వాడేది స్మార్ట్ మొబైల్... వేలల్లో కాంటాక్ట్‌లు... ముఖ్యమైన ఫైల్స్...
ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం! బ్యాక్అప్ చేసుకోండి! భద్రంగా
దాచుకోండి!ప్రయాణంలో మొబైల్ పోయింది. చాలా కాంటాక్ట్‌లు ఉన్నాయి. ముఖ్యమైన
ఫైల్స్ కూడా. అన్నీ పోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు?లా సమస్య ఏదైనా
కాంటాక్ట్‌లను పోగొట్టుకున్న యూజర్లు చాలా మందే ఉంటారు. సరైన పరిష్కారం
కోసం వెతుకులాట సాగిస్తుంటారు. మీకు తెలుసా? ఫోన్లోని కాంటాక్ట్‌లను
ఎప్పటికప్పుడు బ్యాక్అప్ లేదా రీస్టోర్ చేసుకునేందుకు అనువైన ఆప్స్,
వెబ్ సర్వీసులు చాలానే ఉన్నాయి. ఫోన్లోనే కాదు... ఎక్కడైనా పొందేలా
క్లౌడ్స్టోరేజ్లోనూ భద్రం చేసుకోవచ్చు. మరింత అనువుగా వాడుతున్న
కంప్యూటర్లోకి బ్యాక్అప్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక ఎప్పుడైనా...
ఎక్కడైనా... కాంటాక్ట్‌లు పోయాయే! అనే మాట వినిపించదు. అదెలాగో... అందుకు
అనువైన వాటి సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!ఒక్కసారి తాకితే చాలు
బ్యాక్అప్ చేయవచ్చు. మరోసారి తాకితే రీస్టోర్ చేయవచ్చు. అంత సులువైన
యూజర్ ఇంటర్ఫేస్తో ముందుకొచ్చింది ఆప్. ఆప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్
చేసుకుని హోం స్క్రీన్‌లోని ఆప్షన్ని
ఎంపిక చేసుకుంటే మొత్తం కాంటాక్ట్‌లు బ్యాక్అప్ అవుతాయి. మెయిల్,
క్లౌడ్, కంప్యూటర్లలో బ్యాక్అప్ చేసిన ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు.
బ్లూటూత్ ద్వారా ఇతర మొబెల్స్ ఎక్స్టర్నల్ మెమొరీలోనూ భద్రం చేసుకునే
వీలుంది. ఏదైనా సందర్భంలో బ్యాక్అప్ చేసుకున్న ఫైల్ని రీస్టోర్
చేయాలంటే తెరపై కనిపించే గుర్తుపై తాకితే చాలు. చివరిసారిగా ఎప్పుడు
బ్యాక్అప్ చేశారో కూడా డిస్ప్లే చేస్తుంది. ఒక్క కాంటాక్ట్‌లే కాదు.
స్మార్ట్ మొబైల్ అన్నాక బ్యాక్అప్ చేసుకోవాల్సినవి చాలానే ఉంటాయి. మరి,
అన్నింటినీ బ్యాక్అప్ చేసుకోవడానికి ఆప్‌ని వాడొచ్చు. ఆప్స్,
కాంటాక్ట్‌లు, ఎస్ఎంఎస్లు, కాల్ లాగ్స్, బుక్మార్క్లు,
క్యాలెండర్స్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్అప్ చేసుకోవచ్చు. ఫోన్ ఇంటర్నల్,
ఎక్స్టర్నల్ మెమొరీ లొకేషన్స్‌లో బ్యాక్అప్ ఫోల్డర్ని క్రియేట్
చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లను జీమెయిల్లోకి బ్యాక్అప్ అయ్యేలా పెట్టుకునే
వీలుంది. కావాల్సిన ఆప్స్ అన్నింటినీ ఎస్డీ కార్డ్‌లోకి బ్యాక్అప్
చేసుకోవచ్చు. ఆటోమాటిక్‌గా బ్యాక్అప్ అయ్యేలా షెడ్యూల్ చేయవచ్చు.
'సెట్టింగ్స్'లోకి వెళ్లి బ్యాక్అప్ ఫోల్డర్ని మార్చుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... అనివార్యమై ఎప్పుడైనా మొబైల్‌ని
'ఫ్యాక్టరీ రీ సెట్' చేయాలనుకుంటే బ్యాక్అప్ ఫోల్డర్ని ఇంటర్నల్
మెమొరీ నుంచి ఎక్స్టర్నల్ మెమొరీ (ఎస్డీ కార్డ్)లోకి మార్చుకోండి.
ఫోన్ మెమొరీలోనో... ఎస్డీ కార్డ్లోనో కాకుండా ఎక్కడైనా... ఎప్పుడైనా
వాడుకునేలా క్లౌడ్ స్టోరేజ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాక్అప్ చేసుకుంటే?
అందుకు అనువైనదే ఆప్. ఉచితంగా ఇన్స్టాల్ చేసుకుని ఈమెయిల్ ఐడీతో
క్లౌడ్ ఎకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వచ్చిన హోం పేజీలోని
'బ్యాక్అప్'పై క్లిక్ చేయగానే మొత్తం కాంటాక్ట్‌లు క్లౌడ్‌లోకి
అప్లోడ్ అవుతాయి. ఇక ఎప్పుడైనా క్లౌడ్‌లోకి సింక్ చేసుకున్న
కాంటాక్ట్‌లను బ్యాక్అప్ లేదా రీస్టోర్ చేసుకోవచ్చు. క్లౌడ్
స్టోరేజ్‌లోకి ఆటోమాటిక్‌గా సైన్ఇన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు కూడా.
అప్లోడ్ చేసిన కాంటాక్ట్‌లను ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. వివిధ
క్లౌడ్‌స్టోరేజ్ సర్వీసుల్ని ఒకేచోట యాక్సెస్ చేసుకుని ఫొటోలు, మ్యూజిక్
ఫైల్స్‌ని బ్యాక్అప్ చేసుకునేందుకు వాడొచ్చు. ఇన్స్టాల్ చేయగానే ఆప్
అందించే అన్నీ సర్వీసులు తెరపై కనిపిస్తాయి. ముందుగా ఫోన్ మెమొరీ, ఎస్డీ
కార్డ్ మెమొరీ మెనూలు కనిపిస్తాయి. తాకుతూ ఆయా లొకేషన్లలో ఉన్న ఫైల్స్‌ని
బ్రౌజ్ చేసి చూడొచ్చు. ఫోన్ మెమొరీలో ఉన్న ఫైల్ని ఎస్డీకార్డ్లోకి
పంపాలంటే ఫైల్ని తాకి ఆప్షన్‌పై తాకితే చాలు. ఇదే మాదిరిగా ఏదైనా డేటాని
క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులోకి పంపొచ్చు. ఆప్‌లో బాక్స్, పికాస,
డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్.... లాంటి మరిన్ని
సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి. ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని
క్లౌడ్స్టోరేజ్ల్లోకి డేటాని పంపొచ్చు. ఉదాహరణకు అడ్రస్బుక్లోకి
కాంటాక్ట్‌లను ఫైల్‌గా క్రియేట్ చేసుకుని క్లౌడ్ స్టోరేజ్ సర్వీసుల్లో
భద్రం చేసుకోవచ్చు. ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరులు చూడకుండా 'ప్రైవేట్
మోడ్'లోకి మార్చుకోవచ్చు. కాంటాక్ట్‌లు, కాల్ లాగ్స్, ఎస్ఎంఎస్లు,
ఎంఎంఎస్‌లు, బ్రౌజర్ బుక్మార్క్లు, క్యాలెండర్లను సులువుగా
బ్యాక్అప్, రీస్టోర్ చేసుకునేందుకు మరో ఆప్ గూగుల్ ప్లే నుంచి ఉచితంగా
ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ద్వారా ఫోన్ మెమొరీ, ఎస్డీ కార్డ్ల్లోకి
కాంటాక్ట్‌లను బ్యాక్అప్ చేసుకోవచ్చు.ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌బాక్స్,
గూగుల్ డ్రైవ్‌ల్లోకి బ్యాక్అప్ చేసుకునే వీలుంది. ఐఫోన్ యూజర్లు
కాంటాక్ట్‌లు, ఇతర డేటాని భద్రం చేసుకునేందుకు ఆప్‌ని వాడొచ్చు. ఐట్యూన్స్
నుంచి ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోండి. హోం స్క్రీన్‌లోని 'బ్యాక్అప్'పై
క్లిక్ చేసి అన్ని కాంటాక్ట్‌లను భద్రం చేయవచ్చు. బ్యాక్అప్ చేసిన
ఫైల్ని మెయిల్ చేసుకోవడమే కాకుండా క్లౌడ్ స్టోరేజ్ సర్వీసుల్లోకి
అప్లోడ్ చేసుకునే వీలుంది. రీస్టోర్ చేసుకోవడం కూడా చాలా సులువు.
ఇలాంటిదే మరోటి ఆప్. లోకల్ ఫోన్ మెమొరీల్లోనే కాకుండా క్లౌడ్
స్టోరేజ్‌ల్లోనూ బ్యాప్‌అప్ కాపీని స్టోర్ చేయవచ్చు. వీసీఎఫ్
ఫార్మెట్లో సేవ్ చేసుకున్న ఫైల్ని సీఎస్వీ ఫార్మెట్లోకి ఎక్స్పోర్ట్
చేసుకుని ఎక్సెల్ స్ప్రెడ్షీట్లానూ యాక్సెస్ చేయవచ్చు. యాంటీవైరస్‌లా
ఫోన్‌కి రక్షణ వలయంలా పని చేస్తూనే మీ ఫోన్ కాంటాక్ట్‌లను సురక్షితం
చేస్తుంది ఆప్. కావాలంటే ప్రయత్నించి చూడండి. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు
దీన్ని ఆయా ఆప్ స్టోర్ల నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్
ట్రాకింగ్, రిమోట్ యాక్సెస్, ప్రైవరీ చిట్కాల్ని అందిస్తూనే ఫోన్లోని
కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు బ్యాక్అప్ చేస్తుంది. బ్యాప్‌అప్ కాపీని
సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఫోన్, ట్యాబ్‌లోకి
బ్యాక్అప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని రీస్టోర్ చేసుకోవచ్చు. మీరు
మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్ వాడితే ఆప్‌తో ఫోన్లోని అడ్రస్‌బుక్‌ని
సులువుగా సురక్షితం చేసుకునే వీలుంది. వీసీఎఫ్ ఫార్మెట్లో ఫైల్ని
క్రియేట్ చేసుకుని మైక్రోసాఫ్ట్ అందించే క్లౌడ్స్టోర్లో భద్రం
చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన బ్యాక్అప్ ఫైల్ని లోకల్ మెమొరీలో కూడా
స్టోర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు లింక్‌ని చూడండి. క్వర్టీ కీప్యాడ్‌తో
అలరించే బ్లాక్‌బెర్రీ సంగతేంటి? అనే వారికి ఆప్ ప్రత్యేకం. ఫోన్,
ఎస్డీకార్డ్ మెమొరీలతో పాటు ఈమెయిల్‌కి కాంటాక్ట్స్‌ని బ్యాక్అప్
చేసుకోవచ్చు. ప్రతిరోజు ఆటోమాటిక్‌గా కాంటాక్ట్‌లు బ్యాక్అప్ అయ్యేలా
సెట్ చేసుకునే వీలుంది. 'రీస్టోర్ ఆల్' ద్వారా అన్ని కాంటాక్ట్‌లను
తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.
ఫోన్లోని కాంటాక్ట్స్‌ని పీసీలోకి బ్యాక్అప్ చేసుకునేందుకు అనువైన
వారధులు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి. సైట్లోకి వెళ్లి పీసీ వెర్షన్
సాఫ్ట్‌వేర్‌ని ఇన్స్టాల్ చేసుకుని ఫోన్లోని అడ్రస్‌బుక్‌ని పీసీలోనూ
యాక్సెస్ చేయవచ్చు. కాంటాక్ట్‌లను మేనేజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు
అడ్రస్‌బుక్‌లోని వందల కాంటాక్ట్‌లను పీసీలోనే ఎడిట్ చేసుకోవచ్చు. కొత్త
నెంబర్లను అడ్రస్బుక్కి జత చేయవచ్చు. అక్కర్లేని కాంటాక్ట్‌లను డిలీట్
చేసి అప్డేట్ చేయవచ్చు. అన్ని కాంటాక్ట్‌లను బ్యాక్అప్ చేసుకుని
కావాల్సినప్పుడు రీస్టోర్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ ఆప్ ద్వారా మరో
అదనపు ప్రయోజనం ఏంటంటే... అందుబాటులో ఉన్న ఆప్ స్టోర్ల్లోని ఆప్స్,
గేమ్స్‌ని ఇన్స్టాల్ చేసుకుని ఫోన్లో వాడుకోవచ్చు. ఫోన్లోని
కాంటాక్ట్‌లను ఎక్సెల్‌కి అనువుగా మార్చుకుని బ్యాక్అప్ చేసుకోవచ్చు.
ఎస్డీకార్డ్లో సేవ్ అయిన ఫైల్ని ఎక్సెల్లో కావాల్సినట్టుగా ఎడిట్
చేసుకోవచ్చు.అడ్రస్‌బుక్ మొత్తాన్ని టెక్స్ట్ ఫార్మెట్లోకి మార్చుకుని
పొందేందుకు అనువైంది. హితుడి ఫోన్ నెంబర్ మారితే! అతను వ్యక్తిగతంగా
చెప్పేంత వరకూ మీకు తెలియదు. అలాగే, మీ మొబైల్ నెంబర్ మారితే... మీరు
చెప్పేంత వరకూ మీ స్నేహితుల్లో ఎవ్వరికీ తెలియదు. ఈ గ్యాప్ లేకుండా అందరూ
ఎప్పుడూ టచ్‌లోనే ఉండాలంటే? వాడితే సరి. ఈ ఆప్‌ని ఇన్స్టాల్ చేసుకుని
స్నేహితులు గ్రూపుగా ఏర్పడితే చాలు. ఎవరి నెంబర్ మారినా అందరి ఫోన్లలోనూ
ఇట్టే అప్డేట్ అవుతుంది. అలాగే, ఎప్పటికప్పుడు కాంటాక్ట్‌లను క్లౌడ్
స్పేస్‌లో బ్యాక్అప్ చేస్తుంది కూడా. ఇతర వివరాలకు సైట్లోకి వెళ్లండి.
ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి నిక్షిప్తం చేసుకోండి. ఐఫోన్
వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌లోకి వెళ్లండి. బ్లాక్‌బెర్రీ యూజర్లు
ఆప్‌వరల్డ్ నుంచి పొందొచ్చు.
జేబులోనే పవర్ బ్యాంకుని పెట్టుకుంటే?
ఫ్యాషన్‌లో స్లిమ్ సైజు ఎలాగో... టెక్నాలజీలోనూ అన్నీ స్లిమ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి! జేబులోనే ఒదిగిపోతూ... మీ వెంటే మేం అంటూ అలరిస్తున్నాయి! అలాంటి గ్యాడ్జెట్లు కొన్ని...ప్రయాణాల్లో జేబులో స్మార్ట్ మొబైల్ ఉంటుంది. కానీ, ఎక్కువ సమయం వాడితే ఛార్జ్ అయిపోతుంది. మన దేశంలో ఎక్కడంటే అక్కడ ఛార్జ్ చేసుకోవడం అసాధ్యం. మరి, ఇలాంటి సందర్భాల్లో జేబులోనే పవర్ బ్యాంకుని పెట్టుకుంటే? అదెలా సాధ్యం అనే సందేహం అక్కర్లేదు. సింపుల్‌గా పవర్ బ్యాంకు గురించి తెలుసుకుంటే సరి. ప్రపంచంలోనే తొలిసారి అత్యంత తక్కువ పరిమాణంలో రూపొందించిన పవర్ బ్యాంకు ఇదే. దీంతో రెండు మొబైల్ ఫోన్లను ఒకేసారి ఛార్జ్ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం కేవలం ఫోన్లనే కాదు. ట్యాబ్లెట్లు, ఐపాడ్లు, బ్లూటూత్, కెమెరాల్ని ఛార్జ్ చేయవచ్చు. రెండు డివైజ్‌లను ఛార్జ్ చేసేందుకు అనువుగా 'డ్యూయల్ యూఎస్బీ పోర్ట్‌లు' ఉన్నాయి. అన్ని స్మార్ట్ మొబైళ్లను ఇది సపోర్ట్ చేస్తుంది. బరువు 250 గ్రాములు. పవర్ బ్యాంకు పై భాగంలోని లెడ్ ఇండికేటర్ల ద్వారా ఛార్జ్ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ధరెంతో తెలుసా? రూ.3,299. ఇతర వివరాలకు సైట్లోకి వెళ్లండి.మరింత తక్కువ పరిమాణంలో కావాలంటే పవర్ బ్యాంకులనువాడొచ్చు. వీటితో యాపిల్, నోకియా, ఎల్జీ, సోనీ ఎరిక్సన్... లాంటి ఇతర కపెంనీ మొబైల్స్ ఛార్జ్ చేసుకునేందుకు ఏడు రకాల కనెక్టర్లను కూడా పొందొచ్చు. వీటి పవర్ సామర్థ్యం ఛార్జ్ చేసేందుకు రెండు పోర్ట్‌లు ఉన్నాయి. ఎలాంటి ఒత్తిడికి తగలకుండా ఉండేందుకు రబ్బర్ కేస్‌ని ఏర్పాటు చేశారు. వీటి ధర వరుసగా రూ.4,500 రూ.66,500. మరిన్ని వివరాలకు సైట్‌ని చూడండి.ఇంట్లో పీసీలోనూ జేబులో మొబైల్లోనూ ఏవైవో ఫైల్స్ స్టోర్ చేస్తుంటాం. ఫోన్ నుంచి పీసీలోకి... పీసీ నుంచి ఫోన్లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. అందుకు యూఎస్బీ కేబుల్ వాడుతుంటాం. కానీ, మీకు తెలుసా? పీసీ, ఫోన్కీ అనువుగా వాడుకునేలా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని. ఇదిగోండి కింగ్స్టన్ కంపెనీ తయారు చేసిన దీనికి రెండు వైపులా రెండు రకాల పోర్ట్‌లు ఉన్నాయి. మైక్రో యూఎస్బీ ద్వారా మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్లకు కనెక్ట్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదే మాదిరిగా యూఎస్బీ 2.0 ద్వారా పీసీకి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఎలాంటి అదనపు సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో వాడుకోవచ్చు. 8 జీబీ (రూ.500), 16 జీబీ (రూ.1200), 32 (రూ.2,200) జీబీల్లో డ్రైవ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు డ్రైవ్‌లోకి కాపీ చేసిన సినిమాని ట్యాబ్‌కి కనెక్ట్ చేసి హాయిగా చూడొచ్చు. వీడియో, ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి. సాన్‌డిస్క్ కంపెనీ కూడా ఈ తరహా డ్రైవ్‌లను అందిస్తోంది. కావాలంటే డ్రైవ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఆండ్రాయిడ్ 4.0 ఆపై వెర్షన్ మోడల్స్‌లో డ్రైవ్‌లను వాడుకోవచ్చు. అలాగే, (ఓటీజీ) అనే ఆప్షన్ కూడా మొబైల్లో ఉండాలి. దీనికీ రెండు వైపులా పోర్ట్‌లు ఉన్నాయి. మెమొరీ సామర్థ్యం వరుసగా... 16 జీబీ (రూ.1,199), 32 జీబీ (రూ.1,385), 64 జీబీ (రూ.3,800). ఇతర వివరాలకు జేబులో ఫోన్ హెడ్సెట్ పెట్టుకోవడం తెలిసిందే. కానీ, ఎప్పుడైనా స్పీకర్‌ని పెట్టుకుని తీసుకెళ్లారా? ఎక్కడంటే అక్కడ హాయిగా విన్నారా? అయితే, మీరు పోర్టబుల్ స్పీకర్ గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో కనిపించే ఈ స్పీకర్‌ని షర్ట్ జేబులోనే పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. స్పీకర్ సామర్థ్యం బ్లూటూత్ ద్వారా ఫోన్, ట్యాబ్, ల్యాపీలకు అనుసంధానం చేసి పాటలు వినొచ్చు. 3.5 ఎంఎం స్టీరియో కేబుల్, స్టీరియో జాక్ కూడా ఉంది. దీంట్లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ ద్వారా 5 గంటలు పాటలు వినొచ్చు. ద్వారా పాటల్ని మరింత క్వాలిటీతో వినొచ్చు. ధర రూ.3,490. మరిన్ని వివరాలకు ఇలాంటిదే మరోటి పోర్టబుల్ స్పీకర్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటలు పాటలు వినొచ్చు. ఛార్జ్ చేసేందుకు రెండు గంటలు పడుతుంది. వివరాలకు ఛార్జర్... యూఎఎస్‌బీ కేబుల్... ద్వారా మొబైల్ ఫోన్‌ని ఛార్జ్ చేయడం తెలుసు? ఆయా ఛార్జర్లు, యూఎస్బీ కేబుళ్లను జేబులో పెట్టుకుని వెళ్తుంటాం. కానీ, మరింత సౌకర్యంగా పర్సులో క్రెడిట్ కార్డ్ మాదిరిగా పెట్టుకుని ఛార్జర్‌ని తీసుకెళ్తే!! అలాంటిదే చిత్రంలో మాదిరిగా దీన్ని పీసీ, కంప్యూటర్లకు కనెక్ట్ చేసి మొబైల్, ట్యాబ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. పైన చెప్పిన పవర్ బ్యాంకులు, మొబైళ్ల అనుసంధాన కర్తలా ఈ ఛార్జ్‌కార్డ్ పని చేస్తుంది. దీని ధరెంతో తెలుసా? సుమారు రూ.1695. ఇలాంటిదే మరోటి తాళాల గుత్తిలో తాళంలా కలిసిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మొబైల్ ఫోన్లలను ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు. రూ.1700. వివరాలకు సైట్లోకి వెళ్లండి.పర్సులో ఛార్జర్లేనా? పెన్‌డ్రైవ్‌ని కూడా కార్డ్‌లో పెట్టుకుని వాడుకోవచ్చు. అదెలా అంటారా? అయితే, తయారు చేసిన మైక్రో యూఎస్బీ కార్డ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. పేరు చిత్రంలో మాదిరిగా దీన్ని పర్సులో పెట్టుకుని వాడుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌ల్లో ఒకటిగా కలిసిపోతుంది. యూఎస్బీ 2.0 వెర్షన్‌తో పని చేస్తుంది. వీటి మెమొరీ సామర్థ్యం 4 జీబీ, 8 జీబీ. ధర సుమారు రూ.499, 599. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. కార్డ్ రూపంలోనే మరిన్ని డ్రైవ్‌లు కావాలంటే తయారు చేసినవి చూడాల్సిందే. యూఎస్బీ 2.0 వెర్షన్‌తో 4 జీబీ మెమొరీతో యూఎస్‌బీలను తయారు చేశారు. చూడడానికి వీసా, మాస్టర్ కార్డ్‌లానే ఉంటాయి. ధర రూ.599. మరిన్ని వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.ప్రపంచంలో ఎక్కడైనా వాడుకునేలా ఓ ట్రావెల్ ఛార్జర్ ఉంది. అదే సుమారు 10 రకాల పవర్ సాకెట్స్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లోనే మరోవైపు డ్యూయల్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. వాటితో మొబైల్, ట్యాబ్లెట్లను ఛార్జ్ చేయవచ్చు. ఇది జేబులో ఉంటే ఎలాంటి అడాప్టర్లతో పని లేకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ప్రయాణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ధర సుమారు రూ.1499.వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.
Subscribe to:
Posts (Atom)