'కృత్రిమ రెటీనా' రూపకల్పన

జెరూసలెం: దెబ్బతిన్న రెటీనాకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవటానికి వీలైన పలుచటి, కాంతికి స్పందించే కొత్త పొరను శాస్త్రవేత్తలు రూపొందించారు. నానోరాడ్స్‌, కార్బన్‌ నానోట్యూబ్స్‌తో తయారచేసిన దీన్ని టెల్‌ అవైవ్‌, హీబ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు కాంతికి స్పందించని కోడిపిల్ల రెటీనాతో పరీక్షించారు. ఇది కాంతిని గ్రహించినట్టు, నాడీసంబంధ చర్యను ప్రేరేపించినట్టు బయట పడటం విశేషం. ఇతర పరిజ్ఞానాలతో పోలిస్తే ఇది మరింత మన్నికైన, సమర్థవంతమైన, తేలికగా వంగే సామర్థ్యం గల పరికరమని పరిశోధకులు తెలిపారు. వయసుతో పాటు వచ్చే మాక్యులర్‌ డీజెనరేషన్‌ (ఏఎండీ) సమస్యతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడగలదని వివరించారు.

పాక్‌ అణు క్షిపణి పరీక్ష విజయవంతం

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 13: భారత్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకోగల అణుక్షిపణిని పాకిస్థాన్‌ గురువారం విజయవంతంగా పరీక్షించింది. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదించగల ఈ క్షిపణికి అణు, సంప్రదాయ వార్‌హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యముంది. హతాఫ్‌-6గా కూడా పిలిచే ఈ మధ్యశ్రేణి షహీన్‌-2 మిస్సైల్‌ను అరేబి యా సముద్రం నుంచి పరీక్షించినట్టు పాక్‌ సైన్యం తెలిపింది.

Followers