కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌

నెట్వర్కింగ్‌ అనగా ఏమిటి: ముందు మనం నెట్వర్క్‌ అంటే ఏమిటో తెలుసుకోవాలి . రెండు లేక అంత కన్నా ఎక్కువ పరికరాలు (కంప్యూటర్లు, ప్రింటర్లు ఇంకా ఇలాంటివి) ఒక మాధ్యమం ద్వారా అనుసంధానించబడితే దానినే ఒక నెట్వర్క్‌ అంటాము. ఇప్పుడు ఈ నెట్వర్క్‌ ద్వార సమాచారాన్ని ఒక పరికరం నుండి ఇంకో పరికరానికి పంపే ప్రక్రియను నెట్వర్కింగ్‌ అంటారు . ఏమేం కావాలి?: రెండు పరికరాలను అనుసంధానించాలంటే మనకొక మాధ్యమం కావాలి . మాధ్యమం రెండు రకాలు . 1 తీగలు ఉపయోగించి అనుసంధానించడం, 2. తీగలు లేకుండా అనుసంధానించడం. ఈ రెండింటి లో ఏదో ఒక మార్గం అనుసరించి అనుసంధానించవచ్చు. మనం ఒక్కొక్క మార్గాన్నీ విడివిడిగా చూద్దాం. ఇక్కడ చెప్పే విధానంలో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని తీస్కోవడం జరిగింది. ఇదే సమాచారంలో వివరణ లింక్సుకి కూడా వర్తిస్తుంది. అనుసంధానించబడాలంటే ప్రతి పరికరానికి ఒక ప్రత్యేక గుర్తింపు నామం, డొమైన్‌ నామం,నెట్వర్క్‌ గుర్తింపు ఉండాలి. ప్రత్యేక గుర్తింపు నామం: ఇది మీ కంప్యూటర్‌ నామం. ఇది సాధారణంగా ఇన్‌స్టాల్‌ చేసేప్పుడు ఇచ్చి వుంటారు . ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్‌ మీద రైట్‌-క్లిక్‌ ఇచ్చి ఆప్షన్‌ని ఎంచుకోండి . డొమైన్‌ నామం: నెట్వర్క్‌లోని కొన్ని పరికరాలు ఒక సముదాయముగా ఏర్పడితే దానిని ఒక డొమైన్‌ అంటాము. ప్రతి కంప్యూటరుకు ఒక డొమైన్‌ నామం ఉంటుంది. ఇది కూడా ఇన్‌స్టాల్‌ చేసేప్పుడు ఇచ్చి వుంటారు .ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్‌ మీద రైట్‌-క్లిక్‌ ఇచ్చి ఆప్షన్‌ని ఎంచుకోండి నెట్వర్క్‌ గుర్తింపు: నెట్వర్క్‌లో మీ కంప్యూటర్‌ రిజిస్టర్‌ ఐన వెంటనే నెట్వర్క్‌ అడ్మినిష్ట్రేటర్‌ మీకు ఈ సభ్యత్వ గుర్తింపుని ఇస్తారు . డొమైన్‌ నామం లాగానే ఈ గుర్తింపు కూడా కంప్యూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ఇంటర్నెట్‌ లేదా ఇతర ప్రైవేటు నెట్‌వర్క్‌ లో మాత్రమే. మీరు ఇంట్లోనే నెట్‌వర్క్‌ ఏర్పరుచుకోదలిస్తే ఈ గుర్తింపుని మీరే ఇచ్చుకోవచ్చు. నెట్‌వర్క్‌ నిపుణుల అవసరం: ఆయా సంస్థల్లో, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపయోగించే కంప్యూటర్లలో ఉండే సమాచారంపై లక్షలాదిమంది జీవితాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఏ లోపమూ చోటుచేసుకున్నా దాని ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకునేందుకు ప్రస్తుతం నెట్‌వర్క్‌ నిపుణులు అవసరం అవుతు న్నారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. కాబట్టి సంబంధిత కెరీర్‌వైపు నేటి యువత ఆసక్తి చూపు తోంది. ఇప్పుడే దేశ విదేశాల్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో కంప్యూటర్‌ నెట్‌వర్‌క ఒకటి. ఇందులో ప్రవేశించిన వారికి ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. అవకాశాలు: కంప్యూటర్‌ అప్లికేషన్లను రూపొందించడం, సొంతంగా నెట్‌వర్క్‌ను డిజైన్‌ చేయడం అవసరాన్నిబట్టి హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ను సృష్టించడం వంటి పనివిధానం కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌లో భాగంగా ఉంటుంది. బ్యాంకులు, మాన్యుఫాక్చరింగ్‌, మీడియా వంటి సంస్థల్లో భారీ సంఖ్యలో కంప్యూటర్లుంటాయి. వీటి నెట్‌వర్క్‌ సజావుగా ఉండేలా చూసేందుకు నిపుణుల అవసరం తప్పనిసరి. నెట్‌వర్క్‌ నిష్ణాతులకు హెచ్‌సిఎల్‌, విప్రో, ఇతర ఔట్‌సోర్సింగ్‌ కంపెనీల్లో నేడా అనేక కొలువులు లభిస్తున్నాయి. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టెలికామ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లలో భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నెట్‌వర్క్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయవచ్చు. క్వాలిటీ అస్యూరెన్స్‌/టెస్టింగ్‌ ఆఫ్‌ నెట్‌వర్క్‌ ప్రోటోకాల్స్‌, రీసెర్చ్‌ ఇన్‌ నెట్‌వర్కింగ్‌లో సేవలు అందించవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలు, ద్వితీయశ్రేణి నగరాలు పెరుగుతున్న కొద్దీ నెట్‌వర్క్‌ నిపుణులకు అవకాశాలు కూడా అదేస్థాయిలో విస్తరిస్తున్నాయి. ఎలాంటి స్కిల్స్‌ అవసరం: కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ నిపుణులకు శాస్ర్తీయ దృక్పథం అవసరం. విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణి ఉండాలి. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నేర్పు కలిగి ఉండాలి. తమ రంగానికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనతో ఎప్పటికప్పుడు వృత్తినైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. 

 dsc 2014 syllabus dsc new syllabus 2014  dsc syllabus 2014  8th class history audiofree download  ap dsc 2013 new syllabus   ap dsc studymaterial   ap dsc syllabus  ap dscpsychology material  apdsc hindi material  d.s.c.syllabus hindi

జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్

రాష్ర్టానికి తొలిసారి గిరిజనేతర సీఎం -దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారన్న నడ్డా -రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం -అమిత్‌షా, మోదీకి కొత్త సీఎం కృతజ్ఞతలు -ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలిసిన బీజేపీ కూటమి -బీజేపీ నిర్ణయంపై గిరిజనుల నిరసన రాంచీ, డిసెంబర్ 26: రాష్ట్రం ఏర్పడిన 14 ఏండ్ల తర్వాత తొలిసారి జార్ఖండ్‌ను ఓ గిరిజనేతర ముఖ్యమంత్రి ఏలబోతున్నారు. తమ శాసనసభాపక్షనేతగా బీజేపీ ఉపాధ్యక్షుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘువర్‌దాస్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సీఎం రేసులో ఉన్న మరో అభ్యర్థి సరయురాయ్, సీపీ సింగ్.. దాస్ పేరును ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపినట్లు పార్టీ పరిశీలకుడు జేపీ నడ్డా వెల్లడించారు. జార్ఖండ్ పదో ముఖ్యమంత్రిగా రఘువర్‌దాస్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు పది మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీలకు దాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అవినీతిరహిత పాలన అందజేస్తానని హామీఇచ్చారు. 82 స్థానాలు కలిగిన జార్ఖండ్‌లో బీజేపీ-ఏజేఎస్‌యూ కూటమి 42 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు దాస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు గవర్నర్ సయ్యద్ అహ్మద్‌ను కలిశారు. మరోవైపు గిరిజనేతరున్ని బీజేపీ ముఖ్యమంత్రిగా చేయడంపై పలు గిరిజన సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఇది గిరిజనుల వ్యతిరేక నిర్ణయమంటూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్‌కు జార్ఖండ్ పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది. పోటీ లేకుండానే.. జార్ఖండ్‌లో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని బీజేపీ సాధించినా.. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై మూడురోజులుగా ఉత్కంఠ నెలకొన్నది. అయితే శుక్రవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రం రఘువర్‌దాస్‌ను శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. ముఖ్యమంత్రిగా రఘువర్ పేరును ప్రకటించగానే ఆయన నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొన్నది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన దాస్.. ఓ సాధారణ కార్మికుడు కూడా సీఎం కావటం బీజేపీతోనేలాంటి పార్టీలోనే సాధ్యమవుతుందని అన్నారు. గిరిజన సంఘాల నిరసన గిరిజనేతరుడైన రఘువర్‌దాస్‌ను ముఖ్యమంత్రిగా చేయడంపై రాష్ట్రంలోని గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రకటన వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా నిరనస ప్రదర్శనలు మిన్నంటాయి. బీజేపీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ దాస్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే రోజు రాష్ట్రబంద్‌కు జార్ఖండ్ పీపుల్స్ పార్టీ పిలునిచ్చింది. గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చే ఉద్దేశంతోనే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటిది బీజేపీ ఇప్పుడు దాస్‌ను సీఎంగా ప్రకటించి గిరిజన సమాజం మనోభావాలను దెబ్బతీసిందని జేపీపీ అధ్యక్షుడు సూర్యాసింగ్ ఆరోపించారు. ఈ నిర్ణయం ద్వారా గిరిజుపై తమకు విశ్వాసం లేదని బీజేపీ సందేశమిచ్చినట్లయ్యిందని మాజీ సీఎం నితీశ్ విమర్శించారు. రాష్ర్టానికి గతంలో సీఎంలుగా చేసిన బాబులాల్ మరాండీ, అర్జున్‌ముండా, శిబుసోరెన్, మధుకోడా, హేమంత్‌సోరెన్ గిరిజనులే కావడం గమనార్హం. టాటాస్టీల్ ఉద్యోగే ఇప్పుడు సీఎం జార్ఖండ్ రాష్ట్ర తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న రఘువర్‌దాస్.. ఒకప్పుడు టాటాస్టీల్‌లో ఉద్యోగం చేశారు. ఆయన సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ అయినా.. జార్ఖండ్‌లో స్థిరపడ్డారు. 1954, డిసెంబర్ 18న జన్మించిన దాస్.. సైన్స్, న్యాయశాస్ర్తాల్లో పట్టా అందుకొన్నారు. 1974లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాలుపంచుకొన్న దాస్.. తర్వాత టెల్కోలో కార్మికుల ఆందోళనల్లోనూ తనవంతు పాత్ర పోషించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి.. ఆయన ఆరాధ్య నేతలు. 1995 నుంచి జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్న రఘువర్‌దాస్.. 2009 డిసెంబర్ 30-2010 మే 29 మధ్యకాలంలో జార్ఖండ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 59 ఏండ్ల దాస్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగానూ ఉన్నారు.

Followers