Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

రేవంత్‌ పాలమూరు పరువు తీశారు : మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌

మ్మెల్యే రేవంత్‌రెడ్డి పాలమూరు పరువు తీశారని మంత్రి జూపలి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌లు ఆరోపించారు. టీటీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. మీసాలు తిప్పడం గొప్ప కాదని, రొయ్యకు కూడా మీసాలు ఉంటాయన్నారు.

లంగాణాలో వారంలోగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల ప్రకటన : ఘంటా చక్రపాణి


తెలంగాణ రాష్ట్రంలో వారంలోగా ఉద్యోగాలకు ప్రకటన జారీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటిసారి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు.


గిన్నిస్‌ రికార్డులో ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గిన్నిస్‌ రికార్డు సాధించారు. అతి తక్కువ సమయంలో ట్విట్టర్‌ ఖాతాలో ఆయనను పదిలక్షల మందికిపైగా అనుసరించడంతో ఆయన గిన్నీస్‌ రికార్డులోకి ఎక్కారు. ఒబామా సోమవారం అధికారికంగా సొంత ట్విట్టర్‌ ఖాతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన ఖాతా తెరిచిన 12గంటల్లో 14.6మిలియన్ల మంది ఆయనను అనుసరించేవారి జాబితాలో చేరిపోయారు. ఇలాంటి ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా ఒబామా గిన్నీస్‌రికార్డులో చేరిపోయారు.


ఓయూలో విద్యార్థుల ఆందోళన OU


ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల నుంచి లా కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు.



పోస్టల్ ఖాతాదారులకు ఎటిఎం సదుపాయాలు


ఎ.పి. తెలంగాణ రాష్ట్రాలలో పోస్టల్ ఖాతాదారులకు సరికొత్త విధానంతో ఎటిఎం సదుపాయం కల్పిస్తున్నట్లు పోస్టల్ డైరెక్టర్ రాధిక చక్రవర్తి తెలిపారు. బుధవారం సికిందరాబాద్ ప్యాట్నీ పోస్టల్ కార్యాలయంలో ఎటిఎం బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోస్టల్ ఖాతాదారులకోసం మెరుగైన సేవలు అందించేందుకు పోస్టల్‌శాఖ ముందున్నట్లు ఆమె తెలిపారు. తమ శాఖలో ఎస్‌బి అకౌంట్స్, పెన్షన్ ఖాతాదారులు నేరుగా ఎటిఎం ద్వారా నగదు డ్రాచేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ప్రధాన పోస్టల్ కార్యాలయం ఆబిడ్స్‌లో ఎటిఎం మొదటి కేంద్రాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. తదనంతరం విజయవాడ, సికిందరాబాద్ల్‌లో పోస్టల్ ఖాతాదారులకోసం ఎటిఎం కేంద్రాలు ఏర్పాటైనట్లు ఆమె వెల్లడించారు. ప్రధాన పోస్టల్ కేంద్రాలలో 95 త్వరలోనే ఎటిఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సికిందరాబాద్ సీనియర్ పోస్టల్ అధికారి బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. గంటకో ఆపరేషన్! హైదరాబాద్, మే 6: సాధారణంగా ఓ డాక్టర్ రోగి పరిస్థితిని బట్టి రోజుకు నాలుగైదుకు మించి ఆపరేషన్లు చేయలేరు. అందులో తర్వాత
చేయవచ్చునని వాయిదా వేసేందుకు వీల్లేని ఫ్య్రాక్చర్ కేసులకు సంబంధించి గంటకు ఒకటి చొప్పున అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన కిమ్స్ వైద్యుడు డా. ఉదయ్ కృష్ణ అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. పధ్నాలుగు గంటల్లో 14 అరుదైన ఆపరేషన్లను నిర్వహించిన సందర్భంగా ఆయన కేసులకు సంబంధించిన వివరాలను ఎస్‌ఎంఎస్ మీడియా సెంటర్ ద్వారా వివరాలను వెల్లడించారు. గత నెల 25వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో రామలింగేశ్వర్ రావు, సుబ్బలక్ష్మి అనే దంపతులు కారు ప్రమాదంలో గాయపడ్డారు. అదే రోజు నల్గోండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గర లారీ ప్రమాదంలో సత్యనారాయణ అనే వ్యక్తి తన కాలును పొగొట్టుకున్నాడు. ఈ రకంగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఫ్య్రాక్చర్‌కు గురైన పలువురు రోగులకు డాక్టర్ ఉదయ్ కృష్ణ అతి తక్కువ సమయంలోనే 14 అరుదైన ఆపరేషన్లను నిర్వహించి తన సత్తాను చాటుకున్నాడు. సాధారణంగా ఫ్య్రాక్చర్ కేసులకు సంబంధించి ఒక్కో శస్తచ్రికిత్సకు గంటన్నర సమయం పడుతుందని, కొన్ని క్లిష్టమైన ఆపరేషన్లకు మూడు నుంచి నాలుగుగంటల సమయం కూడా పడుతుందని ఆయన వివరించారు. కానీ పద్నాలుకు ఫ్య్రాక్చర్ కేసులను సవాలుగా తీసుకున్న తాను కేవలం 14 గంటల వ్యవధిలోనే గంటకు ఒకటి చొప్పున ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డా.ఉదయ్ తెలిపారు. ఈ అరుదైన ఆపరేషన్లు నిర్వహించేందుకు తన నైపుణ్యత ఎంత కారణమో, కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ఆధునిక ఆపరేషన్ ధియేటర్, వైద్య పరికరాలు, సిబ్బంది అంకితాభావం కూడా కారణమని డాక్టర్ ఉదయ్ కృష్ణ తెలిపారు. తక్కువ సమయంలో తమకు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన డా. ఉదయ్‌కి రోగులు కూడా కృతజ్ఞతలు తెలిపినట్లు ఎస్‌ఎంఎస్ మీడియా సెంటర్ ప్రకటనలో వెల్లడించింది. ఈ శస్తచ్రికిత్సల నిర్వహణలో అనేస్థేషియ విభాగాధిపతి డా. నరేష్‌కుమార్, డా. భారతితో పాటు కిమ్స్ సిబ్బంది తనకు సహకరించారని డా. ఉదయ్ తెలిపారు.
 



బుద్దవనంలో మొక్కలు నాటిన కేసీఆర్

నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో ఇవాళ మూడో రోజు జరుగుతోన్న టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఇవాళ బుద్ద పౌర్ణిమ కావడంతో బుద్ద వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. సీఎంతో పాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం... 9నెలల గర్భిణి 5కి.మీ పరుగు


కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కి చెందిన కామారాపు లక్ష్మి అనే తొమ్మిది నెలల గర్భిణి 30 నిమిషాల 20 సెకన్లలో 5 కి.మీ పరుగు పూర్తి చేసి తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్ల పరుగు చేయడం వల్లనే సుఖ ప్రసవం జరిగిందని, రెండో కాన్పు కూడా సుఖ ప్రసవం కోసం 5కిలో మీటర్లు పరుగు చేపట్టి గిన్నిస్‌ బుక్‌లో పేరు నమోదు కోసం ప్రయత్నించినట్లు లక్ష్మి తెలిపారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌ బృందం, వైద్యులు, క్రీడా సంఘాల సమక్షంలో లక్ష్మి 5కి.మీ పరుగు పూర్తి చేశారు. అనంతరం లక్ష్మిని తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు సత్కరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు వివరాలు అందజేయనున్నట్లు తెలిపారు.


నెట్ స్వేచ్ఛ


ఇంటర్‌నెట్ సమానత్వ వేదికగా ఉండాలంటూ లక్షలాది మంది నెటిజన్లు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయి)కి తమ అభిప్రాయాలు వెల్లడించడం ప్రజల్లో పెల్లుబికిన చైతన్యానికి సూచన. ఇప్పటి వరకు ఇంటర్‌నెట్ ఎటువంటి అడ్డు లేకుం డా సమాచారాన్ని గ్రహించడానికి ఉపయోగపడుతున్నది. ఏ సైట్, ఎవరు యూజ ర్, ఏ సమాచారం అనే దానితో సంబంధం లేదు. చిరు వ్యాపారం చెట్టంత ఎదగడానికి, సృజనాత్మకత వెల్లివిరియడానికి ఇంటర్‌నెట్ వేదికయింది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు చిన్నగా మొదలై, భారీ సంస్థలుగా ఎదగడానికి ఈ పరిస్థితులే కారణం. కానీ ఇంటర్‌నెట్‌లో ఇటీవల ఒక వికృత పోకడ చోటు చేసుకోబోయింది. దీనివల్ల డబ్బు చెల్లించే బడా సంస్థల వెబ్ సైట్లను మాత్రమే వేగంగా అందుకునే అవకాశం ఉంటుంది. ఉచితంగా లభించే కొన్ని సాంకేతిక ప్రక్రియలు (అప్లికేషన్లు) డబ్బు చెల్లిస్తే తప్ప లభించవు. క్రమంగా విలువైన సమాచార గనులకు ఇంటర్‌నెట్ సర్వీసు ప్రొవైడర్ (ఐఎస్‌పీ)లు కాపలాదారులుగా మారిపోతాయి. ఇట్లా ఐఎస్‌పీ లు ఇంటర్‌నెట్‌లో అంతరాలు సృష్టించకుండా చిలీ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసింది. అమెరికాలోనూ ప్రజల ఆందోళన మూలంగా ఒక చట్టం అమలులోకి వచ్చింది. యూరప్‌లో గతంలో చేసిన చట్టాన్ని సమీక్షిస్తున్నారు. మన దేశంలో ఎటువంటి విధానం అమలు చేయాలనే విషయమై ట్రాయి ఇటీవలే ప్రజల అభిప్రాయాలు కోరింది. దీంతో నెట్‌లో అంతరాలు లేకుండా సమానత్వం (నెట్ న్యూట్రాలిటీ) పాటించాలని లక్షలాది మంది తమ అభిప్రాయాలు వెల్లడించడం విశేషం. ఇంటర్‌నెట్‌లో సమానత్వం పాటించాలనే విషయమై దేశంలోని నెటిజన్లు భారీ ఎత్తున స్పందించడం హర్షణీయ పరిణామం. అయితే ఇప్పుడు తొలగిపోయింది చిన్న ప్రమాదం మాత్రమే. డిజిటల్ సమాచారాన్ని నియంత్రిం చే, డిజిటల్ విజ్ఞానం ద్వారా సమాజాన్ని నియంత్రించే అసలు ముప్పు ఇంకా పొంచి ఉన్నది. దీనిపై ఈ దశలోనే నెట్‌ను ఉపయోగిస్తున్న విద్యావంతులు అప్రమత్తం కావలసి ఉన్నది. ఈ కాగితాల కాలం ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పటికే సమాచారమంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తమవుతున్నది. భవిష్యత్తులో సమాచారం సేకరించాలన్నా, విజ్ఞానం సంపాదించాలన్నా, పరిశోధన చేయాలన్నా డిజిటల్ రూపంలోని సమాచారమే ఆధారమవుతుంది. ఈ డిజిటల్ లైబ్రరీలను కొన్ని సంస్థలు తమ పిడికిట బిగించి పెట్టుకుంటే పేద వారికి విజ్ఞానం అందుబాటులో ఉండదు. ధనవంతుల చేతిలో విజ్ఞానం బందీ అవుతుంది. ఇదే విధంగా డిజిటల్ సాధనాలతో మనిషిని పసిగట్టి అసమ్మతిని అణచివేసే రాజకీయ విధానాలు రాకుండా కూడా అడ్డుకోవడం అవసరం. నాడు పారిశ్రామి విప్లవమైనా, నేడు డిజిటల్ విప్లవమైనా- విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని హర్షించవలసిందే. అదే సమయంలో ఈ విజ్ఞానం ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తున్నదనే ప్రశ్న కూడా విస్మరించలేనిది. డిజిటల్ ప్రపంచంలో ఈ గుత్తాధిపత్య పోకడను ముందే పసిగట్టి ఎదిరించిన అమెరికా మేధావి, నెట్ కార్యకర్త ఆరాన్ స్వార్‌ట్జ్ బలిదానం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలె. ఆరాన్ స్వార్‌ట్జ్‌కు బాల మేధావిగా గుర్తింపు ఉన్నది. ఆరెస్సెస్ వెబ్ ఫీడ్ ఫార్మాట్, మార్క్‌డౌన్ పబ్లిషింగ్ ఫార్మాట్, రెడిట్ సోషల్ న్యూస్ సైట్ రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ఉన్నది. అయితే అంతకు మించి నెట్‌ను రాజకీయ దుర్మార్గాన్ని వెంటాడడానికి ఉపయోగించుకోవడం ద్వారా పోరాట యోధుడయ్యాడు. కోర్టు దస్తావేజులను మూల్యం చెల్లిస్తే తప్ప చూడలేని వ్యాపార కుట్రను కనిపెట్టి, ఆన్‌లైన్ ద్వారా వాటిని బహిర్గతం చేశాడు. ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్ చట్టానికి (సోపా) వ్యతిరేకంగా పోరాడి దానిని నిలిపివేయించడంలో కీలక పాత్ర పోషించాడు. పరిశోధనా పత్రాలను గోప్యంగా పెట్టి ధనవంతులకే అందుబాటులో పెట్టడాన్ని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మందుల కంపెనీలకు, పరిశోధనలకు గల అక్రమ బంధాన్ని బయటకు లాగాడు. పరిశోధనా పత్రాలు అందరికీ అందుబాటులో ఉండాలనే తన ఉద్యమంలో భాగంగా- ఒక సంస్థ వెబ్ సైట్ నుంచి పరిశోధన జర్నల్స్ భారీ ఎత్తున డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ కారణాన్ని చూపి ప్రభుత్వం ఆయనపై ఉక్కు పాదం మోపింది. భారీ జరిమానాతో పాటు ముఫ్ఫై ఏండ్ల ఖైదు చేయడానికి అభియోగం సిద్ధం చేసింది. ఓపెన్ లైబ్రరీ ఉద్యమాన్ని నడిపి, క్రియేటివ్ కామన్స్ వేదికను సృష్టించిన ఈ 26 ఏండ్ల ఉద్యమకారుడు వేధింపులను, భారీ శిక్ష తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞానానికి సంకెళ్ళు వేయడం మాత్రమే కాదు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా- చాటింగ్, షాపింగ్ మొదలుకొని మనిషి ప్రతి కదలికను నమోదు చేసి నిరంతర నిఘా వేసేందుకు అమెరికాలో రంగం సిద్ధమవుతున్నది. ఈ ప్రయోగం ఇవాళ కాకుంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తాయనడంలో సందేహం లేదు. నెట్ సమానత్వాన్ని కోరడంతో సరిపోదు. నెట్ ద్వారా నిరంకుశ రాజ్య స్థాపన జరగకుండా అడ్డుకోవడానికి కూడా ప్రజలు సంసిద్ధులు కావాలె.

పంచాయతీరాజ్‌ను మొదట అమలుచేసిన రాష్ట్రం


ఇండియన్ పాలిటి దంత్‌వాలా కమిటీ (1978) బ్లాక్ స్థాయిలో ప్రణాళీకరణపై అధ్యయనం చేసేందుకు దంత్‌వాల కమిటీని ఏర్పాటు చేశారు. సిఫార్సులు -గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ను ప్రత్యేక పద్ధతిలో ఎన్నుకోవాలి. -మధ్యస్థ వ్యవస్థ(బ్లాక్ స్థాయి)కి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలి. -జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధానపాత్ర పోషించాలి. -బ్లాక్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని ప్రణాళికలను రూపొందించాలి. సర్కారియా కమిషన్ (1988) - క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. - స్థానిక సంస్థలను రద్దు చేయడానికి సంబంధించి అన్నిరాష్ర్టాల్లో ఒకే రకమైన చట్టాలను అమలు చేయాలి. -పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలి. -స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధుల పరంగా పటిష్ట పరచాలి. - దేశానికి కంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించాలని పేర్కొంది. సీహెచ్ హనుమంతరావు కమిటీ (1984) - మంత్రి అధ్యక్షతనగానీ, కలెక్టర్ అధ్యక్షతనగానీ పనిచేసే జిల్లా ప్రణాళికా సంఘాలను ఏర్పాటు చేయాలి. -బ్లాక్ అభివృద్ధి అధికారి పోస్టును రద్దు చేయాలి. జీవీకే రావు కమిటీ (1985) ప్రణాళికా సంఘం 1985లో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన-పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించేందుకు జీవీకే రావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో పరిపాలనా స్ఫూర్తి క్రమంగా బలహీనపడి ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీపరచిందని, తద్వారా ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే వ్యవస్థగా కాకుండా వేళ్లులేని వ్యవస్థగా మారిందని(It is not a grass roots democracy, It is grass without roots) తీవ్రంగా ఆక్షేపించి పంచాయతీరాజ్ పటిష్టతకు సిఫార్సులు చేసింది. సిఫార్సులు -ప్రణాళికాభివృద్ధికి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలి. -బ్లాక్ వ్యవస్థ రద్దు -జిల్లా పరిషత్‌ను పటిష్ట పరచాలి. -నైష్పత్తిక ప్రాతినిథ్యంతో కూడిన ఉపకమిటీలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి. -క్రమం తప్పకుండా గడువుకాలం లోపల పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. -జిల్లా అభివృద్ధి అధికారి పేరుతో ఒక పదవిని ఏర్పాటు చేసి అతన్ని జిల్లా పరిషత్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన కార్యనిర్వాహక బాధ్యతలను అప్పగించాలి. -జిల్లా పరిషత్ చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించాలి. సింఘ్వీ కమిటీ (1986) 1986లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేసేందుకు అవసరమైన సిఫార్పులను చేసేందుకు ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. సిఫార్సులు -స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలి. -పంచాయతీలకు ఆర్థిక వనరులు కల్పించాలి. -కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. -క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. -పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. తుంగన్ కేబినెట్ సబ్ కమిటీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంట్ సంప్రదింపుల సబ్‌కమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. సిఫార్సులు - స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి. -జిల్లాస్థాయిలో జిల్లాపరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీ సఫార్సుల మేరకు 64వ రాజ్యంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 15మే 1989న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లోక్‌సభలో 2/3 వంతుల మెజార్టీ పొందినప్పటికీ రాజ్యసభలో రెండు ఓట్లు తక్కువ కావడంతో వీగిపోయింది. తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 7 సెప్టెంబర్ 1990న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు. తర్వాత పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించవలసిన విషయాన్ని గుర్తించి సెప్టెంబర్ 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ(పురపాలక సంఘాలకు)లకు సంబంధించిన బిల్లును వేరువేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 22 డిసెంబర్ 1991లో పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఆ బిల్లును రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపించారు. మెజార్టీ రాష్ర్టాల శాసనసభలు(17 రాష్ర్టాలు) దీనికి ఆమోదం తెలిపాయి. అప్పటి భారత రాష్ట్రపతి(శంకర్ దయాళ్ శర్మ) ఆ బిల్లులపై 20 ఏప్రిల్ 1993లో సంతకం చేశారు. తద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. నోట్ : పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ 24 ఏప్రిల్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకొంటారు. -పట్టణ మున్సిపాలిటీలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1 జూన్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. -73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి 24 ఏప్రిల్ 2013కు 20ఏళ్లు పూర్త య్యాయి. -73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం- కర్ణాటక, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 10 మే 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోనే పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకయే.


జడ్జీల ఎంపికలో ఉన్నత ప్రమాణాలుండాలి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాట్నా, ఏప్రిల్ 18: జడ్జీల ఎంపిక, నియామకాల ప్రక్రియ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదన్నారు. శనివారం పాట్నా హైకోర్టు శతవార్షికోత్సవాలను ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జాక్) స్థాపనపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మన దేశంలో న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో మాత్రమే కాకుండా వ్యయప్రయాసలు లేని రీతిలో ఉండాలని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. న్యాయం ఆలస్యం జరిగితే అన్యాయం జరిగినట్లే అని వ్యాఖ్యానించారు.


ఎల్‌నినో మరింత తీవ్రం!


కామన్వెల్త్ వాతావరణ బ్యూరో వెల్లడి -వర్షాలు బాగానే ఉంటాయన్న స్కైమెట్ -మే 27నాటికి కేరళను తాకనున్న నైరుతి న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు మట్టిపాలై తల్లడిల్లుతున్న రైతులకు ఎల్‌నినో మరింత భయపెడుతున్నది. గత నైరుతి రుతుపవనాల కాలం కంటే ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కొద్దిగా పెరిగిందని, దీని ప్రభావంతో రాబోయే నైరుతిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ వాతావరణ బ్యూరోకు చెందిన సదరన్ ఓసిల్లేషన్ ఇండెక్స్ (ఎస్‌ఓఐ) వెల్లడించింది. గత సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం 50 శాతం ఉండగా ప్రస్తుతం అది 70 శాతానికి పెరిగిందని జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నొమురా కూడా పేర్కొంది. వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గిపోయి భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంకన్నా పెరిగితే నైరుతి రుతుపవనాలకు మూలమైన సముద్ర పవనాల్లో తేమలోపించి తద్వారా రుతుపవన కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయి. దీనినే ఎల్‌నినోగా పిలుస్తున్నారు. మహాసముద్రాల డోళన పరిస్థితులపై రేటింగ్ ఇచ్చే ఎస్‌ఐవో గత నెలలో 0.6 రేటింగ్vఇవ్వగా ప్రస్తుతం దానిని -11.2 పాయింట్లకు తగ్గించింది. -8 కంటే కిందికి పడిపోతే ఎన్‌నినో ప్రభావం ఉన్నట్లు గుర్తిస్తారు. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో ఎన్‌నినో ప్రభావం తప్పదని ఎస్‌ఐవో అంచనావేస్తున్నది. ఈ అంచనాలతో ప్రైవేటు వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ విభేదించింది. ఈ ఏడాది భారత్‌లో వర్షాలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది. నైరుతిలో సాధారణ వర్షపాతం 96 నుంచి 104 మధ్య ఉండగా ఈ ఏడాది 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. అయితే, దక్షిణ భారత్‌లో కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని అంచనావేసింది. తమిళనాడు, దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ, తూర్పు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లో వర్షపాతం తగ్గవచ్చని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంకన్నా నాలుగురోజుల ముందే మే 27వ తేదీనాటికి కేరళతీరాన్ని తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


ఓటరు జాబితాను రూపొందించేందుకు... 'లింకు'పాట్లు


హైదరాబాద్ మహానగరానికి ఎలాంటి లోపాల్లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరుకార్డు నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసేందుకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు మూడువేల పై చిలుకు పోలింగ్ స్టేషన్లలో ఈ ఆధార్-ఓటరు కార్డు లింకు ప్రక్రియను పూర్తి చేసేందుకు బల్దియా అధికారులకు కమిషనర్ సోమేశ్‌కుమార్ ఈ నెలాఖరు వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే! కానీ గతంలో కూడా కార్వాన్, నాంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ లింకు ప్రక్రియతో అనేక బోగస్ ఓట్లను ఏరివేసిన అధికారులు ఇపుడు పారదర్శకతతో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. లింకు ప్రక్రియను ఈ నెలాఖరులోపు ముగించాలంటూ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో వారు క్షేత్ర స్థాయి సిబ్బందిపై వత్తిడి తెస్తున్నారు. కానీ గతంలో బిసి ఓటర్ల గుర్తింపు, కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో తప్పోప్పుల సవరణ వంటి ప్రక్రియలకు సంబంధించి మొక్కబడిగా విధులు నిర్వర్తించిన విధంగానే ఇపుడు పరిస్థితి తయారైంది. పలు ప్రాంతాల్లో ఓటర్లు గ్రేటర్ సిబ్బందికి సహకరించకపోవటం ఇందుకు ప్రధాన కారణమం. ఎప్పటికపుడు అధికారులు ఈ ప్రక్రియకు గడువులు విధించటం వల్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదని కొందరు సిబ్బంది బహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత ఓటర్లకు అవగాహన కల్పించిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. పని వత్తిడి అధికంగా ఉండే సర్కిల్ పది వంది సిబ్బంది మాత్రం ఎప్పటికపుడు తమకు క్షేత్ర స్థాయి విధులు కేటాయించటం, అందుకు గడువును విధించటం పట్ల విరక్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 31వ తేదీవరకు ఆస్తి పన్ను టార్గెట్లతో ఉరుకులు, పరుగులు పెట్టిన తాము ఇపుడు ఓటరు కార్డు నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింకు కోసం అవస్థలు పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా పేర్లు, ఇంటినెంబర్, ఇంటిపేరు వంటి వివరాలతో రిపీట్ అయిన బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సాధించని ఫలితం ఇపుడు ఆగమేఘాలపై ఎలా సమకూరుతుందని మరికొందరు సిబ్బంది వాపోతున్నారు. 'ఆధార్' అనుసంధానానికి ప్రత్యేక శిబిరాలు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశం మేరకు ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునేందుకు వీలుగా ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారాల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటర్ల జాబితాలో సవరణ, తొలగింపులు, ఫొటోల సమర్పణతోపాటు ఆధార్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడిని వారికి అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమతమ వివరాలను సమర్పించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నేడు రాహుల్‌ గాంధీ ఘర్ వాపసి.?


కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్కంఠ సెలవుపై ఉన్న కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ బుధవారం ఢిల్లీ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి రాహుల్‌ గాంధీ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ బడ్డెట్‌ సమావేశాలకు ఆయన సెలవు పెట్టారు. పార్టీ భవిష్యత్‌ గురించి, పార్టీలో తన భవిష్యత్‌ గురించి అంతర్మఽధనం చేసుకోవడానికే రాహుల్‌ గాంధీ సెలవు పెట్టారని ఇన్నాళ్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. రాహుల్‌ బుధవారం రాత్రిలోగా ఢిల్లీ చేరుకుంటారని, ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న కిషాన్‌ ర్యాలీలో పాల్గొంటారని తెలుస్తోంది. మరోవైపు రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు స్వీకరించే విషయం ఆసక్తికరంగా మారింది

మిషన్‌ కాకతీయలో 154 పనులు ప్రారంభం

మేజర్‌న్యూస్‌ ప్రతినిధి: మిషన్‌కాకతీయ పనులకు ప్రజా ప్రతి నిధుల నుండి కాంట్రాక్టర్ల నుండి విశేష స్పందన వస్తుంది. ఏకంగా కాంట్రా క్టర్లయితే సమరోత్సహంతో ముందుకు కదులుతున్నారు. 2015-16 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1869చెరువులు, కుంటలు పనులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంట్లో మెదక్‌ డివిజన్‌లో 383కు గాను 32చెరువులు కుంటలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. సిద్దిపేటలో 1042చెరువులు కుంటలకు గాను 80చెరువులు ప్రారంభోత్స వాలు జరిగాయి. సంగారెడ్డిలో 444కు గాను 42ప్రారంభోత్సవాలు జరి గాయి. జిల్లాలో మిషన్‌కాకతీయ పనులు సిద్దిపేట డివిజన్‌లో ఎక్కువగా ముం దుకు సాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 300కోట్లకు పైగా పనులు ఇప్పటి వరకు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా మిషన్‌కాకతీయ పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అందోల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రతిపక్ష నేతలకు కాంట్రాక్టర్లు దక్కవద్దని చెబుతున్నారని దాని కారణంగా నియోజకవర్గంలోని అల్లాదుర్గానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి అందోల్‌కు చెందిన లక్ష్మినారాయణ అనే వ్యక్తులు ఎమ్మెల్యే తమపై మేజర్‌న్యూస్‌ ప్రతినిధి: మిషన్‌కాకతీయ పనులకు ప్రజా ప్రతి నిధుల నుండి కాంట్రాక్టర్ల నుండి విశేష స్పందన వస్తుంది. ఏకంగా కాంట్రా క్టర్లయితే సమరోత్సహంతో ముందుకు కదులుతున్నారు. 2015-16 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1869చెరువులు, కుంటలు పనులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంట్లో మెదక్‌ డివిజన్‌లో 383కు గాను 32చెరువులు కుంటలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. సిద్దిపేటలో 1042చెరువులు కుంటలకు గాను 80చెరువులు ప్రారంభోత్స వాలు జరిగాయి. సంగారెడ్డిలో 444కు గాను 42ప్రారంభోత్సవాలు జరి గాయి. జిల్లాలో మిషన్‌కాకతీయ పనులు సిద్దిపేట డివిజన్‌లో ఎక్కువగా ముం దుకు సాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 300కోట్లకు పైగా పనులు ఇప్పటి వరకు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా మిషన్‌కాకతీయ పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అందోల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రతిపక్ష నేతలకు కాంట్రాక్టర్లు దక్కవద్దని చెబుతున్నారని దాని కారణంగా నియోజకవర్గంలోని అల్లాదుర్గానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి అందోల్‌కు చెందిన లక్ష్మినారాయణ అనే వ్యక్తులు ఎమ్మెల్యే తమపై గుర్రుగా ఉన్నారని ఇ ప్రిక్యూర్‌మెంట్‌ ద్వారా వచ్చిన టెండర్లు తమకే ఇవ్వాలని చెబుతున్నారు. ఇ ప్రిక్యూర్‌మెంట్‌ ద్వారా పని నోట్‌ అయినా ఐదు రోజుల లోపు అగ్రిమెంట్‌ చేయకపోతే ఆ కాంట్రాక్టర్‌కు తరువాత వచ్చి అడిగే అర్హత ఉండదని దీనికి సంబంధిత ఈఈ నచ్చజెప్పినప్పటికి కాంట్రా క్టర్‌లు ఎమ్మెల్యే మా వైపు లేడని మాకు కాంట్రాక్ట్‌ దక్కకుండా చూస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అందోల్‌ నియోజకవర్గంలో కాంట్రాక్టర్ల మద్య సమన్వ యం లేదనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా మొదలైన దాదాపు 154పనులలో సిద్దిపేటలో మినహా మిగిలిన చోట్ల పనులు మందకొడిగా సాగడం దీంతో అధి కారులు కాంట్రాక్టర్లకు మద్య ఇబ్బందికర పరిస్థితులు రావడం మొదలైంది. ఇప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మంత్రి లేక ఎమ్మెల్యే లేక జడ్‌పి చేర్మేన్‌ లేక ఆ మండలంకు సంబందించిన యంపిపి లేదా జడ్‌పిటిసిల చేత పనులు ప్రారంభించుకొని పూర్తి చేస్తున్నారు. సిద్దిపేట డివి జన్‌లో దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 18పనులు ఎమ్మెల్యేచే ప్రారంభిం చబడి ప్రారంభం అయిన తరువాత పనులు ముందుకు సాగకపోవడం అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 36పనులకు గాను 33పనులు జడ్‌పిటిసి, యంపిపిలు ప్రారంభించగా 3 పనులు మాత్రం మంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ పనులు చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. గజ్వేల్‌ నియోజక వర్గంలో మొత్తం 25పనులకు గాను 7పనులు యంపి, ఐదు పనులు మంత్రి మిగిలినవి ఆ నియోజకర్గానికి చెందిన యంపిపిలు, జడ్‌పిటిసిలు ప్రారంభిం చడం జరిగింది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం వల్ల అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1869పనులు మిషన్‌కాకతీయ కింద చేపడితే ఇప్పటివరకు 154 పనులు ఆయా ప్రజా ప్రతినిదులు ప్రారంభించడం జరిగింది. కానీ వీటిలో దాదాపు సగానికి పైగా పనులు గాడిలో పడలేదు. ఈ పనులు గాడిలో పడాలంటే అధికారులకు, కాంట్రాక్టర్లకు మద్య సమన్వయం ఉండాలి. కొన్ని పనులకు కాంట్రాక్టర్‌కు రైతులకు సమన్వయం కుదురాలి. వీరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదనేది తెలుస్తుంది.

పెళ్ళిరోజే ప్రాణాలు కోల్పోయిన సిద్ధయ్య

   
 
 


నల్లగొండ జిల్లా జానకిపురంలో తీవ్రవాదులతో పోరాడి తీవ్రంగా గాయపడిన ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడే ఆయన పెళ్ళి రోజు. జీవితంలో ఆనందించిన రోజునే అత్యంత విషాదకరమైన ఘటన జరిగిన రోజుగా ఆయన జీవితంలో మిగిలిపోయింది. ఆయన భార్య ధరణి కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్ధయ్య మరణించిన హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలోనే ఆమె రెండు రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చారు. తాను తండ్రిని అయిన విషయం కూడా తెలుసుకోకుండానే సిద్ధయ్య కన్నుమూశారు. ఎంతో సంతోషంతో సాగిపోతున్న ఈ కుటుంబం అకస్మాత్తుగా విషాదంలో మునిగిపోయింది.
 

భారత అమ్ములపొదిలో స్టెల్త్ యుద్ధనౌక


పూర్తి స్వదేశీపరిజ్ఞానంతో తయారీ -ప్రారంభించిన రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ విశాఖపట్నం, ఆగస్టు 23: రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేసి దేశీయ సంస్థలతోనే యుద్ధనౌకలు, ఆయుధవ్యవస్థలు తయారు చేయిస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యాంటీ సబ్‌మెరైన్ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ దేశరక్షణకు అవసరమైన అన్ని పరికరాలు పూర్తిగా స్వదేశీపరిజ్ఞానంతోనే తయారుచేయాలన్నది భారత్ సంకల్పం. ఆ క్రమంలోనే రూపొందిన ఐఎన్‌ఎస్ కమోర్తా దేశానికి సుదీర్ఘకాలంపాటు సేవలందిస్తుందన్న నమ్మకం నాకుంది. భౌగోళికంగా భారత్ చాలా కీలకప్రదేశంలో ఉంది. దేశానికి తీరప్రాంతం కూడా చాలా ఎక్కువ. ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న చరిత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే.. భారత్ సైనికపరంగా సర్వసన్నద్ధంగా ఉండ డం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రక్షణ ఉత్పత్తుల విషయంలో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న భారత్.. ఇకపై అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రస్తుతం అత్యాధునిక యుద్ధనౌకల తయారీలో ప్రభుత్వ రంగంలోని షిప్‌యార్డులకు, ప్రైవేటు రంగంలోని షిప్‌యార్డులు గట్టిపోటీ ఇస్తున్నాయని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అరుణ్‌జైట్లీ చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్‌డీ) ఈ నౌకను డిజైన్ చేయగా, కోల్‌కతాలోని ప్రభుత్వరంగసంస్థ గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్‌లో నిర్మించారు. ఇందులోని ఆయుధ వ్యవస్థలతోపాటు, కీలకమైన సెన్సర్లు అన్నీ పూర్తి స్వదేశీపరిజ్ఞానంతోనే తయారయ్యాయి. ఇందులో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగిన స్వల్పశ్రేణి క్షిపణులు (సామ్), రేవతి రాడార్, యాక్టివ్ టోవ్‌డ్ అరే డెకాయ్ సిస్టమ్( ఏటీడీఎస్)తో పాటు ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది.


సేల్ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు తెలంగాణ ప్రింటర్స్‌కే

అమ్మకానికి ఉంచే పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలను తెలంగాణ రాష్ర్టానికి చెందిన ముద్రణా సంస్థలకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం పొందిన ఫైల్ పాఠశాల విద్యా శాఖకు చేరింది. దీనిపై ఒకటి రెండు రోజులో ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే టెండర్ల ద్వారా సేల్ పుస్తకాల ముద్రణ బాధ్యతలు తెలంగాణ వారికే ఇచ్చేలా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారు.

ఆటోమేటిక్ ప్రమోషన్‌పై రాష్ర్టాల అభ్యంతరం


ఎనిమిదో తరగతి వరకు నిర్బంధం లేని విద్యా విధానం పట్ల పలు రాష్ర్టాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని పేర్కొన్నాయి. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానంపై సంప్రదింపుల్లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ర్టాలకు చెందిన విద్యా మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ విద్యా మంత్రి పరస్‌చందర్ మాట్లాడుతూ, ఆటోమేటిక్ క్లాస్ ప్రమోషన్ వల్ల విద్యార్థులు ఎనిమిదో తరగతి వరకూ ఫెయిర్ కారని, అలాగే ఆ తరువాత పై తరగతికి ప్రమోషన్ కూడా పొందలేరని వివరించారు. ఈ వాదనతో అస్సాం, నాగాలాండ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల మంత్రులు ఏకీభవించారు. హర్యానా విద్యామంత్రి గీతా బుక్కల్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది క్లాస్ ప్రమోషన్ల విధానాన్ని సిఫార్సు చేసింది. విద్యా హక్కు చట్టంతోపాటే ఈ వివాదాస్పద విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రతిభతో నిమిత్తం లేకుండా విద్యార్థి ఎనిమిదో తరగతి వరకు ప్రమోట్ అవుతాడు. పాఠశాల పరీక్ష వ్యవస్థను సంస్కరించడం ఈ సంప్రదింపుల్లో ఓ భాగమని పాఠశాల విద్యా శాఖకార్యదర్శి వృందా సరూప్ చెప్పారు.

ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలి


రాజ్యసభలో తెలంగాణ ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ:ప్రాణహిత- చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి ఉద్దేశించిన బిల్లుపై రాజ్యసభలో శుక్రవారం చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చటంతోపాటు కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై కూడా కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో ఆ ప్రాంత ఉద్యోగుల ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ శాసనమండలి సభ్యుల సంఖ్యను పెంచడంతోపాటు తెలంగాణ, ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్యను కూడా పెంచాలని కోరారు. ఎంకే ఖాన్ మాట్లాడుతూ రెండు రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీ హనుమంతరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సత్వరం జాతీయ హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. హైకోర్టు విభజన, ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయ హోదా, గిరిజన, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు వంటి హామీలేవీ నోచుకోలేదన్నారు. రేణుకాచౌదరి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, రాజకీయ పార్టీలు, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ర్టాల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక లోపాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులివ్వాలని సుబ్బిరామిరెడ్డి కోరారు. విభజన బిల్లులో తీవ్రమైన లోపాలేమీ లేవని కాంగ్రెస్ సభ్యుడు జేడీ శీలం అన్నారు. నాడు సమర్థించిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదని ప్రశ్నించారు. విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. నాలుగు రోజుల క్రితమే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించిం ది. ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి ఉద్దేశించిన ఈ బిల్లును సభలో ఎవ్వరూ వ్యతిరేకించలేదు. దీంతో బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.


ఖాళీల లెక్కలివ్వండి...

శాఖలవారీగా వివరాలు కోరుతున్న సర్కారు -నాలుగురోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సీఎస్ -1,07,744 ఖాళీలున్నట్లు ప్రాథమిక అంచనా హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కోటి ఆశలతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను తీర్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్ర ఉద్యోగుల సంఖ్య తేలనప్పటికీ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రాష్ట్రంలో 1,07,744 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. కేంద్రం ఉద్యోగుల విభజనను ఖరారు చేయగానే మిగిలిన సిబ్బంది సంఖ్య తెలుస్తుందని, దీంతో వెనువెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాఖలవారీగా ప్రస్తుతమున్న ఖాళీల వివరాలను తెప్పించుకుంటున్నది. ఉద్యోగ నియామకాల కసరత్తు ప్రక్రియలో మొదటి అడుగును దాటేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నాలుగురోజులుగా శాఖలవారీగా నేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గురువారంనాడు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖాళీల నియామకాలను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడంతో తెలంగాణకు ఎంతమంది మిగులుతారో తేలడం లేదు. ఎక్కువమంది ఆంధ్రా ఉద్యోగులు వర్క్ టూ ఆర్డర్ కింద తెలంగాణలో పని చేస్తుండగా, తెలంగాణ ఉద్యోగులు కొంతమంది ఆంధ్రాలో పనిచేస్తున్నారు. ఉద్యోగుల విభజనకు తుదిరూపం వస్లే ఏ రాష్ట్రంలో ఎంతమంది పనిచేయాలనే లెక్క తేలుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగుల ఖాళీలు లక్ష నుంచి లక్షన్నర వరకు తేలే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకుడొకరు అన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే శాఖలవారీగా ఖాళీల లెక్కలను సర్కారు తీసుకున్నది. విభజన ప్రక్రియ పూర్తికాగానే రోస్టర్ పాయింట్లు కూడా నిర్ధారించుకొని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.


Followers