి నిదర్శనం ? - ఉపాసిక బోధి శాసనం
84. ఆనంద గోత్రికులు ఎవరి సామంతులు ? – పల్లవులు
85. మొదటి హిందూ దేవాలయాన్ని కట్టించిన ఆంధ్ర వంశ రాజులు ? – ఇక్ష్వాకులు
86. బృహత్పలాయనుల గురించి తెలిపే ఒకే ఒక ఆధారం - కొండముది శాసనం
87.త్రికూట మలయాధిపతి అను బిరుదు ఎవరిది ? - రెండో మాధవ వర్మ
88.గూడూరు ఏ వంశరాజుల రాజధాని ? – బృహత్పలాయనులు
89. తూర్పు చాళుక్య రాజుల్లో సుప్రసిద్ధుడు ? - గుణగ విజయాదిత్యుడు
90. తొలి చాళుక్యుల నాటి కుడ్య చిత్రాలు (పెయింటింగ్స్‌) ఎక్కడ లభ్యమయ్యాయి ? - అజంతా
 

Followers