Inter Second Year Civics



భారత రాజ్యాంగం

1.     మితవాదులు (IMP) : -           మితవాద దశ 1885-1905 వరకు కోనసాగింది. దశనే సంస్కరణల దశగా పేర్కోంటారు. ప్రముఖనాయకులైయిన గోఖలే, నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, W.C బెనర్జీ మితవాదనాయకులు వీరు అవలంబించిన పద్థతులు ప్రార్థనలు-విజ్ఞప్తులు-మధ్యవర్తిత్వం”.
2.     అతివాదుల పద్థతులు (IMP) :  - అతివాద దశ 1906-1919 వరకు కోనసాగింది. దశనే తీవ్రజాతీయతా దశగా పేర్కోంటారు.  ప్రముఖనాయకులైయిన తిలక్, లాలాలజపతిరాయ్,బిపిన్ చంద్రపాల్ అతివాదనాయకులు వీరు అవలంబించిన పద్థతులు: 1. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం.   2.  స్వదేశి విధ్యను ప్రోత్సహించడం. 3. స్వదేశి పరిశ్రమలను ప్రోత్సహించడం.
3.     గాంధేయ దశ:-   గాందేయ దశ 1920-1947 వరకు కోనసాగింది. దశనే అహింసా దశగా పేర్కోంటారు. దశలో గాంధీజీ సత్యగ్రహం అనే వినూత్న పద్థని పాటించారు. సహయనిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా మొదలయిన ప్రముఖ ఉధ్యమాలను గాందీజీ దశలో ప్రారంభించేను.
4.     స్వదేశీ ఉధ్యమకారుల కార్యక్రమం:-  స్వదేశీ ఉద్యమం 1903-1908 వరకు కోనసాగింది. ఉధ్యమంలో       1. విదేశి వస్తువులను బహిష్కరించడం.  2. సమ్మెలనిర్వాహణ, 3 స్వదేశి విధ్యను ప్రోత్సహించడం. 4. స్వదేశి పరిశ్రమలను ప్రోత్సహించడం.
5.     శాసనోల్లంఘనోధ్యమం /దండి యాత్ర/ఉప్పు సత్యాగ్రహం (IMP):-   1930 మార్చి 12 గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుండి 78 మంది అనుచరులతో 24 మైళ్ళు దూరాన వున్న దండి గ్రామాన్ని చేరి ఉప్పును తయరి చేసి ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించారు దినిని ఉప్పుసత్యగ్రహం అంటారు.
6.     మింటో – మార్లే సంస్కరణలు:  -                మింటో –మార్లే  సంస్కరణల చట్టం 1909 లో వచ్చింది. ఈ చట్ట రూపకల్పనలో భారత రాజపత్రినిధి లార్ట్ మింటో, భారత వ్యవహరాల కార్యదర్శి లార్ట్ మార్లేలు కీలక పాత్ర పోషించారు. దినిలో ముఖ్యంశాలు 1.ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు.  2.శాసన మండళ్ళ ఎన్నికలు జరిపించడం.
7.     రాజ్యాంగ నిర్మాణ సభ:           భారత రాజ్యాంగ పరిషత్త్ కు 1946 జూలై లో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్త్ లో మొత్తం సభ్యులు 389 మంది, 93 మంది స్వదేశి సంస్థానాలకు చెందిన వారు ఎన్నికలలో 199 మంది కాంగ్రేస్ పార్టీ గెలుసుకోంది, ముస్లింలీగ్ 73 మంది గెలిచారు. మొదటి సమావేశం 1947 Dec 9 న జరిగింది. రాజ్యాంగ పరిషత్త్ అధ్యక్షుడు గా డా.బాబు రాజెంద్రప్రసాద్ ఎన్నికయారు.
8.     రాజ్యాంగ ముసాయిదా కమీటి(IMP):         రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ పరిషత్త్ నియమించిన అనేక కమిటిలలో ముఖ్యమైన కమిటి రాజ్యాంగ ముసాయిదా కమీటి. ఈ కమీటి అధ్యక్షుడు డా.B.R అంబేద్కర్  1947 August 29 న ఏర్పడింది. ఈ కమీటిలో  మొత్తం ఏడుగురు ఉన్నారు. కమీటి ముసాయిదా రాజ్యాంగాన్ని 1947 నవంబరు లో సమర్పించింది.
9.     భారత రాజ్యాంగ ఆధారలు(IMP):     ప్రపంచంలోని అనేక ఇతర రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను భారత రాజ్యాంగంలో పోందుపరచడమైనది.
1.     బ్రిటన్:              పార్లమెంట్ వ్యవస్థ, ఏకపౌరసత్వం
2.    అమెరికా:           ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, సమఖ్యవిదానం
3.    ఐర్లాండ్:            ఆదేశిక సూత్రాలు
4.    రష్యా:               ప్రాథమిక విధులు
5.    కెనడా:              కేంద్ర రాష్ట్ర సంబందాలు
6.    జర్మనీ:             అత్యవసర పరిస్థితి
10.      భారత రాజ్యాంగంలోని దృఢ,అదృఢ లక్షణాలు:     భారత రాజ్యాంగం దృఢ,అదృఢ లక్షణాలను కలిగి ఉంది. కోన్ని అంశాలను సవరించాలంటె చాలా కష్టతరమైనవి అవి: రాష్ట్రపతి ,సుఫ్రింకోర్టు, హైకోర్టు అధికారాల విషయలలో ను, కేంద్ర రాష్ట్ర సంబందాల వంటి అంశాలను సవరించడం కష్టం. ఇవి దృఢ లక్షణాలు. కోన్ని అంశాలను సవరించాలంటె చాలా తెలిక అవి: రాష్టాల పేర్లు,సరిహద్దులు.ఇవి అదృఢ లక్షణాలు.
11.      ప్రవేశిక/పిఠిక(IMP):             భారత రాజ్యాంగం లక్షణాలలో ప్రదానమైనది ప్రవేశిక. భారత రాజ్యాంగం ములతత్త్వాన్ని ప్రవేశిక తెలియజేస్తుంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయలు,ఆకాంక్షలు లక్ష్యాలను ప్రతిబిబింస్తుంది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా ప్రవేశికలో పేర్కోనడం జరిగింది.
12.      పార్లమెంటరీ ప్రభుత్వం(IMP):                   పార్లమెంటరీ వ్యవస్థను బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖకు బాధ్యత వహించే విదానాన్ని పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. ఈ ప్రభుత్వం విదానంలో  నామమాత్రపు, వాస్తవ అను రెండు కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి.
13.      సార్వజనిన వయోజన ఓటు హక్కు (IMP):  భారతదేశంలో 18 సం. నిండిన పౌరులందరికి జాతి,కుల, మత, భాష, ప్రాంత, లింగ భేదాలు లేకుండా ఓటు హక్కును కల్పించబడినడినది.1988 లో 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా వయోపరిమితిని 21 సం. నుండి 18 సం. తగ్గించారు.
14.      భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర-సమాఖ్య లక్షణాలు: భారత రాజ్యాంగం ఏకకేంద్ర సమాఖ్య రాజ్యలక్షణాల సమ్మేళనం.
ఏకకేంద్ర లక్షణాలు:  ఒకే పౌరసత్వం, ఒకే సమీకృత న్యాయశాఖ
సమాఖ్య లక్షణాలు:  లిఖిత రాజ్యాంగం, రెండు ప్రభుత్వలు.
                           K.C వేర్ అభిప్రాయంలో భారతదేశాన్ని “అర్థసమాఖ్య వ్యవస్థగా” పేర్కోన్నారు.
15.   ద్విసభా విదానం(IMP):      రెండు సభలు ఉండే విదానాన్ని “ద్విసభా విధానం” అంటారు భారతదేశంలో ఎగువ సభను “రాజ్య సభ”  అని, దిగువ సభను “ లోక్ సభ” అని అంటారు.
Tags:  Inter Second year Civics, civics Telugu  Books, Civics Inter Second Year Books Download,



ప్రాథమిక హక్కులు –ఆదేశిక సూత్రాలు


Inter Second Year - Civics   




 
1.        ప్రాథమిక హక్కులు:   భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుంచి 35 వరకు గల అధికరణలో  ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
1.     సమానత్వహక్కు                                      
2.    స్వేచ్చ స్వాతంత్ర్యహక్కు                          
3.    పీడనాన్ని నిరోదించే హక్కు         
4.  మత స్వాతంత్ర్య హక్కు 
5.  విధ్యా విషయా సాంస్కృతిక హక్కు
 6.  రాజ్యాంగ పరిహారపు హక్కు
       2.        సమానత్వ హక్కు(IMP):     సమానత్వ హక్కు రాజ్యాంగంలో 14 నుంచి 18 వరకు అధికరణలో      పేర్కోన్నారు. చట్టం ముందు అందరు సమానులే, కుల మత లింగ భాష ప్రాంతీయ వ్యత్యసాలు రాజ్యాం చూపకూడదు, అంటరాని తానాన్ని వ్యతిరేకించింది. సాంఘిక అసమానత కలిగించి బిరుదులు రద్ధుచేశారు.
            3.        19 వ అధికరణ(IMP):       19 వ అదికరణ ఆరు రకాల స్వాతంత్ర్యలు ఉన్నాయి.
1.         వాక్ స్వాతంత్ర్యం                                       
2.         శాంతియుతంగా నిరాయుధంగా సమావేశం   ఏర్పాటు
3.         సంఘలు, సంస్థలు ఏర్పాటు చేసుకోనె స్వాతంత్ర్యం  
4.     సంచరించే స్వాతంత్ర్యం
5.     దేశంలో ఎక్కడైన సిర్థనివాసం
6.  ఇష్టమైన వృతి చేసుకోనె స్వాతంత్ర్యం
4.            మత స్వాతంత్ర్య హక్కు(IMP):       మత స్వాతంత్ర్య హక్కు  25 నుంచి 28 వరకు అధికరణలో వివరించడం జరిగినది. తన అంతరాత్మకు ఆనుగుణంగా ఇష్టమైన మతంన్ని స్వికరించే హక్కు, ప్రచారం చేసుకోనె హక్కు, సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు , అయితే రాజ్యం మతపరమైన పన్నులు విదించరాదు, విధ్యాలయాలలో మత బోధన జరపరాదు
5.             అస్తి హక్కు: మొదట్లో అస్త్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. 1978 లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్త్తి హక్కును రద్ధుచేసి 300(A) లో చట్టబద్ధంగా  హక్కుగా ఉంచడం జరిగినది.
6.            ప్రాథమిక హక్కుల పై ఆంక్షలు:      అత్యవసర పరిస్థితులలో హక్కులపై ఆంక్షలు విదించడం జరిగినది.  20, 21 వ అధికరణలు మినహా మిగిలిన వాటిని రాష్ట్రపతి తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
7.            ఆదేశిక సూత్రాలు(IMP):         ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగినది. రాజ్యాంగంలో IV భాగంలో 35-51(A) వరకు ఉన్న అధికరణాలలో ఆదేశిక సూత్రాలను పేర్కోన్నారు. ఆదేశిక సూత్రాల రకాలు: 1. సామ్యవాద సూత్రాలు  2.  గాంధేయ సూత్రాలు   3. ఉదారవాద సూత్రాలు
8.            ఆదేశిక సూత్రాల లక్షణాలు (IMP):  
A.    ప్రభుత్వాలకు  ఇచ్చిన ఆజ్ఞాలు
B.    ప్రభుత్వాల అధికార విధుల పరిధిని పెంచాయి.
C.    ఆర్థిక వనరుల లభ్యత మేరకు అమలు అవుతాయి
D.    వీటికి శిక్షాత్మక స్వభావం లేదు.
E.    ఇవి చేయకపోతే చట్టదిక్కారమైన చర్యగా పరిగణించరు న్యాయస్థానాల ద్వారా వీటిని పోందలేము.
9.            ఆదేశిక సూత్రాల అదనపు అంశాలు (IMP) :       
a.            ఆదాయాల్లో అసమానతలను తగ్గిచడం.
b.            పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం.
c.             కర్మాగార నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం.
d.            పర్యావరణ అడవులు,వన్యమృగాలు పరిరక్షణకు కృషి చేయడం.
10.       ప్రాథమిక విధులలో నాలుగింటిని వ్రాయండి     
a.    భారత రాజ్యాంగంన్ని జాతీయ పతకం, జాతీయం గితంన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి.
b.    దేశ సెవకు ప్రతి పౌరుడు సిద్దంగా ఉండాలి.
c.     మహిళలను గౌరవించాలి, సోదరభావాలను కలిగి ఉండాలి.
d.    ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి హింసాను  విడానాడాలి.




Followers