Indian Bank PO Result 2018: ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల


Indian Bank PO Result 2018: ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడు...
ఇండియన్ బ్యాంక్ పీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6న నిర్వహించిన పరీక్షలో.. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ అభ్యర్థులంతా నవంబర్ 4న జరిగే ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ ఈ నెల 22లోపు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి
మెయిన్ పరీక్ష పూర్తయ్యాక అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్ బ్యాంక్ మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సు పూర్తయ్యాక.. అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో పీవోలు (Probationary Officer)గా ఉద్యోగాల్లో చేరతారు.
 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
education-news News Samayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి
Web Title: indian bank released result for online po prelims exam
Keywords: పీవో ప్రిలిమ్స్ | ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ | ఇండియన్ బ్యాంక్ | Indian Bank PO Prelims Result | Indian Bank PO

10th Class అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు



టెన్త్ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
దేశ‌ంలోని వివిధ స‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 13 వరకు ఫీజు చెల్లించవచ్చు.

ఖాళీల వివరాలు...

* సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్) ఎగ్జామ్
ఖాళీల సంఖ్య: 1054
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-620, ఓబీసీ-187, ఎస్సీ-160, ఎస్టీ-87.
తెలుగు రాష్ట్రాల పరిధిలో 56 (హైదరాబాద్‌-36, విజయవాడ-20) పోస్టులు ఉన్నాయి.


అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి. ఇంటెలిజెన్స్ వర్క్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తు ఫీజు: రూ.50/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంది.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

- పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.

రాత పరీక్ష విధానం: రెండు దశల్లో రాతపరీక్షలు (టైర్-1, టైర్-2) ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు.

* టైర్-1(ఆబ్జెక్టివ్ పేపర్) మొత్తం 100 మార్కులకుగాను 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. వాటిలో జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు) మినహా, మిగతా ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు.

* టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) మొత్తం 50 మార్కులకు ఉంటుంది.

* 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 34 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 20.10.2018
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018
* ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018


నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
వెబ్‌సైట్: https://mha.gov.in/

Followers