Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

భూ సేకరణ బిల్లు


భూసేకరణ చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే సవరించడం, అమలు దశలో అన్యాయం జరగకుండా చూడడం అవసరం. కానీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం జారీ చేసిన బిల్లు చట్టరూపం పొందితే భూమి సేకరించడానికి రైతుల ఆమోదం అవసరం ఉండదు. సమాజంపై ప్రభావ అంచనా కూడా ఉండదు. ఈ రెండు అంశాలు లేకపోతే 2013 నాటి చట్ట లక్ష్యమే దెబ్బతింటుంది. భూ సేకరణ చట్టంలో సవరణలు చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు తీవ్ర నిరసన ఎదురవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదమూడు పార్టీలు మంగళవారం నిరసన తెలిపాయి. 2013లో యూపీఏ ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజా సవరణలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో కూడా శ్రద్ధ వహించారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లును మోడీ ప్రభుత్వం లోక్‌సభలో ఆమోదించగలిగినా ప్రతిపక్షాలకు అధిక బలం ఉన్న రాజ్యసభలో గట్టెక్కడం అంత సులభం కాదు. రాజ్యసభ ఈ బిల్లును తిరస్కరించినా లోక్‌సభలో ఉన్న మెజారిటీ మూలంగా ఈ బిల్లుకు చట్టరూపం ఇవ్వడం కష్టమేమీ కాదు. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నా యి. ప్రతిపక్షాలు ఊరేగింపుగా వెళ్ళి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడం ఇందులో భాగమే. ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని మోడీ బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తున్నది. అయితే రాష్ట్రపతి చేత పార్లమెంటును ప్రొరోగ్ (నిరవధిక వాయిదా) చేయించి భూసేకరణ ఆర్డినెన్స్‌ను కొత్తగా జారీ చేయాలనే ఎత్తుగడ పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టాన్ని ప్రవేశ పెట్టడానికి ముందు, పరిశ్రమలకు భూములు కట్టబెట్డానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరించాయి. గ్రామ సభలను తూతూ మంత్రం అన్నట్టుగా జరిపేవారు. కంపెనీల ప్రతినిధులు రాజకీయ నాయకుల అండ సంపాదించి, పోలీసులను భారీగా మోహరింప చేసి రైతులు ఆమోదించినట్టు తతంగం నడిపేవారు. రైతుల భూములు నిర్దాక్షిణ్యంగా గుంజుకునేవారు. అందుకే 2013 చట్టంలో రెండు ప్రధానాంశాలు ఉన్నాయి. ఒకటి- భూసేకరణ పారదర్శకంగా జరపాలనేది. ప్రైవేటు కంపెనీల కోసం అయితే 80 శాతం రైతుల ఆమోదం తప్పనిసరి. అదే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే 70 శాతం ఆమోదం ఉండా లె. ఈ చట్టంలోని రెండవ ప్రధా న అంశం- సమాజంపై ప్రభావం అంచనా. సాధారణంగా నష్ట పరిహారం భూమి ఉన్నవారికే వస్తుం ది. కానీ ప్రభు త్వం చిత్తశుద్ధితో పునరావాస చర్య లు తీసుకోవాలంటే సమాజంపై ప్రభావం అంచ నా తప్పనిసరి. నిజానికి ఒక ప్రాంతాన్ని ముంచాలన్నా, ప్రజలను తరలించి వేరే వారికి అప్పగించాలన్నా ఇటువంటి అంచనాలు వేయడం అవసరం కూడా. యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయదని విమర్శించే సంఘ సేవా సంస్థలు ఉన్నా యి. అయితే ఉన్నంతలో గతంతో పోలిస్తే ఇదొక ముందడుగు. భూసేకరణ చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే సవరించడం, అమలు దశలో అన్యాయం జరగకుండా చూడడం అవసరం. కానీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం జారీ చేసిన బిల్లు చట్టరూపం పొందితే భూమి సేకరించడానికి రైతుల ఆమోదం అవసరం ఉండదు. సమాజంపై ప్రభావ అంచనా కూడా ఉండదు. ఈ రెండు అంశాలు లేకపోతే 2013 నాటి చట్ట లక్ష్యమే దెబ్బతింటుంది. రాష్ట్ర విభజన సక్రమంగా జరగకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్న టీఆరెస్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వంతో సంబంధాలు సున్నితంగా మారా యి. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూనే భూసేకరణ చట్టంలోని ప్రజా వ్యతిరేక స్వభావాన్ని వ్యతిరేకించడంలో టీఆరెస్ సభ్యులు వెనకాడలేదు. అయితే రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నందు వల్ల, కేంద్ర చట్టంలో తగు వెసులుబాటు ఏర్పాటు చేసుకొని, అమలు దశలో తాము ప్రజానుకూలంగా వ్యవహరించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. కీలకాంశాలను రాష్ర్టాలకు వదిలేసే విధంగా సవరణలను ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో టీఆరెస్ సభ్యులు వివరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించడం మంచిది. 2013 నాటి కేంద్ర భూసేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలె. కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఈ దిశగా అడుగు వేయలేదు. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించుకున్న తొలి రాష్ట్రంగా ఆదర్శంగా నిలిచిందని టీఆరెస్ సభ్యులు లోక్‌సభలో వెల్లడించారు. సమాజంపై ప్రభావ అంచనా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నిపుణుల చేత శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని కూడా ప్రస్తావించారు. పారిశ్రామికాభివృద్ధి అవసరాన్ని ఎవరూ కాదనలేరు. పైగా ఇప్పుడున్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులు తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో తమ బాధ్యతను విస్మరించకూడదు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పేదల భూములను గుంజుకొని బంధుగణానికి పంచిపెట్టిన దుర్నీతిని కూడా లోక్‌సభలో టీఆరెస్ సభ్యులు ప్రస్తావించారు. ఈ దురాగతాలను గుర్తించి భూసేకరణ చట్ట సవరణను మోడీ ప్రభుత్వం పునరాలోచించడం మంచిది.


అన్నా హజారేకు సోనియా లేఖ

 భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్రకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె అన్నాకు ఓ లేఖ రాశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 14 పార్టీలు సోనియా నేతత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌కు చేపట్టిన ర్యాలీపై అన్నా తనకు రాసిన లేఖకు ఆమె సమాధానంగా ఈ లేఖ రాశారు. 'భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై మీరు సందేహాలు వ్యక్తం చేస్తూ మార్చి 14న మీరు రాసిన లేఖ అందింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు, సవరణ బిల్లుపై మీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అన్ని వేదికలపైనా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపట్టడం కూడా బిల్లుపై మా వ్యతిరేకతను వ్యక్తం చేయటంలో భాగమే. దీనికి సంబంధించి మా పోరాటం కొనసాగుతుందని మీకు హామీ ఇస్తున్నా'అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.


43 ఏళ్లు మగవాడిలా....


43 ellu magavaadila....


కన్న కూతురును పెంచి పెద్ద చేయడం కోసం 43 ఏళ్లపాటు ముమ్మూర్తులా మగవాడిలా బతికిన ఆ మాతృమూర్తి గొప్పతనాన్ని ఏ అవార్డులతో తూచగలం? అయినా లగ్జర్ సోషల్ సాలిడారిటీ డైరెక్టరేట్ తనవంతు కర్తవ్యంగా మంగళవారం ఆమెను *ఏ విమన్ బ్రెడ్ విన్నర్* అవార్డుతో సత్కరించి 'కైరో ఆదర్శ మాతృమూర్తి'గా కీర్తించింది. 64 ఏళ్ల ఆ మాతృమూర్తి పేరు సిసా అబూ దాహ్. కైరోకు 635 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్జర్ గవర్నేట్ రాజధాని నగరమైన లగ్జర్‌లోనే ఆమె జీవితమంతా గడిచింది. తన 21వ ఏట కన్న కూతురు కడుపులో ఉండగానే కట్టుకున్న భర్త కన్నుమూశాడు. అప్పటికి ఆస్తిపాస్తులు అసలే లేవు. నా అనే వాళ్లు అంతకన్నా లేరు. వారి కమ్యూనిటీలో స్త్రీలు బయటకెళ్లి కూలి పనిచేయడం నేరం. బిచ్చమెత్తుకొని జీవించడం ఆమెకు ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో పురుషుడి అవతారం ఎత్తక తప్పలేదు. ఎక్కడా స్త్రీత్వం ఆనవాళ్లు కూడా కనిపించకుండా జుట్టు కత్తిరించుకొని వదులుగా ఉండే మగవాడి దుస్తులేసుకొని కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. మగవాడిలానే మాట్లాడడం అలవాటు చేసుకొంది. భవన నిర్మాణ పనుల్లో ఇటుకలు మోసింది. సిమెంటు బస్తాలు భుజాన వేసుకొంది. ఖాళీ సమయాల్లో షూ పాలిష్ చేసింది. అలా వచ్చిన సంపాదనతో కూతురును పెంచి పెద్ద చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసింది. కష్ట పడేవారికే కష్టాలు కాచుకు కూర్చుంటాయన్నట్టుగా అనారోగ్యం వల్ల అల్లుడు మంచం పట్టాడు. మళ్లీ కుటుంబపోషణ భారమంతా తనపైనే పడింది. పరిస్థితులకు ఎదురీదక తప్పలేదు. వయస్సు మీద పడటంతో ఈసారి మాత్రం బరువు పనుల జోలికి వెళ్లకుండా బూటు పాలిష్‌ను వృత్తిగా చేసుకొంది. లగ్జర్ నగర వీధుల్లో నేటికి కనిపించే సీసా అబూను ఎవరూ మహిళ అనుకోరు. దాదాపు 43 ఏళ్ల పాటు మగవారితో కలిసి పనిచేసినా, వారి వెంట తిరిగినా ఎవరు తనను స్త్రీ అని ఇంతవరకు గుర్తించలేదని ఆమే తెలిపారు. అందువల్ల మగవారి వేధింపులను కూడా తాను ఎన్నడూ ఎదుర్కోలేదని చెప్పారు. ఆ ఆదర్శ మాతృమూర్తికి హాట్సాప్!



బుద్ధునిపై అసభ్యకర యాడ్: న్యూజిలాండ్ దేశీయుడికి రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష


buddhunipai asabhyakara yaad: nyujilaand deshiyudiki rendunnara
మద్యం మత్తులో బుద్దుడి ఫోటోపై మత దూషణకు పాల్పడినందుకు బార్ మేనేజరైన న్యూజిలాండ్ వ్యక్తితో పాటు, మరో ఇద్దరు మయన్మార్ వ్యక్తులకు రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ మయన్మార్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. న్యూజిలాండ్ దేశస్తుడైన ఫిలిప్ బ్లాక్‌వుడ్ విగాస్ట్రో బార్‌‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తన బార్‌కు ప్రాచుర్యం కల్పించడానికి బౌద్ధ మత దేవుడు బుద్ధునిపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఈ బౌద్ధ మత దూషణలో విగాస్ట్రో బార్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు అతనికి సహాయపడిన వారికి కూడా శిక్ష విధించారు. డీజే హెడ్‌పోన్‌లు ధరించిన బుద్ధుని చిత్రాన్ని ఫిలిప్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో పెద్దఎత్తున బౌద్ధ మత మద్దుతుదారులు బార్ ముందు తమ నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన మయన్మార్ పోలీసులు వారి ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 2011 వరకు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో బౌద్ధమతం ఎక్కువ. ఇటీవల కాలంలో మయన్మార్‌లో తరచుగా మత కలహాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మత హింసలో బౌద్ధులు ముస్లింలను టార్గెట్‌గా చేసుకునేవారు. మయన్మార్
మార్కెట్ రోడ్డులోని విగాస్ట్రో బార్‌లో రెస్టారెంట్, నైట్ క్లబ్ కలిసే ఉంటాయి. బుద్ధుని చిత్రంపై ఫిలిప్ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంటనే బార్‌ను మూసివేశారు. ఇందుకు మయన్మార్ ప్రజలకు క్షమాపణ తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో బార్ యజమాని పేర్కొన్నారు.




నిరాశపర్చిన ఎపి వార్షిక బడ్జెట్..

ఎపి రాష్ట్ర వార్షిక బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎపి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్, టిడిపి నేత ఆనంద్ రావు, వైసిపి నేత కరణం ధర్మశ్రీ పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ లో నిరుద్యోగులకు సరైన కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సంస్కరణలు.. 'లా కమిషన్' సిఫార్సు అంశంపై చర్చించారు. ఎన్నికల సంస్కరణపై 'లా కమిషన్' సిఫార్సుల్లో కొన్ని ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.

చలో అసెంబ్లీకి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీలు


chalo asembliki siddhamavutunna aandhrapradesh angan vaadilu



హైదరాబాద్:మన దేశంలో ఈ వ్యవస్థే లేకపోతే దాదాపు ఆరు కోట్ల మంది చిన్నారులు ఏమయ్యోవారో! తలచుకోవాలంటేనే భయమేస్తోంది. నిజమే. గత నలభై ఏళ్ల కాలంలో దాదాపు ఆరుకోట్ల మంది పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంగన్‌వాడీలకే దక్కుతుంది. అంతేనా దాదాపు కోటి మందికి పైగా గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీల సహకారంతో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గతంలో సగర్వంగా చెప్పుకుంది. మన దేశంలోని 13 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 18 లక్షలమంది వర్కర్లు, సహాయకుల అంకుఠిత సేవలే ఇందుకు కారణమనడంలో సందేహం లేదు. చిన్నారుల ఆలనా పాలనా.... ప్రతి రోజూ కొన్ని లక్షల మంది చిన్నారుల ఆలనా పాలనా చూసి, వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తున్న అంగన్‌వాడీల జీవితాల్లో మాత్రం మందహాసం కనిపించడం లేదు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు కూడా అంగన్‌వాడీల సమస్యలను తీర్చే ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరం. తెలంగాణ బడ్జెట్‌లో ఎంతోకొంత వేతనాలు పెంచిన్నప్పటికీ, కేంద్ర బడ్జెట్‌, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లు పూర్తిగా నిరాశ పరిచాయి. 55వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు..... ఆంధ్రప్రదేశ్‌లో 55వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. కొన్ని లక్షల మంది చిన్నారులకు ఇవి అమ్మ ఒడి లాంటివి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ సేవలు అందిస్తూ వుంటారు. గర్భిణీలకు, బాలింతలకు, ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, వైద్య ఆరోగ్య స్పృహను పెంపొందించడం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడం లాంటి బాధ్యతలను నిర్వర్తించేది అంగన్‌వాడీలే. బాలింత మరణాలు, శిశు మరణాలు నివారించడంలో వీరి పాత్ర కీలకం. ప్రభుత్వ తీరు ఆందోళనకరం.... ఇలాంటి గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీల విషయంలో కొంత కాలంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అంగన్‌వాడీల నిర్వహణలో రాజకీయ జోక్యమూ మితిమీరుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణలోని అంగన్‌వాడీలు ఈ నెల నుంచి 7500 రూపాయల వేతనం అందుకోబోతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో వీరు 4200 రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రోజుకి ఏడు ఎనిమిది గంటలు శ్రమిస్తున్నవారికి ఇంత తక్కువ వేతనం ఇవ్వడం అన్యాయం కాకపోతే మరేమిటి? అందులోనూ చిన్నపిల్లలను డీల్‌ చేయడం అత్యంత ఓర్పు, సహనాలతో కూడుకున్న వ్యవహారం. వృత్తిపర ఒత్తిడి మాత్రం తీవ్రంగా.... అంగన్‌వాడీలకు ఇస్తున్నది అతి తక్కువ వేతనాలే అయినా వారి మీద వృత్తిపర ఒత్తిడి మాత్రం తీవ్రంగానే వుంటోంది. వారి చుట్టూ ఎన్నో రాజకీయాలు. నిత్యం అభద్రత. ప్రభుత్వాలు మారిన్నప్పుడల్లా చాలామంది అంగన్‌వాడీల పోస్టులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఎవరిని ఏ కారణంతో తీసేస్తారో అర్ధంకాని దురావస్థ. ఇక స్థానిక రాజకీయ నేతల పెత్తనం సరేసరి. అధికార పార్టీ పెట్టే ప్రతి మీటింగ్‌కీ వీరు హాజరుకావాల్సిందే. ఎవరైనా హాజరుకాకపోతే ఇక వారి మెడ మీద కత్తి వేలాడుతూనే వుంటుంది. వీటికి తోడు అధికారుల వేధింపులూ తప్పవు. ఒక్కొక్కసారి లైంగిక వేధింపులనూ భరించాల్సి వస్తోందంటే అంగన్‌వాడీలు ఎలాంటి పరిస్థితుల్లో బతకాల్సి వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గొంతెమ్మ కోర్కెలు కావు... దేశవ్యాప్తంగా వున్న 18 లక్షల మంది అంగన్‌వాడీలు గొంతెమ్మ కోరికలేవీ కోరడం లేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కనీస వేతనం ఇవ్వాలనీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలనీ, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు.



స్టాప్‌లర్‌తో కుట్లు వేసిన డాక్టర్


staaplarto kutlu vesina daaktar



ఏదైనా పెద్ద గాయమైతే డాక్టర్లు కుట్లు వేస్తారు. అయితే వరంగల్ జిల్లాలోని ఓ డాక్టర్ గాయానికి కుట్లు వేయకుండా స్టాప్‌లర్‌తో పిన్నులు వేసి పంపించాడు. దాంతో గాయం తిరగబెట్టింది. ఇలా స్టాప్‌లర్‌తో 'కుట్లు' వేసిన డాక్టర్ ఏ ఆర్.ఎం.పీ. డాక్టరో కాదు.. ఎంబీబీఎస్ వెలగబెట్టిన డాక్టరే. తొర్రూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ అనే మహిళ తన భర్త కూర్మయ్యతో కలసి ద్విచక్ర వాహనం మీద వెళ్తూ వుండగా ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె నుదుటి మీద గాయమైంది. ఈ భార్యాభర్తలు తొర్రూరులోని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. ఆయనగారు గాయాన్ని తీవ్రంగా పరీక్షించి, గాయానికి స్టాప్‌లర్‌తో పిన్నులు వేయడం మొదలుపెట్టాడు. అది చూసి అదిరిపోయిన ఆమె భర్త పిన్నులు వేస్తున్నారేంటని ప్రశ్నిస్తే, ఆ డాక్టర్ ''డాక్టర్ నువ్వా నేనా?'' అని సీరియస్‌గా ప్రశ్నించడంతో ఆమె భర్త మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత ఆ పిన్నుల ధాటికి గాయానికి సెప్టిక్ అయి బాధ పెరిగింది. దాంతో ఆమె వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడి డాక్టర్లు ఈ నిర్వాకం చూసి నోళ్ళు తెరిచారు. ఈ నిర్వాకం గురించి తెలుసుకున్న మీడియా స్టాప్‌లర్‌ డాక్టర్ దగ్గరకి వెళ్ళి ఇలా కుట్లేశారేంటి అని అడిగితే, ఇప్పటి వరకు చాలామందికి ఇలా పిన్నులు వేశాను.. ఎవరికీ ప్రాబ్లం రాలేదని చెప్పడంతో అందరూ బిత్తరపోయారు.


మలేషియా విమానం మాయమై ఏడాది



అదేమీ చిన్న వస్తువు కాదు. భారీ విమానం. సరిగ్గా సంవత్సరం క్రితం 239 మందితో ప్రయాణిస్తున్న మలేషియా విమానం మాయమై పోయింది. ప్రపం చంలోని అత్యా దునిక సాంకేతిక పరి కరాలు ఆ విమానం ఎక్కడ ఉం దన్న సం గతిని గుర్తించలేకపోయాయి. విమాన శిథిలాలు కాదుకదా, దానికి సంబంధించిన చిన్న రేకుముక్క కూడా దొరకలేదు. వరల్డ్‌ ఎయిర్‌ లైన్‌ హిస్టరీలో అత్యంత విషాదకర సంఘటనగా చరిత్రకెక్కిన దుర్ఘటనలో విమానం కూలిపోయిందని భావిస్తున్న అనుమానిత ప్రాంతాన్ని అణువణువునా శోధిస్తున్నా, సమ యం ఏడాది కావడం మినహా, ఏ ఆధారమూ లభించలేదు. ప్రయాణికుల బంధువులు మాత్రం విమానం కూలిపోయిందన్న విషయం ఆధారాలతో నిర్థారణ కాకుండా ప్రయాణికులు చని పోయారని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విమానాన్ని హైజా క్‌ చేశారనీ, తమవాళ్లను ఎవరో కిడ్నాప్‌ చేశారని నమ్ముతున్న వారూ వున్నారు. మొత్తం 23 వేల చదరపు మైళ్లు వెతకాలని లక్ష్యంగా పెట్టుకున్న మలేషియా అధికారులు, ప్రస్తుతానికి 10 వేల మైళ్లు వెతికారు. మిగిలిన ప్రాంతాన్ని మేలోగా పూర్తి చేసి విమానాన్ని కనిపెడ తామని మాత్రం చెబుతున్నారు.

కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసేక్త లేదు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక కేజీ టు పీజీని పటిష్టంగా అమలు పరచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా మన్నారు. దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా పాలసీని రూపొందిస్తామని చెప్పారు. శాసనసభలో శనివారం సభ్యులు కే లక్ష్మణ్‌, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కేజీ టు పీజీ విషయమై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘా లతో చర్చించి అమలుచేస్తామన్నారు. ఈ పాలసీని అసెంబ్లీలో సైతం చర్చకు పెడతామని చెప్పారు. నాణ్యతతో కూడిన ఉచిత విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా కామన్‌ స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ, ప్రవేటు రంగంలో 43,861 పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 59,54,376 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కాగా మరో 46 వేల మంది పిల్లలు బడి బయట ఉన్నారన్నారు. వీరందరకూ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం విష యమై కమిటీని వేశామని, ఇది నివేదికను సమర్పించగానే దానిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలు ఉన్న చోట్ల విద్యార్థులు లేరని, విద్యా ర్థులు ఉన్న చోట సరిపడా ఉపాధ్యాయలు లేరని ఇటువంటి లోపాలను సరిచే స్తామన వెల్లడించారు. దేశానికే ఆదర్శవంతమైన విద్యా పాలసీని అందించా లన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి కడియం తెలిపారు. అలాగే పువ్వాడ అజయ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఎమ్‌సెట్‌ ఉమ్మడిగా నిర్వహించాలనేది ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో లేదని తేల్చిచె ప్పారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎంసెట్‌ను నిర్వహి స్తున్నామని చెప్పారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్డ్‌లో ఉన్న సంస్థలను మాత్రమే ఉమ్మడిగా నిర్వహించుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంసె ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎంసెట్‌ నిర్వహణ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ సీట్ల ఎంపికకు ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి పేర్కొన్నారు.


నవాజ్ షరీఫ్‌కు మోడీ ఫోన్


ప్రపంచ కప్ 2015 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. ఆదివారం నాడు (15వ తేదీన) పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మోడీ స్వయంగా నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. క్రికెట్ గురించి వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు చెప్పారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు ఒకరి జట్టుకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారన్నారు. 1992లో పాకిస్తాన్ కప్పు గెలవడాన్ని మోడీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు ప్రారంభించాలని షరీఫ్ కోరారు. త్వరలో జరిగే కామన్వెల్త్ దేశాల సమావేశానికి కార్యదర్శులను పంపుదామని, అక్కడ వారు తాజా పరిస్థితులను చర్చిస్తారని మోడీ చెప్పారని తెలుస్తోంది.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ - కెటిఆర్


మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ తప్పకుండ కల్పిస్తామని ప్రకటించారు కెటిఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. ఉర్దూ మీడియం పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. మైనార్టీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.


తెలంగాణా బడ్జెట్‌ 2015


మొత్తం బడ్జెట్‌ రూ. 1,15,689.19 కోట్లుప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లుప్రణాళికా వ్యయం రూ. 52,383.19 కోట్లుపన్నుల ద్వారా ఆదాయం రూ. 46,494.75 కోట్లుపన్నేతర ఆదాయం రూ. 22,413.27 కోట్లుప్రతిపైసా ప్రజల కోసమే..కేంద్రం నిధుల కోతలేసినా...లక్ష్యం దిశగా అడుగులుబడ్జెట్లో ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యాయన్న ఈటెల2015-16 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విత్తమంత్రిభారీ కోతలను సవరణ బడ్జెట్లో చెప్పని వైనంఇది అంకెల గారడీ: విపక్షాలుకేంద్రం 20 వేల కోట్లు కోతేసినా...ఆశించిన రాబడి రాకపోయినా...అప్పుల భారం భయపెడుతున్నా..ఆదాయ మార్గాలు అంతంతగానే ఉన్నా......ఇలా ఎన్ని హద్దులున్నా..బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగాపెద్ద పద్దును విత్తమంత్రి ఆవిష్కరించారుసొంత ఆదాయ వనరులపై పూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించారుప్రతిష్ఠాత్మక పథకాలకు పెద్దపీట వేశారుసర్కారు ప్రాధాన్యాల్ని బలంగా వినిపించారుఆర్థిక గంభీరతను చాటుతూ.. మిగులు బడ్జెట్‌నూ చూపారు..ఈ నిధుల లెక్కలు ఘనంగానే ఉన్నా.. వాటి సాధనపైనే సంశయాలు!!నడుస్తున్న బడ్జెట్లో రాబడి లక్ష్యాల్ని అందుకోలేకపోయిన సర్కారు..కొత్త బడ్జెట్‌లో ఇందుకోసం ఏ చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాల్సిందే!!''2014-15లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంచనాల కన్నా బాగా తగ్గాయి. ప్రణాళికా సాయంగా రూ.11,781 కోట్లు రావాల్సి ఉండగా ఫిబ్రవరి వరకూ వచ్చింది రూ.4,147 కోట్లే. రూ.9,939 కోట్ల ప్రణాళికేతర గ్రాంటులో అందింది రూ.1,346 కోట్లు మాత్రమే. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి పన్నుల రాబడుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెరిగినా తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గింది. అయినప్పటికీ కొత్త బడ్జెట్‌లో మా ప్రభుత్వం అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తోంది.''-బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌భారీగా తెలంగాణ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌కేంద్ర సాయం తగ్గినా వెనకడుగులేదనిఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడిఅన్ని రంగాలకూ ప్రాధాన్యంప్రతిష్ఠాత్మక పథకాలకు స్థానంభూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణ ద్వారా రూ.13,500 కోట్ల లక్ష్యంవ్యాట్‌ రాబడి తగ్గిందంటూనే మళ్లీ భారీ అంచనాభారీ కోతలను సవరణ బడ్జెట్‌లో చెప్పని వైనంహైదరాబాద్‌ - న్యూస్‌టుడేలంగాణ తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ (2015-16) భారీ కేటాయింపులతో తొణికిసలాడింది. పలు ప్రతిష్ఠాత్మక పథకాలకు తాజా బడ్జెట్‌లో స్థానం లభించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అంచనాల కన్నా తగ్గాయంటూనే భారీ కేటాయింపులతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృఢవిశ్వాసం వ్యక్తంచేసింది. గత హామీల మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా చేపట్టాలనే పట్టుదలతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయటానికి సిద్ధపడింది. 2015-16వ ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ పునర్‌నిర్మాణమే ధ్యేయంగా రూ1,15,689 కోట్ల కేటాయింపులతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకూ కేటాయింపులు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్‌లో కేటాయింపులు 2014-15 కంటే రూ.14,977 కోట్లు అధికం.ప్రస్తుత (2014-15) పది నెలల బడ్జెట్‌లో పొందుపర్చిన పథకాలన్నింటికి కొత్త బడ్జెట్‌లోనూ నిధులను పొందుపర్చారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న జలహారం, మిషన్‌ కాకతీయ, ఆసరా, కల్యాణ లక్ష్మి, సాగునీరు వంటి వాటన్నింటికీ బడ్జెట్‌లో బాగానే నిధులు ఇచ్చారు. నిధులను చూపించటం వరకు బాగానే ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఎలా సమీకరించుకొంటుందన్న విషయాన్ని అన్ని వివరాలతో బడ్జెట్‌లో పేర్కొనలేదు. భూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణపై ఇంతకు ముందు అంచనావేసిన మేర ఆదాయం రాకపోయినా మళ్లీ రూ.13,500 కోట్లను లక్ష్యంగా నిర్ధేశించుకోవటం, అప్పులను నిబంధనలకు మించి ఎక్కువగా తేవాలనుకోవటం, వ్యాట్‌ ద్వారా ఏకంగా రూ.35,463 కోట్లను రాబట్టాలని సంకల్పించటం బడ్జెట్‌కు భారీ తనాన్ని తెచ్చిపెట్టాయి. కేంద్రం నుంచి వస్తుందనుకొన్న రూ.20వేల కోట్ల మేర నిధులు రాలేదని చెబుతూనే 2014-15 సవరించిన బడ్జెట్‌లో ఆ విషయాన్ని ప్రతిఫలించే వివరాలను పొందుపరచకపోవటాన్ని బట్టి మళ్లీ ఇటువంటి పరిస్థితి కొత్త బడ్జెట్‌లోనూ ఉత్ఫన్నమైతే ప్రభుత్వం ఏ రీతిలో వ్యవహరిస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్థిక సంఘం కంటే ఎక్కువ అంచనా14వ ఆర్థిక సంఘం ఇటీవలే వెల్లడించిన నివేదికలో 2014-15లో తెలంగాణ రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలు రూ.57,426 కోట్లుగా లెక్కగట్టింది. తాజా బడ్జెట్‌లో మాత్రం దాన్ని రూ.68,908 కోట్లకు పెంచి చూపించారు. ఇలా పెంచి చూపించటం కోసం ప్రభుత్వం.. భూముల అమ్మకాలపై మళ్లీ దృష్టి సారించి ఏకంగా రూ.13,500 కోట్లు సంపాదించాలని నిర్ధేశించుకొంది. అయితే, ప్రస్తుత బడ్జెట్‌లో భూ విక్రయాల ద్వారా రూ.6,500 కోట్ల రాబడి అంచనా వేసినా రూ.120 కోట్ల మేర మాత్రమే సమకూరింది. ఈ పరిస్థితుల్లో కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.13,500 కోట్లను చేరుకోవటంపై సందేహాలు రాకమానవు. ప్రస్తుత అనుభవాలను బట్టి ఇక భూములపై భారీ అంచనాలు ఉండబోవని ప్రభుత్వమే ఒక వైపు చెబుతూ వచ్చి ఇప్పుడు అదే అంశం నుంచి భారీగా నిధులను ఆశించటం చూస్తుంటే బడ్జెట్‌ పరిధిని పెంచటానికే ఇటువంటి అంచనాలకు వెళ్లారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుతం రూ.2,583 కోట్లను ఆశించగా అందులో సగం మొత్తం కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని రూ.3,700 కోట్లు చేయటాన్ని బట్టి ఇప్పటి కంటే చాలా ఎక్కువ రాబడిని రిజిస్ట్రేషన్ల ద్వారా సాధించుకోవాలనేది స్పష్టమవుతోంది. దీనికోసం భూముల రిజిస్ట్రేషన్ల విలువలను సర్కారు పెంచటం అనివార్యంగా కనిపిస్తోంది. వ్యాట్‌ వేటు తప్పదావ్యాట్‌ ద్వారా రూ.35,463 కోట్లను కొత్త బడ్జెట్‌లో ఆశించారు. ప్రస్తుత పది నెలల బడ్జెట్‌లోని వ్యాట్‌ లక్ష్యం రూ.26,963 కోట్లు కాగా ఇప్పటికైతే దానిలో చాలా లోటు ఉంది. వ్యాట్‌ ద్వారా అనుకొన్నంత సాధించలేకపోయినట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. అయినప్పటికీ వ్యాట్‌పై మళ్లీ భారీగా రాబడిని అంచనా వేయటాన్ని బట్టి త్వరలో పన్నులను పెంచవచ్చనే భావన వ్యక్తమవుతోంది. ముడి చమురు ధరల్లో వ్యత్యాసాల కారణంగా వ్యాట్‌ రాబడి తగ్గిపోకూడదనే ఉద్దేశంతోనే పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను రేట్లను పెంచినట్లుగా సభలో సభ్యులకు అందజేసిన ద్రవ్యవిధాన పత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. మిగతా పన్నుల పెంపు గురించి ఏమీ తెలపలేదు. ఇటీవల అమల్లోకి తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ (సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం)ద్వారా పన్నుల వసూళ్లలోని లొసుగులను కనుగొంటామని మాత్రమే దానిలో పేర్కొంది. సొంత పన్నుల రాబడిని 14వ ఆర్థిక సంఘం అంచనాకంటే తక్కువగానే కొత్త బడ్జెట్‌లో చూపించినప్పటికీ అందులో ప్రధానమైన వ్యాట్‌ రాబడి లక్ష్యం మాత్రం ఇప్పటికంటే చాలా భారీగా ఉండటం విశేషం. మద్యంపై అంచనాల పెంపుమద్యంపై కూడా ప్రభుత్వం భారీ ఆదాయాన్నే అంచనా వేస్తోంది. వ్యాట్‌ రాబడిలో రూ. 8,291 కోట్లు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రావాల్సి ఉంది. లైసెన్సు రుసుముల వంటి వాటి ద్వారా ఎక్సైజ్‌ శాఖ మరో రూ.3,916 కోట్లు సంపాదించాలి. ఈ రెండు కలిపి రూ.12,207 కోట్లు ఖజానాకు చేరాలి. ఇది ప్రస్తుత లక్ష్యానికంటే రూ.3,080 కోట్లు అధికం. అప్పుల్లో అదనంగా రూ.2వేల కోట్లురాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతం మాత్రమే అప్పులను తెచ్చుకోవాలనే నిబంధనకు అనుగుణంగా ప్రభుత్వం రూ.14,597 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో చూపించాల్సి ఉండగా దానికి భిన్నంగా రూ.16,968 కోట్లను అంచనా వేసింది. అంటే పరిమితి కన్నా రూ.2,371 కోట్లు ఎక్కువ. కేంద్రం జీడీపీలో 3.9 శాతం మేర అప్పులను తెస్తూ రాష్ట్రాలను మాత్రం 3 శాతానికి పరిమితం చేయటం తగదన్నది ప్రభుత్వ వాదన. అటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుత 2014-15 బడ్జెట్‌లో కూడా రూ.17,398 కోట్ల (4.04శాతం) మేర రుణాలను అంచనా వేయగా కేంద్రం అందుకు అంగీకారం తెలపనేలేదు. దీంతో అప్పులను కుదించుకోక తప్పలేదు. రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు పది శాతానికంటే తక్కువగాను, మొత్తం అప్పులు జీఎస్‌డీపీలో 25 శాతాని కంటే తక్కువగాను ఉన్నట్త్లెతే అటువంటి రాష్ట్రం 3 శాతానికి మించి మరో 0.50 శాతం మేర అప్పులను తెచ్చుకోవటానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇంకా దీనికి ఆమోదముద్ర వేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఈ రెండు రకాల నిబంధనలను అమలు చేస్తున్నందున ఆ విధంగా చూసినా ఎక్కువ అప్పులకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు ద్రవ్యవిధాన పత్రం పేర్కొంది.ప్రత్యేక ప్యాకేజీపై మళ్లీ అంచనావెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయంతో ప్యాకేజిని అందజేస్తామని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పేర్కొనటంతో కొత్త బడ్జెట్‌లో రూ.2,950 కోట్లను సర్కారు అంచనా వేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను పేర్కొన్నా కేంద్రం ఇచ్చిందేమీలేదు. ప్రభుత్వం మాత్రం ఐదేళ్ల వ్యవధిలో రూ.56 వేల కోట్లను ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్‌టీ) బకాయిలపై కేంద్రం ఇటీవల కొంత సానుకూల ధోరణి కనబర్చటంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రూ.1,500 కోట్లు వస్తాయని కొత్త బడ్జెట్‌లోను ఆశలు పెట్టుకొంది.ఆస్తుల కల్పనకు మిగిలింది తక్కువేభారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ఆస్తుల కల్పనకు ఉపయోగపడే పెట్టుబడి వ్యయం రూ.15,982 కోట్లుగా మాత్రమే ఉండనుంది. కొత్త బడ్జెట్‌లో తప్పని సరి ఖర్చులతో కూడిన ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లకు చేరటంతో అప్పుల ద్వారా తెచ్చే మొత్తాలను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వినియోగించుకోవాల్సి వస్తోంది. ఉద్యోగులకు 43 శాతం మేర ఫిట్‌మెంట్‌ ఇవ్వటంతో జీతాలు, పింఛన్ల ఖర్చు భారీగా పెరగనుంది.పూర్తికాని అప్పుల విభజనఉభయ రాష్ట్రాల మధ్య అప్పుల విభజన ఇంకా పూర్తికాలేదు. దీంతో తెలంగాణ అప్పులు ఎంతనేది కొత్త బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం పేర్కొనలేదు. మొత్తం రూ.1.48 లక్షల కోట్లను విభజించాల్సి ఉండగా అందులో ఇప్పటికి తెలంగాణ వాటాగా వచ్చింది రూ. 61,711 కోట్లని, ఇంకా విభజించాల్సిన మొత్తం ఉందని మాత్రమే సర్కారు పేర్కొంది.


బ్యాంకు మిత్ర ఎవరు? ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు ఎలా సాయం చేస్తారు?


byaanku mitra evaru? pradhaanamantri jan dhan

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్ ధన్ యోజన పథకం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'బ్యాంకు మిత్ర' పనిచేస్తున్నారు. బ్యాంకు సేవలు లేని గ్రామాల్లో బ్యాంకుల గురించి ప్రజలకు తెలియజేసే ఏజెంటే 'బ్యాంకు మిత్ర'. బ్యాంకులు, ఏటీఎమ్‌లు లేని ప్రాంతాల్లో వీరి చేస్తున్న కృషి అభినందనీయం. జన్ ధన్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చేర్చించడంలో వీరి కృషి అమోఘం. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు గాను ప్రజల వద్ద నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వాటిని సరైనవిగా ధృవీకరించుకుని బ్యాంకుల్లో ఇస్తుంటారు. బ్యాంకుల్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, అప్లికేషన్స్ ఎలా నింపాలో కస్టమర్లకు తెలియపరుస్తుంటారు. ప్రజలకు బ్యాంకు ఖాతాల్లో నగదు ఏవిధంగా డిపాజిట్ చేయాలి, ఏవిధంగా నగదు విత్ డ్రా తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తుంటారు. వీటితో పాటు భారత్‌లో బ్యాంకింగ్ అనుభవం లేనటువంటి ప్రజలకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా ఈ బ్యాంక్ మిత్ర పనిచేస్తుంటారు. బ్యాంకుకు సంబంధించిన విషయాలు, నియమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. 'బ్యాంకు మిత్ర' గా ఎవరు కాగలరు? బ్యాంకు లావాదేవీల గురించి తెలిసిన వారిని బ్యాంకు మిత్రగా తీసుకుంటారు. సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగులు, చిన్న మొత్తాల పొదుపు సంస్ధలకు చెందిన ఉద్యోగులు బ్యాంకు మిత్రగా ఉండేందుకు అర్హులు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి: భారతదేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ రంగం సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోడీ "ప్రధానమంత్రి జన్ ధన్ యోజన" (పీఎంజేడీవై) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతా తెరవడం వల్ల రుణాలు, కాల పరిమితి డిపాజిట్ల వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా కనీస మొత్తం డిపాజిట్ చేయనవసరం లేకుండానే ఖాతాలను తెరవచ్చు. ఖాతా తెరిచిన ఆరు నెలల పాటు సక్రమంగా నడిపితే బ్యాంకు ఒక వెయ్యి రూపాయల పరిమితితో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించడం తోపాటు రుణ పరిమితిని రూ. 5వేల వరకు పెంచుతారు. ఖాతాను తెరిచిన 42 రోజుల నుంచి లక్ష రూపా యల బీమా సౌకర్యం కల్పించనున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తారు. తద్వారా లబ్ధిదారులకు వంటగ్యాస్, వృద్ధాప్య పింఛన్, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన: ప్రత్యేకతలు


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 2015-16 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని గురించి వివరించారు. అసలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అంటే ఏమిటీ? దీని ప్రత్యేకలు ఏంటో చూద్దాం. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యం జీవిత బీమా కవరేజి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పేరిట కొత్తగా చేపడుతున్న పథకం నిరుపేదలకు కాస్త ఊరటనిస్తుంది. 
ఎవరెవరు ఈ పథకం కిందకు అర్హులు చూద్దాం. 
1. బ్యాంకు ఖాతా కలిగి ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసున్నవారు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకానికి అర్హులు. 
2. ఈ పథకంలో చేరాలనుకునే వారు 50 ఏళ్లు నిండక ముందే చేరాల్సి ఉంది. ప్రీమియం పూర్తైన తర్వాత కూడా 55 ఏళ్ల పాటు ఇందులో కొనసాగవచ్చు.
3. 18-50 ఏళ్లలోపు ఉన్న వారు 12 వాయిదాల్లో రూ. 330 ప్రీమియం చెల్లించాలి. 
4. చందాదారులు ఖాతా నుండి ప్రీమియం చెల్లింపు నేరుగా బ్యాంకు ద్వారా తీసుకోబడుతుంది. 
5. ఏదైనా ప్రమాదం వల్ల చనిపోతే, ఈ పథకం కింద రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నారు. 
6. ఈ పథకం కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ప్రతి ఏడాది దానికదే పునరుద్ధరణ, రెండోది ఎంపిక వ్యక్తిగతం. 
7. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్‌లో పొదుపు చేసే వారికి రూ. 50 వేల వరకు రాయితీ.


Armenian newspapers and news sites




Tags:Armenian newspapers  armenian newspapers in the diaspora  list armenian newspapers  Armenian newspapers news  english newspapers armenian  armenian online newspapers  daily newspapers  armenian daily news  armenian news sites,Searches related to Armenian newspapers  armenian newspapers in the diaspora  list armenian newspapers  armenian newspapers news  english newspapers armenian  armenian online newspapers  daily newspapers  armenian daily news  armenian news sites,Searches related to Armenian newspapers  armenian newspapers in the diaspora  list armenian newspapers  armenian newspapers news  english newspapers armenian  armenian online newspapers  daily newspapers  armenian daily news  armenian news sites,Searches related to Armenian newspapers  armenian newspapers in the diaspora  list armenian newspapers  armenian newspapers news  english newspapers armenian  armenian online newspapers  daily newspapers  armenian daily news  armenian news sites



కొత్తగా ఆలోచించండి




 సైబర్ భద్రతపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి -హ్యాకర్ల ఆటకట్టించేలా వినూత్న అప్లికేషన్లు అభివృద్ధి చేయండి -డేటా స్టోరేజ్ కోసం క్లౌడ్ గోడౌన్లు, లాకర్లను డిజైన్ చేయాలి.. -ప్రధాని కార్యాలయం కోసం త్వరలో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ -నాస్కామ్ సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, మార్చి 1:సైబర్ భద్రత అంశం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కల్గిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమస్యను అరికట్టేలా, హ్యాకర్ల ఆటకట్టించేలా వినూత్న అప్లికేషన్లను అభివృద్ధి చేయాలని ఆదివారం జరిగిన నాస్కామ్ సదస్సులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగ ప్రతినిధులను ఆయన కోరారు. అంతేకాదు ఐటీ నిపుణులు కొత్తగా ఆలోచించాలని ఆయన సూచించారు. భారీగా సమచారాన్ని భద్రపర్చుకునేందుకు వీలుగా పటిష్ఠ భద్రతో కూడిన క్లౌడ్ గోడౌన్లు, క్లౌడ్ లాకర్లను డిజైన్ చేయాలని మోదీ కోరారు. తద్వారా బ్యాంకులు, ఇతర సంస్థలు వీటిని అద్దెకు తీసుకొని డేటా స్టోరేజ్ అవసరానికి వాడుకునేందుకు వీలవుతుందన్నారు. ప్రధాని అయ్యాక దాదాపు 50 మంది ప్రపంచ స్థాయి నేతలతో భేటీ అయినట్లు, అందులో 25-30 మంది సైబర్ భద్రత ఆందోళన వ్యక్తం చేసినట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే ప్రజలకు మొబైల్ ద్వారా దగ్గరయ్యేలా ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు మోదీ వెల్లడించారు. దీని డిజైన్ ఐడియాలను ప్రజల నుంచే కోరాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం mygov.in ద్వారా పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీ సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్ల విభాగం అతిపెద్ద మార్కెట్‌గా మారిందన్నారు. దేశీయ ఐటీ నిపుణులు ఈ అవకాశాలను వినియోగించుకొని ప్రపంచవ్యాప్తంగా సేవలందించే దిశగా కృషి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నాస్కామ్‌ను కోరారు. సరైన భద్రత కల్పించకపోతే తమ వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురవుతుందని ప్రజలు మొబైల్ వాడేందుకూ భయపడాల్సి రావచ్చని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో గోల్డ్ బాండ్లు జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాండ్ల ద్వారా మార్కెట్లో బంగారం కొనుగోలు చేయనవసరం లేకుండా నిల్వ చేసుకునే వీలుంటుందన్నారు. క్లౌడ్ లాకర్లను డిజైన్ చేస్తే బాండ్లను అందులో భద్రపర్చుకునేందుకు వీలవుతుందన్నారు. మొబైల్ గవర్నెన్స్ సేవలకవసరమైన అప్లికేషన తయారీకి సంబంధించి దేశీయ ఐటీ ఇండస్ట్రీకి అపారమైన అవకాశాలున్నాయన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకోవడం ద్వారా ప్రభుత్వం అవినీతిని ఎలా అరికట్టగలుగుతుందనడానికి ఎల్‌పీజీ సబ్సిడీకి నగదు బదిలీ పథకం, బొగ్గు గనుల ఈ-వేలం మంచి ఉదాహరణలని ప్రధాని పేర్కొన్నారు. వంటగ్యాస్ సబ్సిడీ జారీకి నగదు బదిలీ విధానాన్ని అనుసరించడం ద్వారా 10 శాతం లీకేజీకి అడ్డుకట్ట వేయగలిగామని, ఫలితంగా కేంద్రానికి వేల కోట్లు ఆదా అవుతున్నట్లు మోదీ చెప్పారు. అలాగే బొగ్గు గనుల కుంభకోణంతో 1.86 లక్షల కోట్ల ఆదాయానికి గండిపడిందని కాగ్ పేర్కొంది. కానీ ఈ స్కాంకు సంబంధించి సుప్రీంకోర్టు రద్దు చేసిన 204 గనుల్లో కేవలం 19 బ్లాకులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేలం వేయడం ద్వారా రూ.1.10 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో సాంకేతిక పరిజ్ఞానం పారదర్శకత పెంచగలదనడానికిదే మంది ఉదాహరణ అని అన్నారు. వర్చువల్ మ్యూజియమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మన ఐటీ రంగం దేశంలో పర్యాటకానికి ఊతమివ్వగలదని ప్రధాని అన్నారు. స్కూళ్లకు ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఇండస్ట్రీ వర్గాలను కోరారు. దేశంలో ఆర్థిక వృద్ధిరేటును పెంచడంలో డిజిటల్ కనెక్టివిటీ కూడా ప్రధాన వనరుగా మారిందన్నారు. కానీ భారత్‌లో గూగుల్ లాంటి దిగ్గజ సంస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ఇండస్ట్రీ ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం 14,600 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకున్న ఇండియన్ ఐటీ సెక్టార్ ఇకపై అప్లికేషన్లు(యాప్) అభివృద్ధిపైనా దృష్టిసారించాలన్నారు. ఇండస్ట్రీ ఎంత తొందరగా మొబైల్ అప్లికేషన్లను డిజైన్ చేయగలిగితే.. అంతే తొందరగా మార్కెట్ వాటాను పెంచుకోగలదన్నారు. ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టుల్లో భాగస్వాములమవుతాం: నాస్కామ్ విద్య, ఇంధనశక్తి, ఆహారం, యంత్రాంగ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రభుత్వం చేపట్టబోయే ఐటీ ప్రాజెక్టుల్లో తామూ భాగస్వామ్యులం కావాలనుకుంటున్నట్లు ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్ వెల్లడించింది. ఈ ఆరు విభాగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఈ సదస్సులో టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖర్ అన్నారు.

విజయవంతమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స


సుమారు ఆరు గంటలపాటు ఆపరేషన్ హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో ఓ మహిళకు డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలోని వైద్యుల బృందం నిర్వహించిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన 46 ఏళ్ల పద్మ అనే మహిళకు ఇవాళ వైద్యులు చేసిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. సుమారు ఆరు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి మహిళకు గుండెను విజయవంతంగా అమర్చగలిగారు. ఆమెకు అమర్చిన గుండెను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించి ఇవాళ ప్రత్యేక విమానంలో నగరానికి తరలించిన విషయం తెలిసిందే. యశోదాలో ఇది రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్స.


సూర్యాపేటలో బ్రెజిల్ కరెన్సీ నోట్లు స్వాధీనం




నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం దురాజ్‌పల్లి వద్ద బ్రెజిల్ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వృద్ధిపథంలో భారత్‌


భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి అధికవృద్ధి పథంలో పయనిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చెప్పారు. ప్రభుత్వ సుస్థిర కృషి, విధాన నిర్ణయాల వల్ల ఇది సాధ్యమయిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతి సోమవారం ప్రసంగించారు. భూసేకరణతో ప్రభావితమయ్యే రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సజావుగా నడిచేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసనగళం వినిపిస్తాయని కథనాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాలు చోటు చేసుకోవడం విశేషం. మోదీ ప్రభుత్వం కొలువుతీరాక 9 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను, కార్యక్రమాలను, విధానాలను గంట పాటుసాగిన 18 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్రపతి వివరించారు. 'అందరితో కలిసి.. అందరి అభివృద్ధి' అనేది తన ప్రభుత్వ ప్రాథమిక సూత్రమని స్పష్టం చేశారు. దేశంలోని 125 మంది కోట్ల ప్రజల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సమగ్ర వ్యూహానికి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు అన్ని రంగాలనూ ఆయన స్పృశించారు. భూసేకరణతో ప్రభావితమయ్యే రైతులు, కుటుంబాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామీణ ప్రాంతాల్లో గృహవసతి, పాఠశాలలు, ఆస్పత్రుల వంటి ప్రాథమిక వసతుల కల్పనకు భూసేకరణ అవసరం. భూసేకరణలో పారదర్శకతను పాటించడం, సరసమైన పరిహారం పొందే హక్కు సహా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు భూసేకరణ ప్రక్రియలో సమస్యలను తగ్గించడానికి పునరావాస చట్టాన్ని తగిన విధంగా మెరుగుపర్చాం. విలువ ఆధారిత వ్యవసాయం అవసరం. మార్కెట్‌ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అవసరం. తాజా అంచనాల ప్రకారం మన స్థూల జాతీయోత్పత్తి 7.4శాతం వృద్ధి రేటుతో ఉంది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. కొన్నేళ్లుగా దాదాపుగా స్తంభించిపోయిన స్థిర మూలధన కల్పన (ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌).. ఇప్పుడు పెరిగింది. మూలధన విపణి.. ఉత్సాహంతో ఉంది. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు గణనీయంగా పెరిగాయి. నిలకడగా ఉన్న రూపాయితో భారత అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ చాలా ఉత్సాహంగా ఉంది. నల్లధనం నియంత్రణకు... విచారణ వేగవంతం చేయడం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాచారాన్ని ఏకీకరించడం, సమర్థమైన చట్ట, పరిపాలన చట్రాలను, వ్యవస్థలను, ప్రక్రియలను రూపొందించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. పేదరిక నిర్మూలనకు ఆర్థిక సమ్మిళితం ముఖ్యం. అందరికీ బ్యాంకింగ్‌ వసతి కల్పించడానికి ప్రభుత్వం.. ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.11వేల కోట్లు జమ అయ్యాయి. ఈ అనూహ్య లక్ష్యాన్ని ఆరునెలల కన్నా తక్కువ కాలంలోనే సాధించాం. ఇటువంటి కార్యక్రమాల్లో ఇది ప్రపంచంలోనే పెద్దది. అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారుకు లొసుగులు లేకుండా చేరడానికి ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కార్యక్రమం. అందరినీ ఆధార్‌ నమోదు పరిధిలోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. మొత్తం జీవన నాణ్యతపై, వ్యక్తి శ్రేయస్సుపై పరిశుభ్రత ముఖ్యమైన ప్రభావం చూపుతుంది. దేశ అభివృద్ధిపైనా ఇది ప్రభావం చూపుతుంది. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గృహనిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రభుత్వం సరళీకరించింది. గృహనిర్మాణ రుణాలకు పన్ను ప్రోత్సాహకాలను పెంచింది. ప్రాధాన్యాల్లో ప్రాధాన్యత విద్యకే. పాఠశాలలు లేని ఆవాసాలను జీఐఎస్‌ పరిజ్ఞానంతో గుర్తించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంచడానికి పండిత్‌ మదన్‌మోహన్‌ మాలవ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే ఎక్కువమంది యువత ఉన్న దేశం భారత్‌. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం... కొత్తగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. నైపుణ్య భారత్‌లో భాగంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనను ప్రకటించాం. హింసకు గురయ్యే మహిళలకు పూర్తి సహకారం అందించడానికి ప్రతి రాష్ట్రంలోనూ సంక్షోభ పరిష్కార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో వైద్య సహాయం, పోలీసు సహాయం, తాత్కాలిక ఆశ్రయం, న్యాయ సహాయం, మానసిక, సామాజిక కౌన్సెలింగ్‌ తదితర సేవలు అందుతాయి. న్యాయసంస్కరణలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి. పరిపాలన, సంస్కరణలు అనేవి.. పార్లమెంట్‌, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల శాసనసభలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రజలతో కూడిన టీమ్‌ ఇండియా ఉమ్మడి కృషి అన్నది ప్రభుత్వ విశ్వాసం. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియమాక ప్రక్రియకు జాతీయ జ్యుడిషియల్‌ నియామకాల కమిషన్‌ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన సంస్కరణ ఇందుకు నిదర్శనం. బూజు పట్టిన చట్టాల రద్దుకూ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అవినీతి నియంత్రణకు కఠిన చర్యలను ప్రవేశపెడుతూనే ప్రజాప్రయోజనాల కోసం నిజాయితీతో తీసుకున్న నిర్ణయాల విషయంలో తగిన రక్షణలు కల్పిస్తాం. అధికారుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటాం. భారత్‌ను సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత మార్పునకు సంసిద్ధం చేయడానికి డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. వ్యాపార ప్రక్రియలను సరళతరం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా... ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకరించడం, హేతుబద్ధీకరించడం జరిగింది. అనుమతులకు ఏకగవాక్ష పద్ధతిని అమల్లోకి తెచ్చాం. 'ఈబిజ్‌' వెబ్‌సైట్‌ ఇందుకోసమే. పన్ను వ్యవస్థలోకి మరింత సామర్థ్యాన్ని, నిష్పక్షపాతాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వ్యయ నిర్వహణలో ప్రాజ్ఞతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. వస్తు సేవల పన్ను విధానాన్ని తీసుకురావడానికి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పరోక్ష పన్ను విధానాన్ని ఇది సరళీకరిస్తుంది. పన్ను పరిధిని పెంచుతుంది. భారత్‌ను తయారీ కేంద్రంగా మలచడానికి భారత్‌లో తయారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్థిక వృద్ధికి నగరాలు చోదకశక్తులు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నీటి, ఘన వ్యర్థాల నిర్వహణ మౌలికసదుపాయాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ జాతీయ పట్ణణ అభివృద్ధి కార్యక్రమానికి తుదిరూపం ఇస్తున్నాం. భాగస్వాములందరితోనూ విస్తృత సంప్రదింపుల అనంతరం స్మార్ట్‌నగరాల ప్రాజెక్టు తుది రూపం సంతరించుకుంటోంది. ఆర్థికవృద్ధి పరుగులు పెట్టడానికి మౌలిక సదుపాయాల వృద్ధి కీలకం. రైల్వేరంగంలో సంస్కరణలను ప్రభుత్వం చేపడుతోంది. విద్యుత్‌ రంగం గణనీయ ప్రగతి సాధించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడానికి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన, సమగ్ర విద్యుత్‌ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించాం. శుద్ధ ఇంధనానికి ప్రాధాన్యం. 25 మెగా సౌర విద్యుత్‌ పార్కు ఏర్పాటుకు పథకం ప్రారంభమయింది. సహజవనరుల కేటాయింపులో పారదర్శకతకు, వాటిని హేతుబద్ధంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో విద్యుత్‌ ఛార్జీలు తగ్గే విధంగా బొగ్గు క్షేత్రాల వేలం ప్రక్రియ ప్రారంభమయింది. నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన గమ్యం.. మన పొరుగుతో ముడి పడి ఉందని గుర్తిస్తూ పొరుగు దేశాలతో సంబంధాలను ప్రభుత్వం బలోపేతం చేసింది. దక్షిణాసియాతో ప్రబల సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. అమెరికా, రష్యా, చైనాలతోనే సంబంధాలు బలోపేతం చేస్తున్నాం.రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన భార్య సువ్ర ప్రేక్షకుల గ్యాలరీలో ఆసీనులైఉన్నారు. అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు, కేబినెట్‌ కార్యదర్శి తదితరులు ఆసీనులైన గ్యాలరీలో సువ్ర కూర్చుని భర్త ప్రసంగాన్ని విన్నారు.

జార్ఖండ్ స్కూల్లో చిన్నారులకు దొంగతనం ట్రైనింగ్

జార్ఖండ్ : పాఠశాల అంటే ప్రపంచంలో ఎక్కడయినా విద్యార్థులకు మంచి చదువు చెప్పి భావి పౌరులుగా ఉత్తమ జీవితం గడిపేందుకు శిక్షణ ఇస్తారు. కానీ ఆ స్కూల్లో మాత్రం దొంగతనాలు ఎలాచేయాలి అని నేర్పిస్తారు. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోగల సాహెబ్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఆ స్కూలు చిన్నపిల్లలకు దొంగతనం నేర్పించటమే కాదు, ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు ఒక్కో విద్యార్థికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ నేర్పించే దొంగతనం విద్యలో ప్రత్యేక కోర్సు కూడా ఉంది. కేవలం ఖరీదైన సెల్‌ఫోన్లను దొంగిలించటం ఎలా? అనేదే ఆ ప్రత్యేక కోర్సు. ఏదో దోపిడీ కేసులో పాఠశాలపై దాడిచేసిన సుఖ్‌దేవ్‌నగర్ పోలీసులు ఈ స్కూలు ప్రత్యేకత తెల్సుకొని షాకయ్యారు. ఐదుగురు పాఠశాల నిర్వాహకులు, కొంతమంది చిన్నారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కూల్లో చదివే చిన్నారులంతా సాహెబ్‌గంజ్ ప్రాంతానికి చెందినవారని, సెల్‌ఫోన్ల మార్కెట్లో దొంగతనాలు చేయటంపై వారికి శిక్షణ ఇస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.



Followers