పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి


44 సంవత్సరాలు ఉన్న వారంతా అర్హులే.. ఈ అవకాశం సంవత్సరం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో 15,522 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా 3,783, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 9058, విద్యుత్‌శాఖ ద్వారా 2681 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఎన్‌. శివశంకర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. అన్ని శాఖలు తమ శాఖల పరిధిలో అనుమతి ఇచ్చిన ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు వివరాలను త్వరగా టీఎస్‌పీఎస్సీకి పంపించాలని ఆదేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్‌ పోస్టులను గుర్తించాలని పేర్కొన్నారు. హోంశాఖలో.. డీజీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగంలో సబ్‌-ఇన్‌స్పెక్టర్లు 12 ఖాళీలు. కానిస్టేబుళ్లు 174, డైరెక్టర్‌ జనరల్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ విభాగంలో ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ కానిస్టేబుల్‌ 2760, పోలీస్‌ కానిస్టేబుల్‌ (స్టేట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు సెంట్రల్‌ పోలీస్‌ లైన్స్‌) 56, పోలీస్‌ కానిస్టేబుల్‌ 1810, పోలీస్‌ కానిస్టేబుల్‌ (టీఎస్‌ ఎస్పీ-15 బెటాలియన్‌) 349 ఖాళీలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ (టీఎస్‌ ఎస్పీ-15 బెటాలియన్‌ కాకుండా)2860, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు(సివిల్‌) 107, (ఏఆర్‌) 91 మంది, టీఎస్‌ఎస్‌పీ ఆర్‌ఎస్‌ఐ 288, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(కమ్యూనికేషన్స్‌) 35, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పీటీవో) ఆరు, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసులో ఫైర్‌మెన్‌ 416, డ్రైవర్‌ ఆపరేటర్లు 85, స్టేషన్‌ ఫైర్‌ అధికారులు 9 ఖాళీల భర్తీకి అనుమతి లభించింది. కాగా, టీఎస్‌ జెన్‌కో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 988, సబ్‌ ఇంజనీర్లు 92, టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 309, సబ్‌ ఇంజనీర్లు 314, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 427, సబ్‌ ఇంజనీర్లు 153 , టీఎస్‌ ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ ఇంజనీర్లు 224, సబ్‌ ఇంజనీర్లు 174 ఖాళీల భర్తీకి అనుమతి లభించింది. విద్యుత్‌ శాఖలో మొత్తం 2681 ఖాళీలకు అనుమతి లభించింది.


తెలంగాణ – ఆంధ్రకు తేడా అదే



ss
తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంటి ? తెలంగాణలో ప్రజలు ఎలా వ్యవహరిస్తారు ? తమ ఇంటికి వచ్చిన వ్యక్తిని .. తమ ఊరికి వచ్చిన వ్యక్తిని ఎలా ఆదరిస్తారు ? అన్నది సాక్షాత్తు ఆంద్రాకు చెందిన ప్రముఖ సినీ రచయిత, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టంగా తేల్చిచెప్పాడు. ఆయన తన సునిశిత పరిశీలన తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పారు.
“తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా .. ఏ ఇంటికి వెళ్లినా బాబు ఛాయ తాగుతావా ? అన్నం తింటావా ? అని అడుగుతారు. ఎదుటి వ్యక్తి సోషల్ స్టేటస్ గురించి .. అతను ఎంత సంపాదిస్తాడు ? అతడు ఎవరు ? అన్నది పట్టించుకోరు. ఇది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదే ఆంధ్రాలో ఎక్కడికి వెళ్లినా ముందు నువ్వు ఏం చేస్తావు బాబు ? మీ నాన్నగారు ఏం చేస్తారు ? అంటూ సోషల్ స్టేటస్ కనుక్కుంటారు. దాన్ని బట్టే మర్యాద ఇస్తారు” అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
ఆంధ్రలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. మనిషి ఆర్థిక స్థితిని బట్టి అతనికి గౌరవం ఉంటుంది. కానీ తెలంగాణలో డబ్బుకు ప్రాధాన్యం చాలా తక్కువ. మానవత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే వీలయినంతవరకు అతనిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు.

Followers