ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే


aa sartifiket undaalsinde


ఓ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్ళగోరే అధికారులు తమకు ఎయిడ్స్ గానీ, ఇతర జబ్బులు గానీ లేవని రుజువు చేసే మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. దేశ సంపద- ఆర్థికాభివృద్ది అనే అంశంపై ఆ దేశంలో నెలరోజులపాటు (నవంబర్ 2నుంచి 30వ తేదీ వరకు) శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి అటెండ్ అయ్యే సీనియర్ అధికారులు ఇలాంటి మెడికల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని సిబ్బంది శాఖ తన తాజా సర్క్యులర్‌లో ఆదేశించింది. వాళ్ళు తమ దరఖాస్తులతో బాటు వీటిని కూడా జత చేయాలట.. ఓ పరాయి దేశంలో శిక్షణకు హాజరయ్యేందుకు మానసికంగా, శారీరకంగా తాము అన్ని విధాలా అర్హులమని డాక్టర్ల నుంచి ధ్రువ పత్రాలు తేవాలని, పైగా ఇంగ్లీష్ పై కమాండ్, వాగ్ధాటి, మంచి ఆరోగ్యం ఉండాలని ఆ సర్క్యులర్ లో పీర్కొన్నారు. ఇలాంటి వారికి విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వెసులుబాటు, హెల్త్ ఇన్సూరెన్స్, డైలీ అలవెన్స్ తదితర ప్రయోజనాలన్నీ కల్పిస్తున్నారు.

కేసీఅర్ ని అడ్డుకుంటారా..?


kesiar ni addukuntaara..?


ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ వెళ్ళాలనే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రోడ్డు మార్గాన వెళ్లాలని అనుకున్నా ఆ తరువాత ఈ నిర్ణయం మారిపోయింది. సూర్యాపేట వరకు రోడ్డు మార్గంలో వెళ్లి ఈ నెల 21 వ తేదీ రాత్రి అక్కడే బస చేసి ఆ మరుసటి రోజున అమరావతికి వెళ్లాలని తొలుత భావించారు. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. కేసీ ఆర్ హెలికాప్టర్ లోనే అమరావతి వెళ్ళే కార్యక్రమం ఖరారైంది. రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ను ఏపీలో అడ్డుకోవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చి సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం, ఆయనను కేసీఅర్ సాదరంగా ఆహ్వానించడం వంటి పరిణామాలతో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటున్నాయని భావిస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ను ఏపీలో అడ్డుకునే పరిస్థితి లేదని అంటున్నారు.

Followers