నాగార్జున వర్సిటీలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేవ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. యూనివర్సిటీలోని ఆడిటోరియం అసెంబ్లీ నిర్వహణకు బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధానిని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతవరకు నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ముఖ్య శాఖల కార్యాలయాలను తరలించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

'కృత్రిమ రెటీనా' రూపకల్పన

జెరూసలెం: దెబ్బతిన్న రెటీనాకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవటానికి వీలైన పలుచటి, కాంతికి స్పందించే కొత్త పొరను శాస్త్రవేత్తలు రూపొందించారు. నానోరాడ్స్‌, కార్బన్‌ నానోట్యూబ్స్‌తో తయారచేసిన దీన్ని టెల్‌ అవైవ్‌, హీబ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు కాంతికి స్పందించని కోడిపిల్ల రెటీనాతో పరీక్షించారు. ఇది కాంతిని గ్రహించినట్టు, నాడీసంబంధ చర్యను ప్రేరేపించినట్టు బయట పడటం విశేషం. ఇతర పరిజ్ఞానాలతో పోలిస్తే ఇది మరింత మన్నికైన, సమర్థవంతమైన, తేలికగా వంగే సామర్థ్యం గల పరికరమని పరిశోధకులు తెలిపారు. వయసుతో పాటు వచ్చే మాక్యులర్‌ డీజెనరేషన్‌ (ఏఎండీ) సమస్యతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడగలదని వివరించారు.

Followers