UGC NET, SET కామన్ పేపర్‌లో విజయంకోసం..



UGC NET, SET ఈ రెండు పరీక్షలకు సుమారుగా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సుమారు లక్షకుపైగా విద్యార్థులు ఈ రెండు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు పరీక్షల సిలబస్, Standard దాదాపు ఒకే రకంగా ఉండటం, సుమారుగా పది రోజులు వ్యవధిలో రెండు పరీక్షలు జరగడం, ఈ సమయంలోనే NET, SET పరీక్షకు సంబంధించిన అందరు పరీక్షార్థులకు ఉమ్మడిగా ఉండే Paper-Iకు సంబంధించిన మార్గదర్శకత్వం, పూర్వ ప్రశ్నలు మాదిరి ప్రశ్నలతో పాటుగా ముఖ్యమైన భావనలకు, పదాలను అందిస్తే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. Paper-I సిలబస్ అభ్యర్థులందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులోగల 10 విభాగాలపై 10 ఆర్టికల్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందిస్తే అది వారి పునరభ్యసనాన్ని సులభతరం చేస్తుంది. కింది విధంగా మెటీరియల్ ఒక్కొక్క విభాగానికి సంబంధించి కూర్చి అందిస్తున్నాం. SRF, SET, NET Paper-1 పరిశోధనా సహజ సామర్థ్యాలు (Research Aptitude) SRF, NET, SET పరీక్షల్లో విజయం సాధించాలంటే పరిశోధనా సహజ సామర్థ్యాలు(Research Aptitude) అనే అంశంలో ఎక్కువ మార్కులు సాధించాలి. మొదటి పేపర్‌కు సంబంధించి మిగతా అంశాలవలె కాకుండా ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు రెండు, మూడో పేపర్‌లో కూడా వస్తాయి. కాబట్టి అభ్యర్థి ఈ అంశంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. పేపర్-I, పేపర్-II అన్నింటిలో కలిపి సుమారుగా 15 నుంచి 20 ప్రశ్నలు ఈ అంశం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం నుంచి అడిగే ప్రశ్నల ముఖ్య ఉద్దేశం కాబోయే పరిశోధకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిశోధనా సామర్థ్యాన్ని పరీక్షించడమే. పరీక్షార్థుల విజయాన్ని కాంక్షిస్తూ SET, SRFలకు సంబంధించి కీలకమైన పేపర్-I అందరు అభ్యర్థులకు కామన్‌గా ఉండటంతో పేపర్-Iకు సంబంధించి ఒక్కొక్క అంశంపై ముఖ్యమైన భావాలు, పదాలు, పూర్వ ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు పరిశోధనా సహజ సామర్థ్యాలపై వివరంగా... పరిశోధనా, సహజ సామర్థ్యాలకు సంబంధించి విద్యార్థుల అభ్యసించాల్సిన ముఖ్యమైన అంశాలు 1. పరిశోధనా లక్షణాలు, లక్ష్యాలు 2. శాస్త్రీయ పద్ధతి-లక్షణాలు, ప్రక్రియ విధానం 3. పరిశోధనా మూలకాలు, చరాలు, పరికల్పనలు 4. పరిశోధనా పద్ధతులు 5. పరిశోధనా, ప్రణాళికా నిర్మాణం 6. పరిచయం, పద్ధతులు 7. పరిశోధనా ప్రక్రియలోని అంశాలు 8. దత్తాంశ స్వీకరణ 9. దత్తాంశ విశ్లేషణ 10. నివేదిక తయారి. శాస్త్రీయ పరిశోధనలు (scientific Research) క్రమపద్ధతిలో ఏదైనా ఒక దృగ్విషయాన్ని అధ్యయనం చేసి అందుకు సంబంధించిన పలు కారణాల మధ్య సంబంధాలను తర్కబద్ధంగా తెలిపే ప్రక్రియను శాస్త్రీయ పద్ధతి అంటారు. కింది లక్ష్యాలతో కూడిన పరిశోధనను శాస్త్రీయ పరిశోధన అంటారు. 1. లక్ష్యాత్మకతను(objectivity) కలిగి ఉండటం. 2. తర్కబద్ధంగా(Logical) ఉండటం-నిగమన తర్కం(Deductive logic) - ఆగమన తర్కం (inductive logic) 3. ప్రాథమిక ఆధారాలు కలిగి ఉండటం (reliance on empirical evidence) 4. తటస్థ నైతికతను కలిగి ఉండటం(Ethical neutrality) 5. సాధారణీకరించగలగడం(generalization) 6. వెరీఫైయబిలిటీగా ఉండటం 7. సరైన భావాలను పరిశోధనలో ఉపయోగించడం. 8. కచ్చితత్వాన్ని కలిగి ఉండటం (Accuracy) 9. నమోదు చేసి ఉండటం (Recording) శాస్త్రీయ పరిశోధన ప్రక్రియ(Process of scientific research) పరిశోధనా సమస్య పొందిక (Formulation of Research problem) పరికల్పన రూపకల్పన(Formulation of Research Hypothesis) పరిశోధన విధాన రూపకల్పన(Formulation of Research Design) దత్తాంశ స్వీకరణ(Collection of data) దత్తాంశ విశ్లేషణ(Analysis of data) సాధారణీకరణం(Generalization) పరిశోధనా పద్ధతులు (Research Designs) పరిశోధనకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి పరిశోధనకు తయారు చేసుకున్న, అనుసరిస్తున్న విధానాన్నే పరిశోధనా పద్ధతి అంటారు. ఆయా పరిశోధనా సమస్యలు, లక్ష్యాలను అనుసరించి పరిశోధనా పద్ధతులు వివిధ రకాలుగా ఉంటాయి. 1. శుద్ధ పరిశోధన 2. అనుప్రయుక్త పరిశోధన 3. వివరణాత్మక పరిశోధన 4. ప్రయోగాత్మక పరిశోధన 5. చర్యాత్మక పరిశోధన 6. మూల్యాంకన పరిశోధన 7. చారిత్రక పరిశోధన 8. సర్వే 9. విషయ అధ్యయన పద్ధతి 10. విశ్లేషణాత్మక పరిశోధన -శాస్ర్తానికి సంబంధించిన నూతన సిద్ధాంతాలను, ఆవిష్కరణలను తెలిపే శుద్ధ పద్ధతి. -శాస్త్ర పరిజ్ఞానాన్ని సమకాలిక సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగించేది అనుప్రయుక్త పరిశోధన. -ఒక దృగ్విషయాన్ని గురించి క్రమపద్ధతిలో వివరించేది వివరణాత్మక పరిశోధన. -కొన్ని చరాలను నియంత్రించి ఫలితాలను రాబట్టేది ప్రయోగాత్మక పరిశోధన. -ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి పరిష్కారం తెలిపేది చర్యాత్మక పరిశోధన. -ఒక దృగ్విషయానికి సంబంధించిన వివిధ అంశాల మధ్య సంబంధాన్ని వివరించేది విశ్లేషణాత్మక పరిశోధన. దత్తాంశ సేకరణ దత్తాంశాన్ని రెండు రకాలుగా సేకరించవచ్చు. అవి primary source of data collection, secondary source of data collection. primary source of data collection -క్షేత్ర పర్యటన (field study) - ప్యానెల్ మెథడ్ -పరిపుచ్ఛ (interview) - మేయిన్ సర్వే -పరిశీలన (observation) - చెక్‌లిస్ట్ -సోషియోమెట్రి అండ్ సోషియోగ్రామ్ - రేటింగ్ స్కేల్ -బృంద చర్చ (focus group discussion) -ప్రక్షేపణ పద్ధతులు (projective methods) -ప్రశ్నావళి (questionnaire) - ప్రయోగం (experimentation) Secondary source of data collection -వివిధ రకాల నివేదికలు -గ్రంథాలు -గతంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు -వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన ద్వితీయ సమాచారం. సేకరించిన దత్తాంశాన్ని క్రమపద్ధతిలో అమర్చి సరైన సంఖ్యాక శాస్త్ర విధానంలో విశ్లేషించినట్లయితే ఆ పరిశోధనా సమస్యకు సంబంధించిన సాధారణీకరణాలు ఏర్పడుతాయి. దీనికి ముందుగా సేకరించిన దత్తాంశాన్ని కింది వరుసక్రమంలో వ్యవస్థీకరించాలి. collected data editing coding and classification tabulation and graphs application of statistical method generalization or results కేంద్రస్థానపు కొలతలు (central tendencies) 1. అంకమధ్యమం 2. మధ్యగతం 3. బాహుళకం విచలన మాపకం(deviations) 1. ప్రమాణాత్మక విచలనం 2. మాధ్యమిక విచలనం 3. చతుర్థాంశక విచనలం. 4. వ్యాప్తి measures of association 1. yules coefficient (Q) 2. phi coefficient (rs) 3. rho correlation 4. chi square test (x2) 5. pearsons coefficient of correlation (r) పరిశోధనా నివేదిక (Research Report) నందు ఉండవలసిన విషయక్రమం. Report Outline I) Pre factory Items 1) Title page 2) Research Declaration 3) Acknowledgements 4) Table of contents 5) List of Tables 6) List of graphs and charts 7) Abstract or synopsis II) Body of the Research Report 1) Introduction i) Theoretical background of the topic ii) Statement of the problem iii) Review of literature iv) Scope of the study v) Hypothesis to be tested 2) The design of the study a) Research Methodology b) source of data c) sampling plan d) data collection instruments e) data processing and analysis f) limitations of the study 3. Results: findings and discussion 4) summary, conclusions and recommendations III) Terminal Items 1) Bibliography 2) Appendix a) copies of data collection instruments b) technical details on sampling plan c) complex tables d) glossary of new items used in the report పరిశోధనా సహజ సామర్థ్యాలకు సంబంధించి 2012, 2013లో జరిగిన SET Examలో అడిగిన టువంటి ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైనవి... గతంలో అడిగిన ప్రశ్నలు 1. సరైన క్రమంలో కింది వాటిని అమర్చండి (సీ) a) దత్తాంశ విశ్లేషణ, వాఖ్య b) పరిశోధనా నివేదిక తయారీ c) సమస్య గుర్తింపు ఎంపిక d) పరిశోధనా ప్రణాళికా నిర్మాణం e) దత్తాంశ సేకరణ ఏ) c, d, a, b, e బీ) c, d, a, e, b సీ) c, d, e, a, b బీ) c, e, b, a, d 2. కింది ప్రవర్తనలో ఒకటి పరిశోధన నైతిక నియమావళికి అనుగుణమైనది కాదు? (బీ) ఏ) ఒక గ్రంథం నుంచి పేరాగ్రాఫ్‌లను కృతజ్ఞతలు చెప్పి నకలు చేయడం బీ) దత్తాంశం సమర్థించనప్పటికీ పరిశోధకుడు తాను సత్యమనుకున్న సాధరణీకరణను ప్రతిపాదించడం. సీ) సాహిత్య సమీక్ష రూఢీ పరచని ప్రాకల్పనను రూపొందించడం. డీ) గుణాత్మక పరిశోధనలో సాంఖ్యకశాస్త్ర పద్ధతులను ఉపయోగించడం 3. కింది వానిలో నాలుగింటిలో మూడు లక్షణాలు పరి శోధనా లక్ష్యాలు. పరిశోధనా లక్ష్యం కానిదాన్ని గుర్తించండి? (సీ) ఏ) ఉద్ధేశ పూరితమైనది బీ) పరిశోధనా తార్కికం, లక్ష్యాత్మకం సీ) పరిశోధనా ఫలితాలను అన్ని సందర్భాలకూ సాధారణీకరించవచ్చు డీ) పరిశోధనా కచ్చితమైన దత్తాంశంపై ఆధారపడి ఉంటుంది. 4. కింది వాటిలో వ్యాప్తి మాపకం కానిది? (డీ) ఏ) చతుర్థాంశక విచలనం బీ) ప్రామాణిక విచలనం సీ) కకుదత డీ) చైస్కేర్ 5. కింది పరామితుల్లో కేంద్రీయ ప్రవృతిని కొలవని పరామితి గుర్తించండి ? (డీ) ఏ) సాంఖ్యక మధ్యమం బీ) అంకమధ్యమం సీ) బహుళకం డీ) సగటు విచనలం 6. యోగ్యమైన పరిశోధనకు జీవనాడి ఏది ? (డీ) ఏ) బాగా రచించిన పరికల్పన సముదాయం బీ) యోగ్యుడైన పరిశోధన పర్యవేక్షకుడు సీ) చాలినన్ని గ్రంథాలయ సౌకర్యాలు డీ) యోగ్యమైన పరిశోధన సమస్య 7. కింద ఇచ్చిన వాటిలో ఏది శాస్త్రీయ పద్ధతి లక్షణం కాదు ? (సీ) ఏ) విషయ నిష్ఠత బీ) సరిచూడటం సీ) ఊహాకల్పన చేయడం డీ) పూర్వానుమేయం 8. వెంటనే అనువర్తనం చేయడానికి ఉద్ధేశించిన పరిశోధన ఏది ? (ఏ) ఏ) చర్యాత్మక పరిశోధన బీ) అనుభవాత్మక పరిశోధన సీ) భావనాత్మక పరిశోధన డీ) మౌలిక పరిశోధన మాదిరి ప్రశ్నలు 1. పరికల్పన అనగా ..? (ఏ) ఏ) పరీక్షించాల్సిన వాఖ్య బీ) పరీక్షకు నిలబడిన వాఖ్య సీ) పరిశోధనా ఫలితంగా ఏర్పడిన వాఖ్య డీ) పైవన్నీ 2. కింది వానిలో శాస్త్రీయ పద్ధతి లక్షణం కానిదేది ? (ఏ) ఏ) విషయాత్మకత బీ) లక్ష్యాత్మకత సీ) తార్కిక అనుగుణ్యత డీ) ఏదీకాదు 3. శూన్య పరికల్పనను దేనితో సూచిస్తారు ? (సీ) ఏ) H1 బీ) Hr సీ) Ho డీ) H2 4. ఒక పరిశోధకుడు ఒక విషయాన్ని అవగాహన చేసుకునేందుకు ఆ విషయానికి సంబంధించిన పూర్వ సూత్రాలను ఉపయోగించుకున్నాడు. అయినా ఇది ? (బీ) ఏ) ఆగమన తర్కం బీ) నిగమన తర్కం సీ) ఉపగమన తర్కం డీ) ఆగమ-ఆగమన తర్కం 5. పరిశోధన కిందివానిలో దేనితో మొదలవుతుంది ? (ఏ) ఏ) సమస్య బీ) పరిశీలన డీ) పరికల్పన సీ) లక్ష్యం 6. రెండు చరాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపే పరికల్పన ? (ఏ) ఏ) శూన్య పరికల్పన డీ) చర్యా పరికల్పన సీ) పరిశోధనా పరికల్పన డీ) విశ్లేషణ పరికల్పన 7. శాస్త్రీయ పరిశోధన అనేది నైతికత పట్ల ? (బీ) ఏ) అనుగుణంగా ఉంటుంది బీ) తటస్థంగా ఉంటుంది సీ) విషమంగా ఉంటుంది డీ) పరిస్థితులను బట్టి మారుతుంది. 8. కింది వానిలో అతిసాధారమైన మెజర్‌మెంట్‌ని గుర్తించండి ? (ఏ) ఏ) నామినల్ బీ) ఆర్డినల్ సీ) ఇంటర్నల్ డీ) రేషియో 9. కింది వానిలో అతి ఉన్నతమైన మెసర్‌మెంట్‌ను గుర్తించండి ? (డీ) ఏ) నామినల్ బీ) ఆర్డినల్ సీ) ఇంటర్నల్ డీ) రేషియో 10. సెమి-ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని దేనిని అంటారు ? (ఏ) ఏ) QD బీ) SD సీ) MD డీ) L 11) పరిశోధనా జనాభాకు సంబంధించిన వివరాలు లభించలేని స్థితిలో నీవు ఎంచుకునే ప్రతిచయన పద్ధతి ? (డీ) ఏ) Simple random బీ) Stratified random సీ) Cluster sampling డీ) Snowball sampling 12. పరిశోధనా జనాభాకు సంబంధించి వివిధ లక్ష్యాలను వర్గీకరించి ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎంపిక చేసుకునే ప్రతిచయన పద్ధతిని ఏమంటారు ? (సీ) ఏ) Snowball sampling బీ) Simple random sampling సీ) Stratified random sampling డీ) Volunteer sampling ప్రతిచయన పద్ధతి (Sampling Method) ఒక పరిశోధకుడు రైతుల ఆత్మహత్యలకు, సామాజిక ఆర్థిక పరిస్థితులకు గల సంబంధంపై పరిశోధన చేస్తున్నాడని అనుకున్నట్లయితే ఆ పరిశోధకుడు ఆత్మహత్యలు చేసుకున్న అందరి రైతులకు సంబంధించి సమాచారం స్వీకరించి పరిశోధన జరిపితే ఆ పద్ధతిని జనాభా పద్ధతి అంటారు. సమయం, వనరులు మొదలైన కారకాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికి సంబంధించిన సమాచారం సేకరించకుండా అందులోనుంచి కొందరిని మాత్రమే ఎంపిక చేసుకొని పరిశోధన చేస్తే దాన్ని ప్రతిచయనం అంటారు. ప్రతిచయన పద్ధతులకు సంబంధించి ముఖ్య భావనలు.. పరిశోధన జనాభా (Research population): ఆత్మహత్య చేసుకున్న మొత్తం రైతులు ప్రతిచయనం(Sample) : పరిశోధకుడు పరిశోధనా జనాభా నుంచి తన పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకున్న రైతులు. ప్రతిచయన మూలకాలు(Sampling elements) : ప్రతీ రైతు ప్రతిచయన మూలకం. ప్రతిచయన పద్ధతి (sampling method) : మొత్తం పరిశోధనా జనాభా నుంచి పరిశోధకుడు ప్రతిచయనాన్ని ఎంపిక చేసుకునే పద్ధతి. పరికల్పన పరికల్పన అనేది కొన్ని లేదా రెండు చరాల మధ్య సంబంధం తెలిపే తాత్కాలిక వ్యాఖ్యానం - థండర్‌సన్ పరిశోధనకు సంబంధించిన పరిశోధకుడు కొంత సాహిత్య సమీక్ష చేసిన తర్వాతగాని లేదా అతని పరిశీలన ద్వారా వచ్చిన పరిజ్ఞానాన్ని ఆసరగా చేసుకొని తన ముందున్న పరిశోధనా సమస్యకు సంబంధించిన చరాల మధ్య సంబంధాన్ని తాత్కాలికంగా తెలిపే ప్రాగుప్తీకరణాన్ని పరికల్పన అంటారు. ఇలా పరిశోధన చేసిన తర్వాత తాను స్వీకరించిన దత్తాంశాన్ని సమాచారంగా విశ్లేషించి తాను రూపొందించిన పరికల్పన సరైనదో కాదో అని నిర్థారించుకోవాలి. ఆయా సందర్భాలను బట్టి పరికల్పనలు వివిధ రకాలుగా ఉంటాయి. 1. వర్ణనాత్మక పరికల్పన (Descriptive Hypothesis): ఇది ఆయా చరాల లక్షణాలను తెలుపుతుంది. 2. సంబంధ పరికల్పన (Relational Hypothesis) : ఇది రెండు చరాల మధ్య రుణాత్మక, ధనాత్మక సంబంధాన్ని తెలుపుతుంది. 3. Working hypothesis 4. శూన్య పరికల్పన (Null Hypothesis) : రెండు చరాల మధ్య సంబంధం లేదని తెలుపుతుంది. దీన్ని Ho తో సూచిస్తారు. 5. శాస్త్రీయ పరికల్పన (Scientific Hypothesis) : సరిపోను సిద్ధాంత, శాస్త్ర ఆధారాల ఆధారంగా రూపొందించిన పరికల్పన. దీన్నే పరిశోధనా పరికల్పన అంటారు. దీన్ని H1తో సూచిస్తారు.



Tags:ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ - IV పరీక్ష మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన పలు విభాగాల నుంచి ప్రశ్నలు .,telugu study material,d to telugu study material  vro study material in telugu free download  vro study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study

ఇంగ్లీష్‌లో లాంగ్వేజ్ యాక్టీవిటీస్ కీలకం...


ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన పదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో అనేక మార్పులు చేశారు. గతంలో కంటే భిన్నంగా ఉన్న దీన్ని సులభంగా అర్థం చేసుకొని విద్యార్థులు తాము సొంతంగా రాసుకొనేలా రూపొందించారు. The New text book of Tenth class English Our world Through English is entirely different from the previous ones. It is quite unique in many ways. It is a single Text book prescribed as the common reader for both English and Non-English medium students. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ పుస్తకంలో లాంగ్వేజ్ పరంగా ప్రణాళికా స్థాయి అధికమైంది. Gram-mar, vocabulary, project work, study skills, writing, comprehension questions వంటి కోర్సుల స్థాయిని గణనీయంగా పెంచారు. పాత సంప్రదాయ అంశాలు కాకుండా విద్యార్థి తాను నేర్చుకుంటున్నాను అనే భావన కలుగకుండా ఇన్నోవేటివ్ పద్ధతిని సృజనాత్మక అంశాలను జోడించడంతోపాటు అనేక కొత్త అంశాలు చేర్చారు. దీనికి అనుగుణంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) పద్ధతిలో లాంగ్వేజ్ యాక్టివిటీస్ అంశాలను బాగా నేర్చుకోవాలి. లాంగ్వేజ్ యాక్టివిటీస్‌లో ముఖ్యాంశాలు Vocabulary (పదజాలం) This section contains some vocab-ulary tasks/activities/exercises. You will find matchings questions, finding syno-nyms/antonyms, phrasal verbs, multiple shades of meanings, collocations, hom-onyms, homophones, homographs, idioms, word formation, choosing right words, attributes, articles, binomials, appropriate forms మొదలైన అంశాలను విద్యార్థులు సాధన చేయాలి. Grammar ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు గ్రామర్ వచ్చి ఉండాలి అనే భావన ఉండేది. అయితే ప్రస్తుతం తాము గ్రామర్ నేర్చుకుంటున్నామనే ఆలోచన కలిగేలా కాకుండా, అభ్యాస ప్రక్రియలు నిత్యజీవితానికి పనికి వచ్చే అంశాల్లోనే వ్యాకరణ అంశాలనే చేర్చారు. దీంట్లో భాగంగా Omissions, contrac-tions,linkers, reported speech, tense, punctuation marks, irregular numbers, propositions, passive voice, relative clauses, finding out errors వంటి గ్రామర్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. You will also find activities that help students identify grammatical errors and edit them. Writing This section contains some written discourses that help students write conversation (సంభాషణలు) descriptions (వివరణలు) narratives, stories (కథలు), Messages (సమాచారం), e-mails, sms, dairy entries, letter, paragraph, essays, biographical sketches (జీవిత విశేషాలు), songs/poems. you will also find some tasks that need group discussions, collations of information from various sources and then writing a piece collaboratively. పాఠ్యపుస్తకంలోని ఎనిమిది యూనిట్లలో ఉన్న writing టాపిక్‌ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. Study Skills దీనిలో Verbal and non verbal activities like pie charts, bar diagrams, tables, advertisements (ప్రకటనలు), dictionary entries, route maps, data ఇచ్చి దాని ఆధారంగా మరొక అంశాన్ని గురించి రాయడం వంటి ప్రక్రియలను అభ్యసనం ద్వారా నేర్చకోవాలి. ఈ అంశాలు Text bookలో బాక్స్‌ల్లో రంగులద్ది విద్యార్థులకు శ్రద్ధ కలిగేట్లు ఉన్నాయి. Listening This section contains a listening text and a few tasks/activities/exercises to improve speaking and listening compet-encies. You will find out listening comprehension questions and questions that call for the students reflection on what they have listened to. Oral Activity ఈ Taskలో conversations, discussions, debates, compering, presenting reports, speeches వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో మాట్లాడే సామర్థ్ధ్యాన్ని పెంపొందించవచ్చు. దీనికోసం ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆయా అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి. లాంగ్వేజ్ టీచర్స్ క్లబ్స్‌గా ఏర్పడి మాస్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెందేలా Oral activity programmes నిర్వహించాలి. Project work లాంగ్వేజ్ ప్రక్రియలో ప్రాజెక్ట్ వర్క్ అత్యంత కీలకమైంది. యూనిట్ మొత్తానికి ఇది ముఖ్యమైన అంశంగా ఉంటుంది. One project related to the theme of the total unit. They require students to find resources to work out the task i, e collections. Analysis and interpr-etation of data to prepare a report and to present their findings before the class. ఇంగ్లీష్‌లోని మొత్తం 8 ప్రాజెక్ట్ అంశాల్లో యూని ట్ థీమ్ ఆధారంగా ఈ పనులు కల్పించారు. social reforms, 50 ఏండ్ల క్రితం జీవితం ఎలా ఉండేది, విభిన్న కుంటుంబాలు-భిన్న పండుగల నిర్వహణ, బాలల హక్కులు-అణచివేత, హాస్యం కల్గించే కథలు, మానవ సంబంధాలు, ఇష్టమైన వ్యక్తుల సమాచారం సేకరించడం వంటి అంశాలపై ప్రాజెక్టు పని ఇచ్చారు. ఇందులో గ్రూపుల వారీగా, వ్యక్తిగతంగా సేకరించే సమాచారం ఉంటుంది. collect చేసిన infor -mationను చార్టులపై ప్రదర్శించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా తరగతి రిపోర్టును ప్రతి గ్రూపు నుంచి ప్రజెంట్ చేస్తారు. ఈ ప్రాజెక్టు ప్రక్రియ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సమాజ సమస్యలపై అవగాహన విద్యార్థుల మధ్య సంబంధాలు, సమాజంతో సంబంధాలు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. దీనివల్ల L.S.R.W భాష నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అయితే ప్రాజెక్ట్ పని ఇచ్చేముందు విద్యార్థులకు టీచర్ తగిన సూచనలు, సమయం తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రాజెక్ట్ నిర్వహణ ఫలితంగా భవిష్యత్తులో ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్య, ఉన్నత విద్యలో ఉపయోగడుతుంది. Self Assesment ప్రతి యూనిట్ చివరి అంశంగా ఈ టాపిక్ ఉంటుంది. The check list given at the end of the every unit helps the learners to assess his/her reflect all the sections in a unit. This check list also helps the Teachers to assess the learning levels of children. లాంగ్వేజ్ ప్రక్రియలను భాషా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పొందుపరిచారు. పరీక్షల విధానం మారడంతో ప్రశ్నలు నేరుగా పాఠ్యపుస్తకంలోని అంశాల నుంచి ఇవ్వరు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను అవగాహన చేసుకొని తానే సొంతంగా అర్థం చేసుకుంటూ జవాబులు రాయాల్సి ఉంటుంది. The Assessment Language learning is continuous process. Assessment is not an acti-vity distinct from learning. Since learning is facilitated. Through group discussions, pair discussions and individually assessment also operates at the individual level, in peers and groups. This will help the learners to compare their stren-gths and weaknesses and make modifications in their learning. We propose continuos and comprehe-nsive assessment at all levels of language learning. Types of Assessment There are two types of asses-sment. 1. Formative Assessment 2. Summative Assessment Formative assessment is done based on four tools that cover all the language competences (acade-mic standards). These are.. 1. Observation 2. Written work 3. Project work 4. Slip test Teachers has to assess the perfo-rmance of the learners for each term. This is not a single day activity. It is commutative account of what has happened in day-to-day class room transaction. Summative Assessment There will be a summative asse-ssment after every term The test is for 100 marks. Out of these 20% of marks are allotted to oral test and 80 % marks for written test. As CCE is a school based asses-sment, every school should prep- are their own question papers for summative assessment. Three summative tests are must be cond-ucted in each academic year for classes 9th and 10th. In case of 10th class public Examination will be in place of third S.A. test to be conducted by the Board of Seco-ndary Education. S.A.-1, S.A-2 tests shall be conducted by schools itself throu-gh preparing question papers for 80 % of marks. The remaining 20 % of marks shall be awarded on the basis of the Formative Assessment. Grading The marks based grading for class 9th and 10th with following range is given here under.


Tags:ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ - IV పరీక్ష మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన పలు విభాగాల నుంచి ప్రశ్నలు .,telugu study material,d to telugu study material  vro study material in telugu free download  vro study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,

Followers